Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్..

పావనీ కరణం.. ఈ పేరు చెప్తే గుర్తు పట్టకపోవచ్చు కానీ.. మనిషిని చూసిన వాళ్లకి మాత్రం వెంటనే పుష్ప సినిమా గుర్తొస్తుంది. ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన మూవీ "పుష్ప ". ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించింది. దాదాపు రూ. 1850 కోట్ల వసూళ్లు సాధించి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. అయితే ఈ సినిమాలో పుష్ప రాజ్ ను చిన్నాయన అంటూ పిలిచే అమ్మాయి క్యారెక్టర్ అందరికీ తెలిసిందే. పుష్ప 2 సినిమా స్టోరీని మలుపు తిప్పే క్యారెక్టర్ లో పావని కరణం అనే నటి నటించింది.

ఈ సినిమా ఘన విజయం సాధించడంతో ఈ నటి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. మంచిర్యాలకు చెందిన ఈమె.. వెండితెరపై నటిగా కనిపించాలని తపనతో యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకుని అవకాశాల కోసం ఎన్నో ఆడిషన్లలో పాల్గొంది. ఈ తరుణంలో చిన్నచిన్న సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించే అవకాశం లభించింది. ఆ విధంగా తిరువీర్ హీరోగా చేసిన "పరేషాన్" సినిమాలో కనిపించి మెప్పించింది. ఈ సినిమాలో 'సమోసా తింటావా శిరీష 'అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

actress-pavani-karanam-who-got-fame-for-allu-arjun-pushpa-movie-latest-photos-goes-viral-on-social-m

ఆ తర్వాత 'పైలం పిల్లగా' అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. దీంతోపాటు హిట్ 2 టూలో కూడా ఓ చిన్న పాత్రలో నటించి మెప్పించింది. అలాగే ఈ అమ్మడు షార్ట్ ఫిలిమ్స్ లో సిరీస్లలో కూడా నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలు, సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉన్న ఈమె సోషల్ మీడియాలో కూడా తెగ రచ్చ చేస్తుంది. నిత్యం ఈ అమ్మడు తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్డేట్స్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది. అలాగే తన హాట్ హాట్ ఫోటోలకును సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్రకారుకు చెమటలు పట్టిస్తుంది.

ఈ క్రమంలోనే నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా, నటి, సామాజిక సేవకురాలు లక్ష్మీ మంచు నేతృత్వంలో నిర్వహించిన టీచ్ ఫర్ ఛేంజ్ వార్షిక నిధుల సేకరణ కార్యక్రమం 2026.. హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ నిధుల సేకరణ కార్యక్రమంలో భాగంగా టాలీవుడ్ నటీనటులు ర్యాంప్ వాక్ చేశారు. లక్ష్మీ మంచు, పాయల్ రాజ్‌పుట్, సీరత్ కపూర్, హెబ్బా పటేల్, ఫరియా అబ్దుల్లా, సుహాసిని, జయప్రద వంటి సీనియర్ సహా పలువురు యంగ్ స్టార్స్ వేదికను మురిపించారు. ఈ వేడుకలో పాల్గొన్న పావని ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

actress-pavani-karanam-who-got-fame-for-allu-arjun-pushpa-movie-latest-photos-goes-viral-on-social-m
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+