పవన్ కళ్యాణ్ కొత్త హెయిర్ స్టైల్ వెనుక రీజన్ ఇదేనా..?
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... హీరోలకు ఫ్యాన్స్ ఉండడం సహజమే కానీ పవన్ కళ్యాణ్‌కు ఫ్యాన్స్ మాత్రమే కాదు, హీరోల్లోనే అభిమానులు ఉంటారు. ఆయన సినిమాలకు హిట్, ఫ్లాప్ లతో సంబంధం ఉండదంటే అతిశయోక్తి కాదు. ఒక వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే.. మరోవైపు తాను కమిట్ అయిన సినిమాలను ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. ఈ ఏడాది వరుసగా రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్.. "హరిహర వీరమల్లు" చిత్రంతో నిరాశపరిస్తే.. "ఓజీ" మూవీతో భారీ హిట్ ఖాతాలో వేసుకున్నారు.
మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ కూడా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. లేటెస్ట్ గానే ఈ చిత్రానికి సంబంధించి తన వంతు షూటింగ్ కూడా ఫినిష్ చేసేశారు పవర్ స్టార్. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల హీరోయిన్గా నటిస్తుంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్న ఈ మూవీని.. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

కాగా ప్రస్తుతం తన సమయం అంతా పాలిటిక్స్ కి మాత్రమే కేటాయిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. కానీ ఈ క్రమంలోనే లేటెస్ట్ గా ఆయన హెయిర్ స్టైల్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. గత కొద్దిరోజులుగా పవన్ హెయిర్ స్టైల్ గమనిస్తే ఎప్పటి లాగా కాకుండా కొత్తగా కనిపిస్తున్నారు. పొలిటికల్ ఈవెంట్స్ లలో, దర్శకుడు సుజిత్ కి కారు గిఫ్టుగా ఇచ్చిన ఫోటోలలో కూడా ఈ విషయాన్ని గమనించవచ్చు. దీంతో పవన్ అసలు షార్ట్ హెయిర్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నారని చర్చ నడుస్తోంది.
అసలు కారణం అదే..!
అయితే "ఉస్తాద్ భగత్ సింగ్" సినిమా అట్లీ దర్శకత్వంలో విజయ్ నటించిన "తేరి" చిత్రానికి రీమేక్ అని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ హరీష్ సైతం రీమేక్ లో కొత్త పోర్షన్ మాత్రం తీసుకుంటున్నట్టు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ మేరకు ఆ మూవీ కోసమే ఇలా షార్ట్ హెయిర్ పెంచారని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయబోయే మూవీ కోసమే ఇలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి కారణం ఏదైనా కానీ పవన్ కొత్త హెయిర్ స్టైల్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
-
తెలుగులో తొలి ఏఐ సినిమా! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
టాలీవుడ్ vs పొలిటీషియన్స్: డ్రగ్స్ టెస్ట్ రచ్చ! -
తెలుగు హీరోయిన్ వీడియో వైరల్ !! -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
పిల్ల బచ్చా గాళ్ల సినిమాకు.. అద్దిరిపోయే కలెక్షన్స్.. -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్! -
అర్ధరాత్రి 2 గంటలకు ఆ హీరోయిన్ తో తట్టుకోలేక పారిపోయా.. సమంత షాకింగ్ కామెంట్స్ -
ఓటీటీని వణికిస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒంటరిగా ఉండే వారే టార్గెట్ !! -
అమరావతి పై కేంద్రం భారీ శుభవార్త, కొత్త చరిత్ర..!!











Click it and Unblock the Notifications