దిగ్గజ నటుడు కన్నుమూత: మార్షల్ ఆర్ట్స్ ప్రపంచంలో ముగిసిన శకం!
హాలీవుడ్ యాక్షన్ చిత్రాల చరిత్రలో తనకంటూ ఓ చెరగని ముద్ర వేసిన అజేయ యోధుడు, మార్షల్ ఆర్ట్స్ దిగ్గజం చక్ నోరిస్(86) తుదిశ్వాస విడిచారు. చక్ నోరిస్ మరణవార్తను కుటుంబ సభ్యులు ధ్రువీకరిస్తూ.. ఆయన ప్రశాంతంగా కన్నుమూశారని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ వార్త తెలియగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. చక్ నోరిస్ కేవలం ఓ నటుడు మాత్రమే కాదు.. ఓ తరానికి ధైర్యానికి, తిరుగులేని పోరాట పటిమకు నిలువెత్తు రూపం.
పేదరికం నుంచి పోరాట యోధుడిగా..
చక్ నోరిస్ జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. 1940లో ఓక్లహోమాలో జన్మించిన చక్ నోరిస్.. అత్యంత పేదరికంలో పెరిగారు. స్కూల్ రోజుల్లో చాలా తక్కువ ఆత్మవిశ్వాసంతో, అంతగా చురుగ్గా లేని ఆయన జీవితం అమెరికా ఎయిర్‌ఫోర్స్‌లో చేరాక మలుపు తిరిగింది. కొరియాలో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో మార్షల్ ఆర్ట్స్‌పై మక్కువ పెంచుకుని అక్కడ కరాటే, జూడో వంటి విద్యల్లో ప్రావీణ్యం సంపాదించారు. ఆ పట్టుదలే ఆయనను ఆరుసార్లు వరుసగా అజేయ వరల్డ్ ప్రొఫెషనల్ మిడిల్ వెయిట్ కరాటే ఛాంపియన్‌గా నిలబెట్టింది.

బ్రూస్ లీతో చరిత్రాత్మక పోరు!
చక్ నోరిస్ సినీ ప్రస్థానంలో 1972లో వచ్చిన 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' సినిమా ఓ మైలురాయి. రోమ్ నగరంలోని ప్రసిద్ధ కొలీజియంలో లెజెండరీ బ్రూస్ లీతో ఆయన తలపడే క్లైమాక్స్ ఫైట్ సీన్ ఇప్పటికీ సినీ చరిత్రలో 'గ్రేటెస్ట్ ఫైట్ సీన్'గా నిలిచిపోయింది. ఆ తర్వాత 'మిస్సింగ్ ఇన్ యాక్షన్', 'ది డెల్టా ఫోర్స్' వంటి చిత్రాలతో ఆయన తిరుగులేని యాక్షన్ స్టార్‌గా ఎదిగారు. ముఖ్యంగా 'వాకర్, టెక్సాస్ రేంజర్' అనే టీవీ సిరీస్ ద్వారా దాదాపు దశాబ్దం పాటు ప్రతి ఇంట్లో ఓ 'సూపర్ హీరో'గా మారిపోయారు.
సోషల్ మీడియా సెన్సేషన్
ప్రపంచవ్యాప్తంగా చక్ నోరిస్ పేరు ఎంతలా మారుమోగిందంటే.. ఆయన బలాన్ని వర్ణిస్తూ ఇంటర్నెట్‌లో లక్షలాది 'చక్ నోరిస్ ఫ్యాక్ట్స్' పుట్టుకొచ్చాయి. "చక్ నోరిస్ ఉల్లిపాయలను కోయడు.. ఆయన్ని చూసి ఉల్లిపాయలే ఏడుస్తాయి", "ఆయన గడియారం పెట్టుకోడు, సమయం ఎంత అవ్వాలో ఆయనే నిర్ణయిస్తాడు" వంటి ఫన్నీ కోట్స్ ఆయన ఇమేజ్‌ను మరింత పెంచాయి. తనపై వచ్చే ఈ సరదా జోకులను ఆయన ఎంతో హుందాగా స్వీకరించి, తన 'ఫ్యాక్ట్ బుక్' ద్వారా పిల్లల సంక్షేమం కోసం నిధులను కూడా సేకరించారు.
చక్ నోరిస్ మరణం యాక్షన్ సినిమాలకు తీరని లోటు. ఆయన కేవలం ఒక యాక్షన్ హీరోగా మాత్రమే కాకుండా, క్రమశిక్షణ, దేశభక్తి, మానవత్వం కలిగిన ఓ గొప్ప వ్యక్తిగా ఎప్పటికీ గుర్తుండిపోతారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications