• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జన్మభూమిరుణం

By Staff
|

హైదరాబాద్‌ఃమట్టిలోంచి పుట్టిన ఓ మాణిక్యంలాగా,ఆంధ్రదేశంలోని ఓ మారుమూల గ్రామంలో పుట్టిన కూచిపూడిదేశవిదేశాల్లో రంగప్రవేశం చేసి కళానీరాజనాలు అందుకుంటున్న విషయం తెలిసిందే.పండగలు, పబ్బాల కంటే కూడా తమ బిడ్డల నృత్యఅరంగేట్రాన్ని పెళ్ళిసంబరం స్థాయిలో ఎన్నారైలు చేస్తుంటారని చెపుతున్నారు ప్రముఖ నృత్యకళాకారిణి సుమతీకౌశల్‌. దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా అమెరికాలోనిలాస్‌ఏంజెల్స్‌లో ఉంటూ, నృత్యశిఖర ద్వారాకూచిపూడికి మరిన్ని వన్నెలు తెస్తున్న సుమతీకౌశల్‌తో ఇండియా ఇన్ఫో ప్రతినిధిహిమబిందు ఇంటర్వ్యూ.

తన ఐదవయేటనే గజ్జెకట్టిన సుమతి కూచిపూడి, భరతనాట్యం,ఒడిస్సీ, కథాకళి లాంటి నృత్యరీతులలో మంచి ప్రావీణ్యతసాధించారు. జాతీయ స్థాయిలో ఆయా నృత్యశైలులలో ప్రఖ్యాతిచెందిన గురువుల దగ్గర ఆమె నృత్యాన్ని అభ్యసించారు.గురుశిష్యపరంపరపై, నృత్య సంప్రదాయాలపై అపారమైన గౌరవాభిమానాలున్న గురువు సుమతి. అటువంటప్పుడుఆధునిక ధోరణులకు పెట్టింది పేరైన అమెరికాలోనివిద్యార్ధులు ఈ సంప్రదాయాల పట్ల ఏ విధంగాప్రతిస్పందిస్తుంటారు? అని ప్రశ్నించినపుడు, మనం ఏదైనా చెప్పగానే వాళ్ళ నోటి నుంచివచ్చే ప్రశ్నలు, ఇది ఏమిటి? ఈ విధంగా ఎందుకుచెయ్యాలి? చెయ్యకపోతే ఏమవుతుంది?లాంటివి. అక్కడి పిల్లలు కొంచెం ఇండిపెండెంట్‌గాఉంటారు. కాబట్టి...మనం ఆచరించమని చెపుతున్నవిషయాల ప్రాధాన్యతని, మన సంస్కృతిలో అవి ఏవిధంగా భాగమో విపులంగా తెలియజేయాలి.మనం చెప్పే కారణాలు పట్ల వారు కన్విన్స్‌ అయితేచాలా సిన్సియర్‌గా వాటిని ఫాలో అవుతారు అన్నారు.

అమెరికాలోఎదురయ్యే సాధకబాధకాలను వివరిస్తూ, నేను అమెరికా వెళ్లిన మొదట్లో రోజుకో ప్రాంతానికివెళ్లి డాన్స్‌ క్లాసులు చెప్పేదాన్ని. మా అబ్బాయి నేను కలిసివెళ్ళేవాళ్ళం. డబ్బులు బాగా వచ్చినప్పటికీ రావడానికి, పోవడానికేనాలుగుగంటలు పట్టేది. దాంతో చాలాఅలిసిపోయినట్టయ్యేది. పిల్లలందరూ కూడా బిజీగా ఉంటారు కాబట్టివీకెండ్స్‌లోను, సాయంత్రాలు మాత్రమేచెప్పాల్సి వచ్చేది. దాంతో, కొంత మంది విద్యార్ధులని పోగొట్టుకుంటున్నాననిఅనిపించినా...లాభం లేదనిపించి, హైదరాబాద్‌లోనేను నడిపిన కళాశిఖరని అక్కడ మొదలుపెట్టేశాను.మహాశివరాత్రి రోజు అక్కినేని నాగేశ్వరరావుగారు ప్రారంభించారు.నేను కావాలనుకున్న వాళ్ళకి, నాకు నచ్చినవిద్యార్ధులకు చెపుతున్నాను. ఇక ప్రోగ్రాముల విషయానికివస్తే, ఆర్కెస్ట్రా దొరకడం కష్టం. కనుక సాధ్యమయినంతవరకు టేపుల మీదే కార్యక్రమాలన్నీ నడుస్తుంటాయి.లైవ్‌ ఆర్టిస్టులు దొరికినా కూడా చాలా ఎక్కువ చార్జ్‌చేస్తుంటారు. అందుకని ఇండియా వచ్చినప్పుడుమంచి సింగర్స్‌ని, ఆర్కెస్ట్రాని పెట్టి టేపులనిచేయిస్తుంటాను. కానీ వాటితోనే ప్రాక్టీసు, ప్రోగ్రాములు చేస్తున్నకారణంగా, ఇండియాలో ప్రదర్శనలివ్వడానికి వచ్చినపుడు టేపులమీద నృత్యం చెయ్యడం అలవాటయిన వాళ్ళు(ఇండోఅమెరికన్స్‌) కొంత ఇబ్బంది పడుతుంటారనివివరించారు.

