• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ధోనీని మించిన కెప్టెన్ లేడా?

By Pratap
|
Google Oneindia TeluguNews
Mahendra Singh Dhoni
భారత జట్టుకు నాయకత్వం వహించినవారిలో మహేంద్ర సింగ్ ధోనీని మించినవారు లేరా అనే ప్రశ్న ఉదయిస్తోంది. నిజానికి, శనివారం శ్రీలంకతో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచులో భారత్ మూడో వికెట్ కోల్పోయిన తర్వాత బ్యాట్ పట్టుకుని మైదానంలోకి రావడం పట్ల దాదాపు అందరూ విస్మయమే వ్యక్తం చేశారని చెప్పవచ్చు. ఆ స్థానంలో మంచి ఫామ్‌లో ఉన్న యువరాజ్ సింగ్ రావాలని భారత క్రికెట్ అభిమానులు కోరుకున్నారు. బ్యాట్స్‌మన్‌గా ప్రపంచ కప్ పోటీల్లో పూర్తిగా విఫలమయ్యాడు. అతను 22, 7, 25 - ఇలా పరుగులు చేశాడు. బ్యాటింగులో ఏ మాత్రం పస లేదు. ఇటువంటి స్థితిలో ఫైనల్ మ్యాచులో అతను అలా బ్యాటింగుకు దిగడం ఎవరికీ మింగుడు పడలేదు.

అప్పటికే శ్రీశాంత్‌ను తుది జట్టులోకి తీసుకోవడంపై ధోనీ మీద అసంతృప్తి వ్యక్తమవుతూ వస్తోంది. స్పిన్నర్ రవిచంద్రన్ స్థానంలో శ్రీశాంత్‌ను తీసుకుని తప్పు చేశాడని భావిస్తున్నారు. శ్రీశాంత్ తన బౌలింగులో సమర్పించిన పరుగుల వరద ప్రభావం ధోనీపై కూడా పడింది. భారత్ ఓటమి పాలైతే ధోనీ మీద కత్తులు దూయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ధోనీకి తెలియందేమీ కాదు. అయినా అతను సాహసం చేశాడు. అతను 30 ఓవర్లు అద్భుతంగా ఆడి భారత్‌కు టైటిల్‌ను అందించాడు. అత్యంత విలువైన ఇన్నింగ్సు ఆడాడు. అప్పటి వరకు తనపై ఉన్న అపోహలను ఈ మ్యాచులో పోగుట్టుకున్నాడు.

భారత్‌కు విజయాన్ని అందించిన ఇన్నింగ్సు ఆడి నాయకత్వ లక్షణాలను ప్రదర్శించి చూపాడు. తద్వారా భారత్‌కు ఇప్పటి వరకు నాయత్వం అందించిన అందరి కన్నా గొప్ప కెప్టెన్‌గా మిగిలిపోయాడు. ఈ 29 ఏళ్ల రాజా ఆఫ్ రాంచీ ఓ చిన్న నగరం నుంచి వచ్చి అద్భతం అనిపించాడు. తనకు మహా నగరాల లక్షణాలు లేవని అప్పుడప్పుడు అతను అంటూ ఉండేవాడు. ఆ రకంగా మహా నగరాల మర్యాదలను కూడా కొన్ని సందర్భాల్లో పక్కన పెట్టాడు.

పెవిలియన్‌లో ఉన్న అతని సహ ఆటగాళ్లు కూడా ధోనీ ఆటను ఉత్కంఠతో చూశారు. తనతో పాటు గంభీర్‌ను నడిపించాడు. రన్ రేట్ పడిపోకుండా జాగ్రత్త పడుతూ వచ్చాడు. మ్యాచ్ విన్నింగ్ సిక్స్ బాదిన తర్వాత కూడా ధోనీ కూల్‌గానే కనిపించాడు. ధోనీ కెప్టెన్సీలో భారత జట్టు శిఖరాలను తాకుతోంది. భారత్‌కు తొలి ట్వంటీ20 ప్రపంచ కప్‌ను అందించాడు. టెస్టు మ్యాచుల్లో అగ్రస్థానంలో నిలిపాడు. చెన్నై సూపర్ కింగ్స్‌కు ఐపియల్, ఐపియల్ చాంపియన్స్ లీగ్ ట్రోఫీలను అందించాడు. ఇప్పుడు వన్డేల్లో ప్రపంచ కప్‌ను సాధించి పెట్టాడు.

భారత జట్టుకు ఇప్పటి వరకు డజన్ మంది దాకా నాయకత్వం వహించారు. పటౌడీ మెరుగ్గానే అనిపించాడు. అజిత్ వాడేక్ రెండు చారిత్రాత్మక విజయాలను అందించాడు. ఆ తర్వాత సౌరవ్ గంగూలీ, ధోనీ పోటీ పడ్డారు. భారత్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కుంటున్న సమయంలో గంగూలీ పగ్గాలు చేపట్టాడు. అతను ధైర్యం చేసి సెహ్వాగ్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, జహీర్, ధోనీ వంటి ఆటగాళ్లను సిద్ధం చేశాడు. భారత్‌కు విజయాలను రుచి చూపించాడు.

ఆ తర్వాత ధోనీ టీమిండియా నాయకత్వ బాధ్యతలను తీసుకుని జట్టును మిగతా జట్లపై ఆధిపత్యం సాధించే స్థాయికి తీసుకుని వెళ్లాడు. దోనీకి మంచి వ్యూహకర్తగా అభివర్ణిస్తారు. బౌలర్లను ప్రయోగించడంలో ధోనీకి మించినవారు లేరని అంటారు. అదే సమయంలో ఓటమి దిశగా సాగుతున్న జట్టును తన వ్యూహాలతో విజయం దిశగా నడిపించే తెలివితేటలు సొంతమని ప్రశంసిస్తారు.

English summary
When MS Dhoni strode to the pitch at the fall of India's third wicket against Sri Lanka on Saturday, an audible gasp rippled through the nation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X