'కాంతారా' హీరో రిషబ్ శెట్టి డైరెక్షన్ లో టాలీవుడ్ స్టార్ హీరో..?
సాధారణంగా ఇండస్ట్రీలో గుర్తింపు రావాలంటే చాలా ఏళ్లపాటు శ్రమించాలి. వచ్చిన ప్రతి క్యారెక్టర్ చేయాలి. అలా జనాల్లో గుర్తింపు వస్తుంది. అయితే కొంతమంది తమ టాలెంట్ తో ఓవర్ నైట్ లోనే స్టార్స్ అయిపోతారు. ఒక్క సినిమాతోనే పాన్ ఇండియా రేంజ్ లో షాక్ ఇస్తారు. కన్నడ స్టార్ హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి ఆ కోవకే చెందుతారు. కాంతార, కాంతారా చాప్టర్ 1 సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో విధ్వంసం సృష్టించారు. ఇటీవల రిలీజైన కాంతారా చాప్టర్ 1 మూవీని ఆయనే దర్శకత్వం వహించడమే కాకుండా హీరోగా చేశారు. తన దర్శకత్వ ప్రతిభ, నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేశారు.
కాంతారా చాప్టర్ 1 మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ఈ సినిమాకు దాదాపు రూ. 1000 కోట్లకు చేరువలో కలెక్షన్లు రావడం విశేషం. దసరా కానుకగా అక్టోబర్ 2 న విడుదలైన ఈ మూవీ థియేటర్ల వద్ద సునామీ సృష్టించింది. దీంతో ఆయన నుంచి ఏ అప్డేట్ వస్తుందా అని సినీ అభిమానులు ఆత్రుతగా చూస్తున్నారు. ప్రస్తుతం రిషబ్ శెట్టి.. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో జై హనుమాన్ చిత్రంలో నటిస్తున్నారు. అయితే తాజాగా ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.
రిషబ్ శెట్టికి టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఓ స్టోరీ చెప్పారట. అది ఆయనకు విపరీతంగా నచ్చినట్లు టాక్. ఇక రిషబ్ శెట్టి, ఎన్టీఆర్ ఎంత క్లోజ్ ఫ్రెండ్సో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల కాంతారా చాప్టర్ 1 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సైతం ఎన్టీఆర్ చీఫ్ గెస్టుగా వచ్చారు. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ కు చాలా కమిట్ మెంట్స్ ఉన్నాయి.

ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో ఓ మూవీ చేస్తున్నారు ఎన్టీఆర్. ఇక దేవర 2 కూడా ఉంది. అలాగే తమిళ డైరెక్టర్ నెల్సన్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈ క్రమంలో ఇవన్నీ పూర్తయ్యాకే రిషబ్ శెట్టి- ఎన్టీఆర్ కాంబో ట్రాక్ పైకి వస్తుందని టాక్ వినిపిస్తోంది. మరోవైపు రిషబ్ శెట్టి.. కాంతారా చాప్టర్ 2 చేయాల్సి ఉంది. అలాగే శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర కూడా చేయాల్సి ఉంది. మరి చూడాలి ఈ క్రేజీ కాంబో ఎప్పుడు పట్టాలెక్కుతుందో..
-
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
టాలీవుడ్ vs పొలిటీషియన్స్: డ్రగ్స్ టెస్ట్ రచ్చ! -
తెలుగు హీరోయిన్ వీడియో వైరల్ !! -
పిల్ల బచ్చా గాళ్ల సినిమాకు.. అద్దిరిపోయే కలెక్షన్స్.. -
అర్ధరాత్రి 2 గంటలకు ఆ హీరోయిన్ తో తట్టుకోలేక పారిపోయా.. సమంత షాకింగ్ కామెంట్స్ -
మహేష్‌బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా -
ఓటీటీని వణికిస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒంటరిగా ఉండే వారే టార్గెట్ !! -
'పెద్ది' సినిమా వాయిదా..? నిర్మాత సంచలన ప్రకటన.. -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
సింగర్ గానే షేక్ చేసేసింది.. డాన్సర్‌గా అంటే థియేటర్స్ తగలబడడమే !! -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్!












Click it and Unblock the Notifications