నృత్యకళ మధ్యతరగతిపైస్థాయిది అనే వ్యాఖ్యకు ప్రతిస్పందిస్తూ,కళకి ఎప్పుడూ వ్యాపారాత్మక ధోరణులు ఉండవు. కానీ ప్రతిష్టకుపోయి ఖర్చులనుపెంచుకుంటున్నాం. రూపాయితో పోయే ఆహ్వానపత్రాన్నిపదిరూపాయలతో ఘనంగా వేయించడం, ఖరీదైననగలు, డాన్స్‌ డ్రస్సులు వాడటం, పదే పదేడ్రస్సులని మార్చడం వంటివి నృత్యాన్ని మరింతఖరీదైన కళగా మారుస్తున్నాయి. పరిమిత వనరులతో కూడానృత్యాన్ని అభ్యసించి మంచి పేరు సాధించినవారు చాలా మంది ఉన్నారు అని అన్నారు. నృత్యంఆర్ధికంగా, లేదా సామాజికంగా ఒక స్థాయి కలవారు అభ్యసించే కళగా మిగిలిపోవడంకంటే ఒక మంచి కెరీర్‌గా కూడా మలుచుకునే పరిస్థితులు ఉండాలనేది సుమతి కౌశల్‌అభిప్రాయం. ఫైన్‌ ఆర్ట్స్‌ కోర్సులను కళాశాలస్థాయిలో మాత్రమే మన ప్రభుత్వాలుప్రవేశపెట్టాయి. నిజానికి పాఠశాల స్థాయి నుంచీ శిక్షణ ఉండాలి. అప్పుడుఎంతో మందికి ఉపాధి లభించడమే కాకుండా కళలకుఆదరణ పెరుగుతుంది అని

చెప్పారామె.

దాదాపు 110 మంది కళాకారుల చేత అరంగేట్రం చేయించిన సుమతి కౌశల్‌కి నృత్య దర్శకత్వంలో మంచి ప్రవేశం ఉంది. కొత్త కొత్త అంశాలను, పాటలను తీసుకుని మెచ్చే రీతిలో వాటికి నృత్యాన్ని కూర్చడంలో ఉన్నత ప్రమాణాలకు పెట్టింది పేరు ఆమె. ఆత్మగౌరవం, మా బంగారక్క, బంగారు కలలు, ధర్మనిర్ణయం లాంటి తెలుగు చిత్రాలలోని కొన్ని పాటలకు కూడా ఆమె నృత్య దర్శకత్వం వహించారు. తన సినీ అనుభవాన్ని గురించి చెపుతూ, నాగేశ్వరరావుగారి అన్నపూర్ణా బ్యానర్‌లో తొలిసారిగా నృత్యదర్శకత్వం వహించాను. ఆ పాటలో కాంచన..రాజశ్రీలు కలిసి నృత్యం చేశారు. కాంచన మంచి డాన్సర్‌ కావడంతో చాలా చక్కగా చేసింది. అన్నపూర్ణలాంటి గొప్ప బ్యానర్‌లో నృత్యదర్శకత్వం వహించిన తరువాత మిగతావాటిలో చెయ్యాలనే ఆసక్తి పెద్దగా లేకపోయింది. వారిచ్చిన గౌరవం అలాంటిది. కానీ తరువాత కొన్ని చేశాను. బంగారు కలలులో వహీదా రెహమాన్‌కి, అలాగే మరో సినిమాలో శ్రీదేవి పాటకి డాన్స్‌ కంపోజ్‌ చేశాను అన్నారు.

సినిమాలోని శాస్త్రీయ నృత్యానికి, బయట చేసే నృత్యానికి మధ్య వ్యత్యాసం ఊహించనంత వేగంగా ఉంటుంది అంటూ, ఇక్కడ ఒక అడుగు వేస్తే సినిమాలో నాలుగు అడుగులు వెయ్యాల్సి వుంటుంది. అలాగే కదలికలు కూడా చాలా వేగంగా ఉంటాయి. మొత్తం మూడునాలుగు నిమిషాల నిడివి ఉండే పాటలోనే ఎన్విరాన్‌మెంట్‌ అంతా వచ్చేలా కంపోజ్‌ చెయ్యడం కష్టమే మరి అనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

