మెగా కాంపౌండ్ లో జోష్: పెళ్లి తేదీ అనౌన్స్
అల్లు శిరీష్ తన వివాహ తేదీని అధికారికంగా ప్రకటించాడు. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. దీనిపై సరదాగా ఓ రీల్ పోస్ట్ చేశాడు. తన మేనకోడళ్లు, మేనల్లుడితో కలిసి చేసిన ఈ రీల్ క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ క్రియేటివ్ వీడియో అభిమానుల దృష్టిని తనవైపు తిప్పుకొంది. అల్లు శిరీష్ తన ప్రియురాలు నయనికతో కలిసి 2026 మార్చి 6వ తేదీన పెళ్లిపీటలు ఎక్కనున్నాడు. ఈ వీడియో ద్వారా అతను ఈ విషయాన్ని వెల్లడించాడు.
అల్లు శిరీష్, నయనికల నిశ్చితార్థ వేడుక ఈ ఏడాది అక్టోబర్ 31వ తేదీన జరిగిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది అల్లు అరవింద్ కుటుంబం. ఈ సందర్భంగా వారు ఉంగరాలు మార్చుకున్నారు. అప్పట్లో పెళ్లి తేదీని వెల్లడించలేదు. 2026లో పెళ్లి జరుగుతుందనే హింట్ ఇచ్చారు. దీనికి అనుగుణంగా తాజాగా పెళ్లి తేదీని ప్రకటించాడు అల్లు శిరీష్.

టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్న శిరీష్‌కు అభిమానుల నుండి అభినందనలు వెల్లువెత్తాయి. అల్లు అర్జున్, రామ్ చరణ్, చిరంజీవి వంటి అల్లు కుటుంబంలోని టాప్ సెలెబ్రెటీలందరూ ఈ పెళ్లి వేడుక సందర్బంగా ఒకే వేదిక మీదికి రాబోతోండటం ఇప్పటి నుంచే అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. ఉత్సాహాన్ని రేకెత్తించింది. హల్దీ, సంగీత్, వివాహ వేదిక.. వంటి ఇతర కార్యక్రమాల వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.
-
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్












Click it and Unblock the Notifications