వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శేఖర్ కమ్ముల ఫిదా సినిమా, కెసిఆర్ వెల్‌కం: లింకేమిటి?

By Pratap
|
Google Oneindia TeluguNews

Recommended Video

Fidaa Movie Link with KCR's WelKam strategy కెసిఆర్ వెల్‌కంకి లింకేమిటి? | Oneindia Telugu

హైదరాబాద్: శేఖర్ కమ్ముల ఔదార్యానికి నిజంగానే తెలంగాణ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. తెలంగాణపై మక్కువతో ఆయన ఫిదా సినిమా తీసి వారిని బట్టులో పడేశారు. తెలంగాణలోని డిచ్‌పల్లి ప్రాంతంలోని పచ్చని పొలాలను ఆయన తన సినిమాకు కేంద్రాన్ని చేసుకున్నారు.

తెలంగాణ భాషకు పట్టం కట్టారని, తెలంగాణ ఈ రకంగా సినీ తెరపై రంగులు పరుస్తోందని తెలంగాణ ప్రజలు మెచ్చుకున్నారు. నిజంగానే ఆయన సినిమాతో శేఖర్ కమ్ముల మాయ చేశారు. ఓ మామూలు ప్రేమకథను ప్రేక్షకులను అలరించే విధంగా తెర మీదికి ఎక్కించారు.

విశ్వసనీయతో కోసం లేదా వాస్తవికతను ప్రతిబింబించడానికి శేఖర్ కమ్ముల తన పాత సినిమాల్లో కూడా ఆయా సెక్షన్లు వాడే భాషనే వాడుకున్నారు. ఆ సినిమాలకు కూడా ఆయన ప్రశంసలు అందుకున్నారు. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు సామాజిక వర్గాల కూర్పుతో తన రాజకీయ వ్యూహానికి పదను పెడుతున్న తరుణంలో ఆయన సినిమాపై తప్పకుండా చర్చించాల్సిన అవసరం ఉంది.

కెసిఆర్ జలగం ఫార్ములా...

కెసిఆర్ జలగం ఫార్ములా...

కుల సమీకరణాల గురించి మాట్లాడకుండా రాజకీయాల గురించి మాట్లాడడం దుర్లభమైపోయిన రోజులు ఇవి. తెలంగాణలో రూపుదిద్దుకోబోయే కుల సమీకరణాల గురించి ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ గుట్టు విప్పారు. కమ్మ సామాజిక వర్గంతో కూడి కెసిఆర్ కొత్త కుల సమీకరణాలకు నాంది పలుకుతున్నారని, అది కమ్మ - వెలమ కుల సమీకరణాలని ఆయన తేల్చి చెప్పారు. దాన్నే ఆయన జలగం ఫార్ములాగానూ వెల్‌కంగానూ చెప్పారు. ఆ సమీకరణాల ద్వారా రెడ్డి సామాజిక వర్గాన్ని దెబ్బ తీసే వ్యూహాన్ని కెసిఆర్ అనుసరించబోతున్నారని ఆయన స్పష్టం చేశారు.

చూస్తే అలాగే అనిపిస్తోంది....

చూస్తే అలాగే అనిపిస్తోంది....

గతంలో కూడా కెసిఆర్ రెడ్డి సామాజికవర్గం పట్ల వివక్షతో వ్యవహరిస్తున్నారనే విమర్శ వచ్చింది. ఆ సమయంలో సూర్యాపేటలో సభ పెట్టి రెడ్డి నాయకులను చాలా మందిని వేదిక మీద కూర్చోబెట్టుకున్నారు. ఆ రకంగా అప్పటి విమర్శ నుంచి ఆయన గట్టెక్కారు. ఇప్పుడు మాత్రం ఆయన నేరుగానే తన వ్యూహాన్ని బయటపెట్టి అందుకు అనుగుణమైన రాజకీయాలను అనుసరించబోతున్నట్లు అర్థమవుతోంది. ఆయన అనంతపురం జిల్లా పర్యటనలో చోటు చేసుకున్న సంఘటనలే అందుకు ప్రత్యక్ష నిదర్శనం.

కెసిఆర్ వ్యూహం కన్నా ముందే...

కెసిఆర్ వ్యూహం కన్నా ముందే...

కెసిఆర్ వ్యూహం బయటపడడం కన్నా ముందే శేఖర్ కమ్ముల ఫిదా సినిమా తీసి అందుకు తగిన భూమికను ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. అయితే, ఇది ఆయన కావాలని చేసిందని చెప్పలేం. కానీ, తెలంగాణకు వలస వచ్చి, ఇక్కడ స్థిరపడిన ఆంధ్రలోని ఓ సామాజిక వర్గానికి భరోసా ఇవ్వడానికి మాత్రం ఆ సినిమా పనికి వచ్చింది. కళాకారుడికి ముందుకు చూపు ఉంటుంది కదా. అలాంటే ముందుచూపుతోనే ఫిదా సినిమాను శేఖర్ కమ్ముల చేశారని చెప్పవచ్చు. ఆయనకు దురుద్దేశాలు అంటగట్టడం శ్రేయస్కరం కాదు. కానీ ఓ చారిత్రక సందర్భంలో డిచ్‌పల్లిని కేంద్రంగా చేసుకుని సినిమా రావడం వెనక యాదృచ్ఛికంగానైనా ఓ ఫలితం ఉంటుంది. అటువంటి ఫలితాన్నే ఫిదా సినిమా నెరవేర్చిందని చెప్పవచ్చు.