నృత్యంలో జరుగుతున్న ప్రయోగాలపై దృష్టి సారిస్తూ, జుగల్‌బందీలు ఆహ్వనించదగ్గవే. అవి భారతీయ నృత్యాలైనా కావచ్చు. లేదా వెస్టన్‌ క్లాసికల్‌తో కలిసి చేసేవి కావచ్చు. కానీ మంచి కూర్పు అవసరం అన్నారు. అయితే ప్రయోగాల పేరుతో నృత్యాన్ని ఇతర సాంకేతికపరమైన టెక్నిక్‌లు ( నృత్యం చేసేటప్పుడు వెనకాల తెరపై వేసే వివిధ విజువల్‌ క్లిప్పింగ్‌లు, హోరెత్తించే బ్యాక్‌గ్రౌండ్‌ సంగీతంలాంటివి) డామినేట్‌ చెయ్యడం అస్థిత్వానికి అన్యాయం చేసుకున్నట్టే అవుతుంది. ప్రయోగాల సమయంలో వివిధ వాయిద్యాలను, సెట్టింగులను పెట్టడానికి ప్రయత్నించినా అవి వేదికపై ఉన్న కళాకారిణి ప్రతిభని, సదరు నృత్య నైపుణ్యాన్ని దెబ్బతీసేట్టు ఉండకూడదనేది సుమతి కౌశల్‌ భావన.

అమెరికాలో ఆదరణ పొందుతున్న భారతీయ నృత్యకళల్లో కూచిపూడి స్థానాన్ని వివరిస్తూ, భారతీయ నృత్యానికి సంబంధించి భరతనాట్యం ముందుగా వికాసం పొందింది. దాంతో ఈ కళే ముందుగా విదేశాలకు వెళ్ళింది. ఆంధ్రుల సంఖ్య గత రెండు దశాబ్దాలుగా అమెరికాలో పెరగడంతో కూచిపూడికి ఆంధ్రుల ఆదరణే ఎక్కువగా ఉంది. ఈ నృత్యకళను నేర్పించే గురువులు కూడా అక్కడ తక్కువే. వ్యక్తిగతంగా నా వరకు అయితే కూచిపూడిని నేర్పడానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాను. అయితే ప్రస్తుతం తెలుగు విశ్వవిద్యాలయం వారు డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ ద్వారా కళలను నేర్పే కోర్సులను ప్రవేశపెట్టాలని అనుకుంటున్నారు. కాబట్టి కూచిపూడికి రాను రాను మరింత ఆదరణ పెరిగే అవకాశాలే ఎక్కువ. అని చెప్పారు.

నృత్యకళకి సంబంధించి అమెరికాలోని గురువుల ప్రమాణాలపై వ్యాఖ్యానిస్తూ, నృత్యకళలో మంచి ప్రవేశం ఉన్నవారూ, అలాగే తెలిసీతెలియని తనంతో నేర్పేవారూ రెండు రకాలు ఉన్నారు. భారతీయ నృత్యానికి ఆదరణ ఉన్నప్పటికీ, ఇదే ప్రధాన వృత్తిగా పెట్టుకుని జీవించే వారు అమెరికాలో తక్కువ. ప్రముఖ కళాకారులకు మాత్రమే ఆ విధమైన డిమాండ్‌ ఉంటోంది. ఏది ఏమయినప్పటికీ వారానికి ఒక సారి పాఠం చెప్పినా వచ్చే డబ్బులు ఎక్కువగానే ఉంటాయి అన్నారు.

తెలుగు విశ్వవిద్యాలయం ప్రవేశపెట్టాలనుకుంటున్న డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ గురించి తన మనోభావాలను వ్యక్తం చేస్తూ, ఉన్నత ప్రమాణాలు ఉన్న కళాకారిణులను ఎంపిక చెయ్యడం కోసం స్క్రీనింగ్‌ జరగాలి. అలాగే గురువుల అర్హతకి సంబంధించి ఏదో ఒక క్రైటీరియా పెట్టుకోవాలి. లేకపోతే మొత్తం వ్యవహారమే నీరుగారిపోతుందని చెప్పారు.

మరి మీరు, మీ కోడలు భానుప్రియ( ప్రముఖ సినీ నటి, నర్తకి) ఇద్దరూ కలిసి చేసే నృత్యప్రయోగాలు, ఇతర కార్యక్రమాలని ఆశించవచ్చా? అనడిగినపుడు, తప్పకుండా! మేం కూడా ఆలోచిస్తున్నాం. కానీ ప్రస్తుతం భాను చాలా బిజీ. కొంత గ్యాప్‌ వచ్చినా పెళ్ళి అయిన తరువాత తనకి చాలా ఆఫర్స్‌ వచ్చాయి. ఒక ఆర్టిస్టుగా ఈ పరిస్థితిలో తన ఫీలింగ్స్‌ ఎలా ఉంటాయో అర్ధం చేసుకోగలను...కానీ తను మళ్లీ బిజిగా నటిస్తుండటంపై పనికిమాలిన గాసిప్స్‌... భాను ఎంత మంచి డాన్సరో మీకు తెలిసిందే. అయినా నా దగ్గర నేర్చుకుంటానంటుంది....ఏవైనా తప్పులు చేస్తుంటే ఏ మాత్రం సంకోచించకుండా కరెక్ట్‌ చెయ్యండమ్మా అంటుంది....చాలా సింపుల్‌గా ఉండే అమ్మాయి. అందుకే మా అబ్బాయి కంటే కూడా ముందుగా నాకే నచ్చింది...! అంటూ కోడలిని తెగ మెచ్చేసుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X