ఆ సినిమాని అందరూ చూడాలంటున్న పవన్ మాజీ భార్య.. ఓజీ కాదు !
రేణూ దేశాయ్.. ప్రముఖ నటి, నిర్మాత, సామాజిక కార్యకర్తగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. పవన్ కళ్యాణ హీరోగా నటించిన 'బద్రి' సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమై.. తొలి సినిమాతోనే ప్రేక్షకుల హృదయాల్లో చోటు దక్కించుకుంది. ఆ తర్వాత మళ్లీ పవన్ కి జోడీగా "జానీ" సినిమాలో నటించి మెప్పించింది. ఆ తరువాత చాలా కాలం సినిమాలకు కొంత దూరంగా ఉన్నారు. ఇటీవల రవితేజ నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాలో ముఖ్యపాత్రలో నటించి రీ ఎంట్రీ ఇచ్చింది.
ప్రస్తుతం సినిమాలు ఏం చేయకపోయినా.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు అంశాలపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. కాగా ఇప్పుడు రేణూ దేశాయ్ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. సోషల్ మీడియా వేదికగా ఒక సినిమా గురించి ప్రశంసలు కురిపించింది. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ మూవీని చూడాలని కోరింది. దాంతో అసలు ఆ మూవీ ఏంటి ? ఆమెకు అంతగా నచ్చిందా అంటూ తెగ చర్చ జరుగుతోంది.

"ధురంధర్"పై ప్రశంసలు..
కాగా రేణూ దేశాయ్ మనసుకు బాగా నచ్చిన మూవీ "ధురంధర్". బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ హీరోగా.. నాన్న మూవీ ఛైల్డ్ ఆర్టిస్ట్ సారా అర్జున్ హీరోయిన్ గా ఈ మూవీ తెరకెక్కింది. దేశ భక్తి నేపథ్యంలో స్పై థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీకి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. మాధవన్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. రిలీజ్ కి ముందు ఈ సినిమాకు అడ్డంకులు ఎదురైన.. విడుదల తర్వాత మాత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టేస్తోంది. విడుదలైన మూడు రోజల్లోనే వంద కోట్ల క్లబ్ లో చేరి మళ్లీ హిందీ చిత్ర సీమలో ఫామ్ నింపింది. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు.
సామాన్య ప్రేక్షకులే కాకుండా పలువురు ప్రముఖులు కూడా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నటి రేణూ దేశాయ్ కూడా ధురంధర్ సినిమాను వీక్షించింది. అనంతరం సినిమాపై తన అభిప్రాయాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో.. ప్రతి ఒక్క భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా ధురంధర్ అని రాసుకొచ్చింది.

ఆదిత్య ధర్ ఒక బ్రిలియంట్ మాస్టర్‌పీస్ ఇచ్చారని.. మనల్ని రోజూ క్షేమంగా ఉంచడానికి ఇండియన్ ఆర్మీ, మన రక్షణ దళాలు 24×7 కష్టపడుతున్నారని గుర్తు చేశారన్నారు. మనం వాళ్ల వల్లే ఈ రోజు స్వేచ్ఛగా ఉండగలుగుతున్నామని.. ఈ సినిమా చూస్తే ఆ విషయం మరింత లోతుగా అర్థమవుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ దేశం పక్షాన నిలబడాల్సిన సమయం ఇది పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
-
కొత్త `రామాయణం`- ప్రభాస్ మూవీపై భారీ ట్రోల్స్ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
12 రోజుల్లో రూ.1400 కోట్లు.. చరిత్ర తిరగరాసిన ‘ధురంధర్2’ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్! -
టాలీవుడ్ vs పొలిటీషియన్స్: డ్రగ్స్ టెస్ట్ రచ్చ! -
పిల్ల బచ్చా గాళ్ల సినిమాకు.. అద్దిరిపోయే కలెక్షన్స్.. -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
అర్ధరాత్రి 2 గంటలకు ఆ హీరోయిన్ తో తట్టుకోలేక పారిపోయా.. సమంత షాకింగ్ కామెంట్స్ -
మహేష్‌బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా












Click it and Unblock the Notifications