"మన శంకర వరప్రసాద్ గారు" మూవీలో ఈ విషయాన్ని గమనించారా..?
మెగాస్టార్ చిరంజీవి నటించిన "మన శంకర వరప్రసాద్ గారు" బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. అపజయమే ఎరుగని దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో.. వింటేజ్ బాస్ ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మెగాస్టార్ మ్యానరిజమ్, అనిల్ రావిపూడి టేకింగ్, విక్టరీ వెంకటేష్ కాంబో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి చిరు - అనిల్ కాంబో ప్రేక్షకులకు పండుగ ట్రీట్ ఇచ్చారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ఈ క్రమంలోనే మూవీ యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం బయటపెట్టారు. ఈ కార్యక్రమంలో యాంకర్ ఓ అమ్మాయిని ఏ పాత్ర చేశానని అడగ్గా.. 'విక్కీ' అని ఊహ సమాధానం ఇచ్చింది. దీంతో అభిమానులు ఈ విషయాన్ని మూవీలో గమనించలేదా అని చర్చ నడుస్తోంది.

ఈ సినిమాలో చిరంజీవి, నయనతారలకు ఇద్దరు పిల్లలు ఉంటారు. వారిలో ఒక అమ్మాయి, ఒక కొడుకు ఉన్నారు. అయితే ఇందులో అబ్బాయిగా 'విక్కీ' అనే పాత్ర అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే ఆ పాత్రలో నటించింది అబ్బాయి కాదని.. "ఊహ" అనే అమ్మాయి అని తెలిసి అంతా షాక్ అవుతున్నారు. ఈ పాత్ర కోసం చిన్నారి తన పొడవాటి జుట్టును కత్తిరించుకుని అబ్బాయిలా మారిపోయిందని డైరెక్టర్ అనిల్ చెప్పుకొచ్చారు.
అలానే చిరంజీవి కెరీర్లో క్లాసిక్ హిట్‌గా నిలిచిన 'పసివాడి ప్రాణం' సినిమాలో కూడా పిల్లాడిగా నటించింది ఒక అమ్మాయి (సుజిత). మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత 'మన శంకర వరప్రసాద్'లో కూడా అలాంటి సంఘటనే జరిగిందని గుర్తు చేసుకున్నారు. ఇది ప్లాన్ చేసి చేయలేదని.. ఈ మధ్యే ఈ విషయాన్ని గమనించానని అనిల్ చెప్పుకొచ్చారు.
ఇక ప్రీమియర్స్ నుండే మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ. 84 కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసినట్టు చిత్ర బృందం అనౌన్స్ చేసింది. వీటికి తోడు ఫెస్టివల్ హాలిడేస్, వీకెండ్ కావడంతో హౌస్ ఫుల్ బుకింగ్స్ నడుస్తున్నాయి. ఈ లెక్కన చూస్తే ఈ మూవీతో మరోసారి మెగాస్టార్ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.
-
తెలుగులో తొలి ఏఐ సినిమా! -
అల్లు అర్జున్‌కు బాగా ఇష్టమైన మహేష్‌బాబు సినిమా -
12 రోజుల్లో రూ.1400 కోట్లు.. చరిత్ర తిరగరాసిన ‘ధురంధర్2’ -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
ఇండస్ట్రీలో ఉండాలంటే కమిట్మెంట్ కు ఒప్పుకోవాల్సిందే: నటి సంచలన కామెంట్స్ వైరల్ -
టాలీవుడ్ vs పొలిటీషియన్స్: డ్రగ్స్ టెస్ట్ రచ్చ! -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
మహేష్‌బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్! -
పిల్ల బచ్చా గాళ్ల సినిమాకు.. అద్దిరిపోయే కలెక్షన్స్.. -
అర్ధరాత్రి 2 గంటలకు ఆ హీరోయిన్ తో తట్టుకోలేక పారిపోయా.. సమంత షాకింగ్ కామెంట్స్ -
ఓటీటీని వణికిస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒంటరిగా ఉండే వారే టార్గెట్ !!












Click it and Unblock the Notifications