వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిఫ్ట్ లో డిగ్రీల ప్రధానోత్సవం : చీరకట్టులో తళుక్కుమన్న విద్యార్థినులు (ఫోటోలు)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఎప్పుడూ కళ్లు చెదిరే ఫ్యాషన్స్ లో దర్శనమిచ్చే నిఫ్ట్(నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ) అమ్మాయిలు శుక్రవారం నాడు మాత్రం సాంప్రదాయ చీరకట్టులో ప్రత్యక్షమయ్యారు. ఎప్పుడూ ఉండే ఫ్యాషన్స్ కు భిన్నంగా.. తెలుగింటి ఆడపడుచుల్లా చీరకట్టులో కాలేజీ స్నాతకోత్సవానికి హాజరయ్యారు.

ఆనందోత్సాహాల నడుమ

ఆనందోత్సాహాల నడుమ

2016 విద్యా సంవత్సరానికి గాను నిఫ్ట్ నుంచి డిగ్రీలు పూర్తి చేసుకున్న 210 మంది విద్యార్థులకు నిన్న సాయంత్రం డిగ్రీ ప్రధానోత్సవం జరిగింది. విద్యార్థుల ఆనందోత్సహాల నడుమ నిఫ్ట్ స్నాతకోత్సవం అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్బంగా.. ప్రతిభ కనబరిచిన కొంతమంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందజేసింది యాజమాన్యం.

'సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్'

'సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్'


స్నాతకోత్సవం సందర్బంగా.. చీరకట్టులో హాజరైన విద్యార్థినులు ఈవెంట్ కు 'సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్' గా నిలిచారు. ఎప్పుడూ అత్యాధునిక డిజైన్స్ తో తళుక్కమనే ఫ్యాషన్ కాలేజీ అమ్మాయిలు.. ఇలా సాంప్రదాయ దుస్తుల్లో దర్శనమివ్వడం ఆకట్టుకుంది. డిగ్రీ ప్రధానోత్సవం కావడంతో.. కాలేజీ వాతావరణమంతా కోలాహాలంగా కనిపించింది.

 ముఖ్య అతిథులు :

ముఖ్య అతిథులు :

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ నారాయణన్, సాలర్ జంగ్ మ్యూజియం జాయింట్ డైరెక్టర్ నాగేందర్ రెడ్డి విచ్చేశారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన పలువురు విద్యార్థులకు వీరి చేతుల మీదుగా 'బంగారు పతకాలు' అందజేశారు. ఈ సందర్బంగా ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ నారాయణన్ మాట్లాడుతూ.. సమాచార-సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు. కార్యక్రమంలో నిఫ్ట్ డైరెక్టర్ రాజారాం, జాయింట్ డైరెక్టర్ ఎస్.కె. జాహ, ప్రొఫెసర్ మాలిని తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల అభిప్రాయాలు

విద్యార్థుల అభిప్రాయాలు

'ఫ్యాషన్ రంగంలో రాణించాలంటే క్రియేటివిటికి పదును పెట్టాలి. ఇష్టపడి చదివితే విజయం కచ్చితంగా సొంతమవుతుంది. తద్వారా మంచి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. నిఫ్ట్ లో డిగ్రీ పూర్తి చేయడం ద్వారా ఓ ప్రముఖ కంపెనీలో మంచి ప్యాకేజీతో ఉద్యోగం లభించింది' -నిఫ్ట్ విద్యార్థి

 బెస్ట్ స్టూడెంట్ అవార్డు

బెస్ట్ స్టూడెంట్ అవార్డు

స్నాతకోత్సవం సందర్బంగా.. అన్షిక గంభీర్ అనే విద్యార్థినిని బెస్ట్ స్టూడెంట్ అవార్డుతో సత్కరించింది నిఫ్ట్. అనంతరం విద్యార్థి మాట్లాడుతూ.. అవార్డు పొందడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది. నిఫ్ట్ లో డిగ్రీ ద్వారా ఓ ఫ్రెంచ్ కంపెనీలో ఉద్యోగం పొందినట్లు వెల్లడించింది. ముందునుంచి తాను కోరుకున్నట్లుగానే ప్రత్యేక గుర్తింపు దక్కినందుకు సంతోషంగా ఉందని చెప్పింది.

English summary
Its 'Degree presentation' event in Nift college madapur. All the college students were attended in traditional dress code for this event
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X