విజయ్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. 'జన నాయగన్' కు లైన్ క్లియర్..!
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ జన నాయగన్ సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉండగా సెన్సార్ బోర్డుతో సాగుతున్న వివాదం కారణంగా ఈ మూవీ రిలీజ్ డైలమాలో పడిన విషయం తెలిసిందే. అయితే నెల రోజులకు పైగా సాగుతున్న ఉత్కఠకు బ్రేక్ వేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మద్రాస్ హైకోర్టులో సెన్సార్ బోర్డుపై వేసిన పిటిషన్ ను ఉపసంహరించుకుంది. చిత్ర నిర్మాణ సంస్థ తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కు అడ్డంకులు తొలిగినట్లుగా భావించవచ్చు.
అంతకుముందు.. జన నాయగన్ చిత్రాన్ని సెన్సార్ రివ్యూ కమిటీకి పంపుతూ మద్రాస్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సినిమాకు 'U/A' సర్టిఫికేట్ మంజూరు చేయాలని గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. జన నాయగన్ సినిమాలో.. కొన్ని విదేశీ శక్తులు భారత్ లో మతపరమైన విధ్వంసాలను రెచ్చగొట్టే విధంగా సీన్లు ఉన్నాయని.. ఇలాంటి సన్నివేశాలు దేశంలోని మత సామరస్యానికి విఘాతం కలిగించే అవకాశం ఉందని కోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు చిత్రాన్ని సెన్సార్ రివ్యూ కమిటీకి రిఫర్ చేసింది.
అయితే జన నాయగన్ మూవీ సెన్సార్ సర్టిఫికెట్ జారీలో జరుగుతున్న ఆలస్యాన్ని సవాల్ చేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ వేసిన పిటిషన్ ను వెనక్కు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఇవాళ మద్రాస్ హైకోర్టు ఈ ఉపసంహరణకు అధికారికంగా ఆమోదం తెలిపింది. దాంతో త్వరలోనే సెన్సార్ బోర్డు ఈ మూవీని మరోసారి సమీక్షించి.. అవసరమైన కట్స్ విధించి సర్టిఫికెట్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ మూవీని ఫిబ్రవరి 19 లేదా 20 న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఈ ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ఈ నెల చివరి వారంలో వచ్చే అవకాశం ఉంది. అయితే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ వచ్చేకంటే ముందే ఈ మూవీని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక టీవీకే అధ్యక్షుడు విజయ్ తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో పోటీలో దిగుతున్నారు. ఈ మేరకు ఎన్నికల మేనిఫెస్టో పై కసరత్తు నిర్వహిస్తున్నారు. ఇక హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'జన నాయకుడు'. విజయ్ హీరోగా నటించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. మలయాళ బ్యూటీ మమితా బైజు కీలక పాత్ర పోషించింది. ఇందులో ప్రకాశ్ రాజ్, బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ దేఓల్ కీలక పాత్రల్లో కనిపించారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు. కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించింది.
-
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు












Click it and Unblock the Notifications