Champion Trailer: ట్రైలర్ అదిరిపోయింది భయ్యా..
తెలంగాణ జలియన్ వాలాబాగ్ గా పేరొందిన వరంగల్ జిల్లా బైరాన్‌పల్లి యథార్థ సంఘటనను స్ఫూర్తిగా తీసుకుని తీసిన చిత్రం ఛాంపియన్. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ రిలీజ్ వేడుకకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా వచ్చి చిత్ర యూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. సినిమా ఘనవిజయం సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై లెజెండరీ నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. క్రిస్మస్ కానుకగా ఈ మూవీ డిసెంబర్ 25 న విడుదల కానుంది.
టాలీవుడు ప్రముఖ నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్ కథానాయకుడిగా.. అనస్వర రాజన్ హీరోయిన్ గా.. ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఛాంపియన్.. తెలంగాణలో నిజాం పాలన సమయంలో వరంగల్ జిల్లా బైరాన్‌పల్లిలో జరిగిన యథార్థ సంఘటనను స్ఫూర్తిగా తీసుకుని ఆ కథకు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ జోడించి తీసిన చిత్రం ఇది. డైరెక్టర్ ప్రదీప్ అద్వైతంకు తొలి సినిమా ఇది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశారు. చిత్ర యూనిట్ కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. సినిమా ఘన విజయం సాధించాలని విష్ చేశారు.
ఇక ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న ప్రదీప్ అద్వైతం ఇదివరకు పలు సినిమాలకు రైటర్ గా పనిచేశారు. దర్శకుడిగా ఆయన తొలి సినిమా ఇదే కావడం విశేషం. ట్రైలర్ చూసిన నెటిజన్లు.. సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని కామెంట్స్ పెడుతున్నారు. అడ్వాన్స్ కంగ్రాట్స్ చెబుతున్నారు. డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం అంతకుముందు సేవ్ ది టైగర్స్ అనే వెబ్ సిరీస్ కు రైటర్ గానూ పని చేశారు. ఇక ఛాంపియన్ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ఇప్పటికే రిలీజైన పాటలు సూపర్ హిట్ అయ్యాయి.

2016 లో నిర్మలా కాన్వెంట్ సినిమాతో శ్రీకాంత్ కుమారుడు రోషన్ తెలుగు చిత్రసీమకు ఎంట్రీ ఇచ్చాడు. అక్కినేని నాగార్జున ఈ సినిమా నిర్మించారు. ఆ తర్వాత ఐదేళ్ల గ్యాప్ తర్వాత 2021 లో తెరకెక్కిన 'పెళ్లి సందడి' సినిమాతో రోషన్ తొలి హిట్ కొట్టాడు. దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు తెరకెక్కించిన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంతోనే శ్రీలీల వెండితెరకు పరిచయమైంది. కాగా రోషన్ కు ఇది మూడో చిత్రం.
-
తెలుగులో తొలి ఏఐ సినిమా! -
అల్లు అర్జున్‌కు బాగా ఇష్టమైన మహేష్‌బాబు సినిమా -
12 రోజుల్లో రూ.1400 కోట్లు.. చరిత్ర తిరగరాసిన ‘ధురంధర్2’ -
ఓటీటీని వణికిస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒంటరిగా ఉండే వారే టార్గెట్ !! -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
టాలీవుడ్ vs పొలిటీషియన్స్: డ్రగ్స్ టెస్ట్ రచ్చ! -
తెలుగు హీరోయిన్ వీడియో వైరల్ !! -
పిల్ల బచ్చా గాళ్ల సినిమాకు.. అద్దిరిపోయే కలెక్షన్స్.. -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
అర్ధరాత్రి 2 గంటలకు ఆ హీరోయిన్ తో తట్టుకోలేక పారిపోయా.. సమంత షాకింగ్ కామెంట్స్ -
మహేష్‌బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్!










Click it and Unblock the Notifications