తెలంగాణ సినిమానా....

తెలంగాణ సినిమానా....

ఓ మామూలు ప్రేమకథను తీసుకుని, కాస్తా తెలంగాణ భాషను వాడినంత మాత్రాన, తెలంగాణ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకున్నంత మాత్రాన అది తెలంగాణ సినిమా అవుతుందా అనేది ప్రశ్న. ఆంధ్రప్రాంతానికే చెందినప్పటికీ ప్రముఖ తెలుగు సాహిత్యవేత్త వాడ్రేవు చినవీరభద్రుు ఆ సినిమాపై ఓ ప్రశ్నను సంధించారు. తెలంగాణ అంటే ఇదేనా అని ఆయన ఫేస్‌బుక్ పోస్టులో ప్రశ్నించారు. గతంలో విప్లవ సినిమాల మాదిరిగానే ఇప్పుడు ఈ ఫిదా సినిమా తెలంగాణ ప్రజలను మాయామోహితులను చేసిందని చెప్పాలి. అంతకన్నా మించి దానికి తెలంగాణ ప్రయోజనం ఏమీ లేదు.

ఎదురెక్కి వచ్చినవాళ్లెవరో....

ఎదురెక్కి వచ్చినవాళ్లెవరో....

నీటి పొంటి తెలంగాణ ప్రాంతంలోకి ఎదురెక్కి వచ్చిన సామాజిక వర్గం గురించి తెలంగాణ కవులు తెలంగాణ ఉద్యమ కాలంలో చాలానే మాట్లాడారు. నల్లవలస కవులు, దాలి కవి సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, యాది - మనాది కవి అల్లం నారాయణ ఇంకా చాలా మంది కవులు ఈ అంశంపై తమ కవిత్వం ద్వారా మాట్లాడారు. ఆ సామాజిక వర్గానికి మాత్రమే శేఖర్ కమ్ముల ఫిదా సినిమా ప్రాతినిధ్యం వహిస్తుందని చెప్పాల్సి ఉంటుంది.

కెసిఆర్ వ్యూహం కూడా అటే....

కెసిఆర్ వ్యూహం కూడా అటే....

ఫిదా సినిమా ఏదైతే కోరుకుందే అదే ప్రయోజానాన్ని తెలంగాణలో కెసిఆర్ వెల్‌కమ్ వ్యూహం నెరవేర్చబోతోంది. తెలంగాణలో కాంట్రాక్టులు ఆంధ్రవాళ్లవని, సబ్ కాంట్రాక్టులు తెలంగాణవాళ్లవని తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామమ్ స్పష్టంగానే చెప్పారు. తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా కెసిఆర్ ప్రభుత్వం నడుస్తుందని ఆయన గట్టిగానే చెప్పారు. ఇదే అభిప్రాయం తెలంగాణ ఉద్యమకారులకు (కెసిఆర్ భాషల్లో లక్షల మంది ఒక్కొక్కరుగానే) కలగడం అసహజమేమీ కాదు. కెసిఆర్ అనుసరిస్తున్న విధానాలు, ఆయన తన దరి చేర్చుకుంటున్న వర్గాలను చూస్తే ఆ విషయం స్పష్టంగానే బోధపడుతుంది.

జెపి చెప్పినట్లుగానే....

జెపి చెప్పినట్లుగానే....

తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణకు వ్యతిరకే అయినప్పటికీ లోకసత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ ఓ మాట చెప్పారు. రాష్ట్రం విడిపోవడం వల్ల అదనంగా కొంత మందికి పదవులు వస్తాయి తప్ప ప్రజలకు ఏ విధమైన మేలు కూడా జరగదని ఆయన చెబుతూ వచ్చారు. ఆయన మాటలే నిజమవుతున్నందుకు తెలంగాణ కోసం పోరాటం చేసినవారంతా తలదించుకోవాలా అనేది ప్రశ్న. కెసిఆర్ రెడ్డి సామాజిక వర్గాన్ని దెబ్బ కొట్టాలనే వ్యూహాన్ని అనుసరిస్తే బాధపడాల్సిందేమీ లేదు, కానీ ఆయన వ్యూహాలు తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేస్తున్నాయా అనేది ఆలోచించుకోవాల్సిన విషయం. ఫిదా సినిమా సాధించిన ప్రయోజనానికి కొనసాగింపుగానే కెసిఆర్ వ్యూహం నడుస్తుందనేది గమనించాల్సిన విషయం.

చర్చలో పాల్గొనదలిచినవారు తమ అభిప్రాయాలను [email protected]కి పంపించవచ్చు. అభిప్రాయాలు ఏకపక్షం కారాదు, అందుకే...

- కె. నిశాంత్

English summary
K Nishanth in his opinion sees the link between Sekhar Kammula's Fida movie and Telangana CM and Telangana Rastra Samithi (TRS)chief K Chandrasekhar Rao's WelKam strategy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X