పాన్ ఇండియా సినిమాలో బోల్డ్ సీన్.. చేయనని మొండికేస్తున్న స్టార్ హీరోయిన్!
కన్నడ స్టార్ యష్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా సినిమా 'టాక్సిక్' గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో యష్, హీరోయిన్ కియారా అద్వానీ మధ్య ఉండబోయే ఓ బోల్డ్ సీన్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. సాధారణంగా భారతీయ సినిమాల్లో కనిపించే విధంగా కాకుండా.. చాలా భిన్నంగా, సాహసోపేతంగా ఈ సన్నివేశాన్ని చిత్రీకరించనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
చిత్ర బృందంలో భిన్నాభిప్రాయాలు
ఈ సన్నివేశం కేవలం గ్లామర్ పరంగానే కాకుండా.. దాని మేకింగ్ స్టైల్ పరంగా కూడా చాలా కొత్త ఉండబోతోందని సమాచారం. అయితే ఈ సీన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా లేదా వివాదాలకు దారితీస్తుందా అనే విషయంలో చిత్ర బృందంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది టీమ్ సభ్యులు ఈ సన్నివేశం సినిమాకు ఓ ప్రత్యేక గుర్తింపును తెస్తుందని.. నేటి పోటీ ప్రపంచంలో ఇలాంటి మూమెంట్స్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతాయని భావిస్తున్నారు.

వెనకడుగు వేసిన హీరోయిన్
మరోవైపు ఈ సీన్ కారణంగా సినిమా కథ, నటీనటుల నటన కంటే కూడా వివాదాలకే ఎక్కువ ప్రాధాన్యత దక్కుతుందేమోనని మరికొందరు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా హీరోయిన్ కియారా అద్వానీ ఈ విషయంలో కాస్త వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు తను సంపాదించుకున్న క్లీన్ ఇమేజ్‌కు ఈ సీన్ భంగం కలిగిస్తుందేమోనని.. అందుకే ఆ సన్నివేశాన్ని తొలగించడమో లేదా దాని తీవ్రతను తగ్గించడమో చేయాలని ఆమె మేకర్స్‌ను కోరుతున్నట్లు సమాచారం.
ప్రస్తుతానికి యష్, దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఈ సాహసోపేతమైన రిస్క్ తీసుకుంటే సినిమాకు హైప్ పెరుగుతుందా లేక అనవసర ఇబ్బందులు వస్తాయా అని వారు ఆలోచిస్తున్నారు. ఒకవేళ అంతా అనుకున్నట్లు జరిగితే, జూన్ 4న విడుదల కానున్న ఈ సినిమాలోని ఆ సీన్ ఇండియన్ సినిమాలో ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
-
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
యాంకర్ విష్ణుప్రియకి బిగ్ షాక్.. క్రిమినల్ కేసు?? -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
నమ్మినోడే.. ముంచేశాడుగా.. టాలీవుడ్ బడా నిర్మాతకు వెన్నుపోటు !! -
తప్పు తప్పు.. అంతకు ముందు అలా చేయలేదా ?? అనసూయ పోస్ట్ వైరల్ !! -
దావూద్ ఇబ్రహీం లేకపోతే నేను లేను.. -
స్టార్ హీరోయిన్ అయ్యే కటౌట్.. కానీ ఒక్క మాట వల్లే సినిమాలకు గుడ్ బై -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
"ఆశా బోస్లే"కు భర్త బర్మన్ పెళ్లికి ముందే ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఏంటో తెలుసా ??? -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!!












Click it and Unblock the Notifications