"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా"
ఇండస్ట్రీ అనేది తెరిచిన పుస్తకం లాంటిది. అక్కడ సన్మానాలు ఉంటాయి.. ఛీత్కారాలు ఉంటాయి. అవార్డులు, రివార్డులు ఉంటాయి. కాస్టింగ్ కౌచ్ ఉంటుంది.. ప్రేమగా మాట్లాడే వాళ్లూ ఉంటారు. ఇలా అన్నీ కలిసిన రంగుల ప్రపంచమే సినిమా ఇండస్ట్రీ.. అయితే ఇండస్ట్రీలో చాలా రకాల మనుషులు ఉంటారు. కొందరు వచ్చామా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నామా.. అంతే వెళ్లిపోతారు. ఇంకొందరు తోటి నటీ నటులను ఇబ్బందికి గురి చేస్తుంటారు. అయితే తాజాగా తమిళ స్టార్ కమెడియన్ వడివేలుపై తమిళ నటి సోనా సంచలన ఆరోపణలు చేశారు.
స్టార్ కమెడియన్ వడివేలు గురించి తెలిసిన విషయమే.. ఆయన తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ అని తేడా లేకుండా అనేక సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల ఫహద్ ఫాజిల్ తో కలిసి మారీసన్ అనే సినిమాలో నటించి మెప్పించాడు. అయితే వడివేలుపై తమిళ హీరోయిన్ సోనా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వడివేలుతో తాను 'కుశేలన్ (తెలుగులో 'కథానాయకుడు') అనే సినిమాలో నటించానని.. వడివేలు తనకు నరకం చూపించాడని సంచలన ఆరోపణలు చేసింది.
వడివేలు చేష్టల కారణంగా తానునరకం అనుభవించానని ఆ మూవీ తర్వాత వడివేలు భార్యగా చేయమని 16 సినిమాలు వచ్చాయి. అయితే డబ్బు కంటే ఆత్మాభిమానం గొప్పదని భావించిన తాను ఆ సినిమాలను రిజెక్ట్ చేశానని చెప్పుకొచ్చింది. వడివేలు విషయంపై మాట్లాడుతూ ఆయన గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదని పేర్కొంది. వడివేలు ను నేను తట్టుకోలేనేమో అనిపించింది.. అతడితో నటించకూడదని ఫిక్స్ అయ్యాను అని పేర్కొంది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇక తమిళ నటి సోనా.. కెరీర్ బిగినింగ్ లో ఎక్కువగా శృంగార ప్రాధాన్య చిత్రాలే చేసింది. ఆ తర్వాత వడివేలుతో కలిసి కుశేలన్ సినిమా చేసింది. అలాగే సోనా తెలుగులోనూ నటించింది. సోనా తెలుగులోనూ ఆయుధం, వీడే, విలన్, ఆంధ్రావాలా తదితర సినిమాల్లో నటించింది.
-
రణ్బీర్ - సాయి పల్లవి "రామాయణ" టీజర్లో ఈ తప్పులను గమనించారా? -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
'బైకర్' మూవీ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్.. 2 నెలల్లో 2 హిట్లు నీకే సాధ్యం అన్నా..! -
బండ్ల గణేష్ ఇంట పెళ్లి సందడి.. కాబోయే అల్లుడు అతనే ?? -
పెళ్లయిన నెల రోజులకే రష్మిక గుడ్ న్యూస్..? ముగ్గురం అయ్యామంటూ పోస్ట్ వైరల్.. -
ఒక్క వెబ్ సిరీస్ తోనే పిచ్చెక్కించే షాక్ ఇచ్చిన బ్యూటీ.. -
టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్.. తెలుగు ఎన్నారై ఇన్ ఫ్లూయెన్సర్ వీడియో వైరల్ ! -
తెలుగులో తొలి ఏఐ సినిమా! -
చెప్పుతో పాటు ఆ సింబల్ చూపించిన స్టార్ బ్యూటీ.. కారణం అదే ??? -
12 రోజుల్లో రూ.1400 కోట్లు.. చరిత్ర తిరగరాసిన ‘ధురంధర్2’ -
ఇదెక్కడి స్పీడయ్యా.. బాలయ్యా.. కొంచెం గ్యాప్ ఇవ్వయ్యా..! -
రాజమౌళి దర్శకత్వంలో మిస్ అయిన చిరంజీవి-నాగార్జున మల్టీస్టారర్












Click it and Unblock the Notifications