వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూ టెక్నాలజీ: పెదాల కలికతో నేరాలకు చెక్

|
Google Oneindia TeluguNews

లండన్‌: బ్రిటన్ శాస్త్రవేత్తలు ఓ నూతన ఆవిష్కరణకు తెరతీశారు. పెదాల కదలికను బట్టి మాటలను అర్థంచేసుకునే సరికొత్త పరిజ్ఞానాన్ని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. నేరాల గుట్టు విప్పడంలోను, బధిరులకు సంభాషణపరంగా తోడ్పాటును అందించడానికి ఇది ఉపయోగపడుతుంది.

ఈ 'కనిపించే ప్రసంగ గుర్తింపు పరిజ్ఞానం'(ది విజువల్ స్పీజ్ రికగ్నిషన్ టెక్నాలజీ)ను బ్రిటన్‌లోని ఈస్ట్‌ ఆంగ్లియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు రూపొందించారు.

ఒక వ్యక్తి మాట్లాడుతున్నది ఏమిటో అర్థంకాని సందర్భంలో అతడి మాటలను వెలుగులోకి తీసుకురావడానికి ఇది సాయపడుతుందని పరిశోధక శాస్త్రవేత్త తెలిపారు. ధ్వని అందుబాటులో లేని సీసీటీవీ దృశ్యాలు వంటివి పరిశీలిస్తున్నప్పుడు సంభాషణలను నిర్దిష్టంగా గుర్తించడంలో సమస్యలు తలెత్తుతుంటాయని తెలిపారు.

 New lip reading technology to help solve crimes

నేరపరిశోధనల్లో.. కొన్నిసార్లు మాటలు సరిగా వినిపించక, సరైన ఆధారాలు లభంచని సందర్భాలు ఉంటాయి. క్రీడల్లో కొందరు ఆటగాళ్లు ప్రత్యర్థులను దుర్భాషలాడుతుంటారు.

ప్రేక్షకుల హోరులో అవి సరిగా వినపడవు. ఇలాంటి వాళ్లను తాజా పరిజ్ఞానం పట్టించేస్తుందని ఆయన చెప్పారు. కొన్ని ధ్వనులకు పెదాల కదలిక ఒకేలా ఉంటుంది. అయినా ఈ పరిజ్ఞానం వీటిని వర్గీకరించగలదు.

తద్వారా సదరు సంభాషణను మరింత కచ్చితత్వంతో గుర్తించగలదని పరిశోదకుడు వెల్లడించారు. అనేక పరిశోధనల తర్వాత ఈ పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. ఈ పరిజ్ఞానంతో అనేక నేరాలకు ముగింపు పలకవచ్చని చెప్పారు.

English summary
Scientists have developed a new lip-reading technology that could help in solving crimes and provide communication assistance for people with hearing and speech impairments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X