ఓటీటీలోకి 'ధురంధర్'.. తెలుగు వెర్షన్ ను ఎందులో చూడాలంటే..?
ఆదిత్య ధర్ - రణ్ వీర్ సింగ్ కాంబోలో తెరకెక్కిన 'ధురంధర్' మూవీ విడుదలైనప్పటి నుంచి ఎవరూ ఊహించనంతగా భారీ రేంజ్ లో రెస్పాన్స్ ను అందుకుంటుంది. ఇప్పటివరకూ ఈ మూవీ రూ. 1300 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి బాలీవుడ్ హిస్టరీలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది. మూవీ విడుదలై రెండు నెలలు కావొస్తున్నా ఇప్పటికీ బుక్ మై షో యాప్ ద్వారా పాతిక వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతుండటం గమనార్హం. కొత్త సినిమాలు వస్తున్నాయి.. పోతున్నాయి.. కానీ ధురంధర్ చిత్రం మాత్రం ఇప్పటికీ బుక్ మై షో యాప్ లో ట్రెండ్ అవుతూనే ఉండటం గమనార్హం.
అయితే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ మూవీ జనవరి 30 న నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానుంది. ఈ ధురంధర్ మూవీ అన్ని ప్రాంతీయ భాషలకు సంబంధించిన ఓటీటీ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సంస్థ రూ. 280 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అయితే ఈ మూవీ థియేట్రికల్ వెర్షన్ తెలుగులో రిలీజ్ అవుతుందని ఆశించారు. కానీ కుదర్లేదు.. ఇప్పుడు తెలుగు వెర్షన్ లో ఈ చిత్రం ఈ నెల 30 నుండి నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానుంది. దీంతో తెలుగు ఆడియన్స్ తెగ సంబరపడిపోతున్నారు.

మరోవైపు 'ధురంధర్ 2' సినిమాను మార్చి 19 న హిందీ, తెలుగుతోపాటు, ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. ఈ మేరకు త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన టీజర్ ను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ మూవీ టీజర్ కోసం యావత్ సినీ ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో రణ్ వీర్ సింగ్ తో పాటు బాలీవుడ్ సీనియర్ నటుడు అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, సారా అర్జున్, రాకేష్ బేడీ, మానవ్ గోహిల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. శాశ్వత్ సచ్ దేవ్ సంగీతం అందించారు. ఈ మూవీని జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య ధర్, లోకేష్ ధర్ సంయుక్తంగా నిర్మించారు.
-
కొత్త `రామాయణం`- ప్రభాస్ మూవీపై భారీ ట్రోల్స్ -
తెలుగు హీరోయిన్ వీడియో వైరల్ !! -
7.5 గంటల సినిమా? ఇండియన్ సినీ హిస్టరీలో బిగ్గెస్ట్ ఎక్స్పెరిమెంట్! -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్! -
ఓటీటీని వణికిస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒంటరిగా ఉండే వారే టార్గెట్ !! -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
ఓటీటీలోకి రాధిక బ్లాక్ బస్టర్ మూవీ.. ఇప్పుడే చూసేయండి..! -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
12 రోజుల్లో రూ.1400 కోట్లు.. చరిత్ర తిరగరాసిన ‘ధురంధర్2’ -
భారీగా ఆస్తులు కూడబెట్టిన త్రిష.. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో వీటిపై తీవ్ర చర్చ












Click it and Unblock the Notifications