పేరు మార్చుకున్న సమంత.. రెండో పెళ్లి తర్వాత సంచలన నిర్ణయం.. ఇకపై..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. 2010 లో ఏమాయె చేశావే చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది సమంత. ఆ తర్వాత బృందావనం, దూకుడు, ఈగ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది చిత్రాలతో వరుస హిట్స్ అందుకుంది. అటు తమిళంలోనూ పలు హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ సెపరేట్ ఫ్యాన్స్ ను ఏర్పరుచుకుంది. ఇక అక్కినేని నాగ చైతన్యతో ప్రేమ వివాహం చేసుకుంది సమంత. వీరి వివాహం 2017 అక్టోబర్ లో జరిగింది. అయితే 2021 లో వ్యక్తిగత కారణాలతో ఈ దంపతులు విడిపోయారు. ఆ తర్వాత ఎవరి జీవితం వారు గడుపుతున్నారు.
ఇక నాగ చైతన్యతో విడాకుల తర్వాత సామ్ తన కెరీర్‌పై ఫోకస్ పెట్టింది. అయితే గతేడాది డిసెంబర్ లో బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరును భూత శుద్ధి పద్ధతిలో వివాహం చేసుకుంది సమంత. సమంత, రాజ్ నిడిమోరుల పరిచయం 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ ద్వారా స్టార్ట్ అయింది. రాజ్, కృష్ణ డీకే కలిసి ఈ సిరీస్ కు దర్శకత్వం వహించారు. అప్పటినుంచి వీరి మధ్య ఏర్పడిన అనుబంధం పెళ్లి వరకూ వెళ్లింది. ప్రస్తుతం వీరిద్దరూ తమ ప్రొఫెషనల్ లైఫ్‌లో ఎంతో బిజీగా ఉన్నారు.

అయితే తాజాగా సమంత తన భర్త రాజ్ కోసం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సమంత ప్రధాన పాత్రలో నందినీ రెడ్డి దర్శకత్వంలో 'మా ఇంటి బంగారం' అనే ఫ్యామిలీ, యాక్షన్, డ్రామాగా తెరకెక్కుతోంది. అయితే ఈ మూవీ టైటిల్ కార్డులో సమంత తన పేరును 'సమంత నిడిమోరు' గా మార్చుకోబోతోందని సమాచారం. గతంలో చైతన్యతో పెళ్లి తర్వాత తన పేరును సమంత అక్కినేనిగా మార్చుకున్న సామ్.. ఇప్పుడు రెండో భర్త ఇంటి పేరును తన పేరు పక్కన చేర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పేరు మార్పు ఆమె కెరీర్ కు ఎంతవరకు కలిసొస్తుంది..? అనేది ఫ్యూచర్ లో తెలియాల్సి ఉంది.
-
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
సింగర్ గానే షేక్ చేసేసింది.. డాన్సర్‌గా అంటే థియేటర్స్ తగలబడడమే !! -
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
ఓటీటీలోకి తెలుగు కామెడీ మూవీ.. నాన్ స్టాప్ నవ్వుల జాతర షురూ..! -
పెద్ది సినిమాలో పిచ్చెక్కించే ట్విస్ట్ ఇదే.. ఒక్కరు కాదు ఇద్దరు ?? -
దద్దరిల్లిన "BB జోడీ".. గ్రాండ్ ఫినాలేలో పర్ఫామెన్స్ పూనకాలే.. విన్నర్స్ వాళ్లే ?? -
ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్.. కానీ బిలియనీర్‌గా రాజభోగాలు -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
"దానికోసం రోజూ ఫోర్స్ చేయలేను.. అందుకే విడిగా ఉంటున్నాం".. భర్తపై ఓపెన్ అయిన హీరోయిన్ -
ప్రశాంత్ వర్మ మ్యాజిక్.. అక్షయ్ ఖన్నా రోల్ మామూలుగా లేదుగా! -
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications