• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చరిత్ర సృష్టించిన ‘స్పేస్ ఎక్స్’! అత్యంత శక్తివంతమైన రాకెట్ ద్వారా అంగారకుడి వద్దకు కారు!

By Ramesh Babu
|

ఫ్లోరిడా: ఫిబ్రవరి 6, 2018.. మంగళవారం.. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. ముఖ్యంగా అంతరిక్ష పరిశోధనా రంగంలో గొప్ప ముందడుగు వేసిన, అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన, అద్భుత విజయాన్ని సాధించిన రోజుగా చెప్పుకోవచ్చు.

భూమికి సూర్యుడే పెనుముప్పు! సౌర పవనాలతో బలహీనమవుతున్న భూఅయస్కాంత క్షేత్రం!?

చంద్రయాన్-2 ఈ ఏడాదే: చంద్రుడిపైకి తొలిసారిగా 'ఇస్రో' రోవర్, 14 రోజులపాటు పరిశోధన!

ఎందుకంటే.. అగ్రరాజ్యం అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ 'నాసా' కూడా ఇప్పటి వరకు చేయనటువంటి ప్రయోగాన్ని ప్రైవేటు రంగంలోని అంతరిక్ష పరిశోధనా సంస్థ 'స్పేస్ ఎక్స్' చేసి చూపించిన రోజు అది.

ఎవరిదీ ‘స్పేస్ ఎక్స్’, ఏం చేస్తోంది?

ఎవరిదీ ‘స్పేస్ ఎక్స్’, ఏం చేస్తోంది?

స్పెస్ ఎక్స్‌ప్లోరేషన్ టెక్నాలజీస్ కార్పొరేషన్‌‌కు‌‌ సంక్షిప్త నామమే..‘స్పేస్ ఎక్స్‌'. బిజినెస్ మాగ్నెట్, టెస్లా ఇన్‌కార్పొరేషన్‌కు సీఈవో అయిన ఎలాన్ మస్క్ 2002లో అమెరికాలోని కాలిఫోర్నియాలో ఈ స్పేస్‌ఎక్స్‌ సంస్థను స్థాపించాడు. ప్రైవేటు రంగంలో అంతరిక్ష పరిశోధనలు సాగిస్తోన్న సంస్థ ఇది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా' సైతం తన అవసరాల మేరకు ఈ సంస్థతో కలిసి పనిచేస్తూ ఉంటుంది. అంతరిక్ష పరిశోధనల్లో భాగంగా అవసరమైన పరికరాలు తయారు చేయడం, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని వ్యోమగాములకు అవసరమైన వస్తువులు(కార్గో) పంపించడం వంటివి ఇప్పటి వరకు ఈ సంస్థ చేస్తూ వస్తోంది. ఆరేళ్ల క్రితం తన తొలి రాకెట్ ప్రయోగంలో విఫలమైన స్పేస్ ఎక్స్‌ సంస్థపై ప్రస్తుతం నాసా కూడా ఆధారపడుతోదంటే.. అంతరిక్ష ప్రయోగాల్లో ‘స్పేస్ ఎక్స్ ' సాధించిన ప్రగతిని ఊహించుకోవచ్చు.

సుదూర తీరాలు చేర్చే రాకెట్ ప్రయోగాలు...

సుదూర తీరాలు చేర్చే రాకెట్ ప్రయోగాలు...

అంతరిక్షంలోని సుదూర తీరాలకు చేరాలంటే ఇప్పుడున్న రాకెట్ల ద్వారా సాధ్యం కాదు. ఇందుకు అత్యంత శక్తివంతమైన రాకెట్ అవసరం. ప్రస్తుత రాకెట్ సాంకేతిక పరిజ్ఞానం భూ కక్షలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టడం వరకే పరిమితమవుతోంది. భూమి తరువాత ఇప్పటి వరకు చంద్రుడిపై మాత్రమే మనం కాలుమోపగలిగాం. ఎలాంటి వాతావరణం లేని చంద్రుడిపై మానవ ఆవాసం అంత సులువేం కాదు. ఇక మన సౌరకుటుంబంలో భూమి తరువాత భూమిలాంటి వాతావరణం ఉన్నది, మన భూమికి సమీపంలో ఉన్నది ఒక్క అంగారక(మార్స్) గ్రహమే. అయినా సరే, మార్స్‌ను చేరేందుకు ఇప్పుడున్న రాకెట్ల సామర్థ్యం సరిపోదు. సరిగ్గా ఈ విషయంపైనే ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ ప్రయోగాలు జరుపుతోంది. అత్యంత శక్తివంతమైన రాకెట్ల తయారీలో నిమగ్నమై ఉంది.

పునర్వినియోగ రాకెట్.. ఫాల్కన్

పునర్వినియోగ రాకెట్.. ఫాల్కన్

శక్తివంతమైన, పునర్వినియోగ రాకెట్ల రూపకల్పనే లక్ష్యంగా స్పేస్ ఎక్స్ ప్రయోగాలు నిర్వహిస్తోంది. ఈ విషయంలో ఈ సంస్థ కొంత పురోగతి కూడా సాధించింది. ‘ఫాల్కన్' పేరుతో ఒక శక్తివంతమైన, పునర్వినియోగ రాకెట్‌ను రూపొందించింది. దీని ప్రయోగంలో తొలుత విఫలమైనా ఆ తరువాత దిగ్విజయంగా ఆ రాకెట్‌ను వినువీధిలోకి పంపించగలిగింది. గత ఏడాది ఫిబ్రవరి 19న నాసాకు చెందిన సరుకులను మోసుకుని స్పేస్ ఎక్స్ రాకెట్ ఫాల్కన్-9 విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. 5,500 పౌండ్ల బరువున్న కార్గోతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం చేరుకున్న ఈ రాకెట్ తిరిగి మూడ్రోజుల తరువాత భూమికి చేరుకుంది. అంతేకాదు, గత ఏడాది మార్చి 30న తొమ్మిది ఇంజన్లతో కూడిన తన ఫాల్కన్-9 రాకెట్ ద్వారా నాసాకు చెందిన ఓ సమాచార ప్రసార ఉపగ్రహాన్ని కూడా విజయవంతంగా అంతరిక్షంలోకి పంపించింది స్సేస్ ఎక్స్. ఆసక్తికమైన విషయం ఏమిటంటే ఉపగ్రహ ప్రయోగానంతరం స్పేస్ ఎక్స్ రాకెట్ ఫాల్కన్-9 సురక్షితంగా సముద్రంలో ల్యాండ్ అవడం. ఇక ఆ తరువాత స్పేస్ ఎక్స్ ప్రయోగాలకు అడ్డే లేకుండా పోయింది.

మొత్తానికి స్పేస్ ఎక్స్ సాధించింది...

మొత్తానికి స్పేస్ ఎక్స్ సాధించింది...

మంగళవారం స్పేస్ ఎక్స్ కంపెనీ జరిపిన రాకెట్ ప్రయోగం గురించి ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇటు అమెరికా నాసా కానీ, అటు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీగానీ ఇప్పటి వరకు ఇలాంటి ప్రయోగం చేయలేకపోయాయి. తన అంతరిక్ష ప్రయోగాలతో ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతులు గడించింది ‘నాసా'. చంద్రమండలంపైకి వ్యోమగాములను సైతం పంపగలిగింది.. అలాంటి నాసా కూడా ఇంతటి శక్తివంతమైన రాకెట్‌ను తయారు చేయలేకపోయింది. నాసా వద్ద ఉన్న రాకెట్‌కు రెండింతల శక్తివంతమైన రాకెట్‌ను స్పేస్ ఎక్స్ తాజాగా ప్రయోగించింది. నాసా ఒక్కటే కాదు.. అటు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకానీ, మరే ఇతర దేశమూ ఇంతటి శక్తివంతమైన రాకెట్‌ను ఇప్పటి వరకు తయారు చేయలేదు.

స్పేస్ ఎక్స్ తాజా రాకెట్ ప్రయోగం ఇలా...

స్పేస్ ఎక్స్ తాజా రాకెట్ ప్రయోగం ఇలా...

ఫిబ్రవరి 6, 2018.. మంగళవారం.. అది ఫ్లోరిడాలోని జాన్ ఎఫ్ కెన్నడీ స్పేస్ సెంటర్‌. అప్పుడు సమయం (స్థానిక కాలమానం) మధ్యాహ్నం 3.45 గంటలు. స్పేస్ సెంటర్‌లోని అపోలో లాంచింగ్ ప్యాడ్‌పై స్పేస్ ఎక్స్ రాకెట్ ‘ఫాల్కన్ హెవీ' తొలి అంతరిక్ష ప్రయోగానికి సిద్ధంగా ఉంది. ప్రపంచం కళ్లన్నీ ఈ ప్రయోగంపైనే. కౌంట్ డౌన్ మొదలైంది. 5... 4... 3... 2.. 1.. ఫాల్కన్ హెవీ రాకెట్‌కు అమర్చి ఉన్న తొలిదశలోని 27 బూస్టర్ ఇంజిన్లు 10 సెకన్లపాటు మంటలుగక్కాయి. లాంచింగ్ ప్యాడ్ గ్రౌండ్ కంట్రోల్ సిబ్బంది అంతా ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. అప్పటి వరకు రాకెట్‌ను గట్టిగా పట్టి ఉంచిన బలమైన మెటాలిక్ హ్యాండ్స్ మెల్లగా పక్కకి తప్పుకున్నాయి. అంతే... ఫాల్కన్ హెవీ రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగికి ఎగసింది. ఒక్కసారిగా కరతాళ ధ్వనులు మిన్నంటాయి. సరిగ్గా రెండున్నర నిమిషాల తరువాత తొలిదశ బూస్టర్లు మూడింటిలో రెండు క్షేమంగా తిరిగి వచ్చి కేప్ కెనవెరాల్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌‌లో ల్యాండ్ అయ్యాయి. అంతే.. మళ్లీ కరతాళ ధ్వనులు!

ఏమిటీ ‘ఫాల్కన్ హెవీ’ రాకెట్...

ఏమిటీ ‘ఫాల్కన్ హెవీ’ రాకెట్...

ఫాల్కన్‌ హెవీ రాకెట్ అనేది పునర్వినియోగ వాహక నౌక. దీనికి మొత్తం 27 బూస్టర్ ఇంజిన్లు అమర్చారు. వీటిలో మూడు ఫాల్కన్-9 రాకెట్‌కు చెందినవి. ఈ 27 బూస్టర్ ఇంజన్లు కలిసి ఏకంగా 23 వేల కిలో న్యూటన్ల శక్తిని వెలువరిస్తాయి. అంటే.. ప్రస్తుతమున్న డెల్టా- 4 హెవీ రాకెట్‌తో పోలిస్తే ఫాల్కన్ హెవీ రెట్టింపు శక్తివంతమైంది. ఒక్క ఫాల్కన్ హెవీ రాకెట్ శక్తి.. పద్దెనిమిది బోయింగ్‌-747 విమానాల శక్తితో సమానం. అంతేకాదు, ఈ రాకెట్ లండన్‌‌లోని 5 డబుల్ డెక్కర్ బస్సులు (64 టన్నులు)ను ఒకేసారి అంతరిక్షంలోకి మోసుకుపోగలదు. ఈ ఫాల్కన్ హెవీ రాకెట్ ద్వారానే భవిష్యత్తులో అంతరిక్ష పర్యాటకాన్ని సుసాధ్యం చేయాలని స్పేస్ ఎక్స్ సంస్థ ఆలోచన. దీని ద్వారా చంద్రుడు, అంగారక గ్రహాల వద్దకు అంతరిక్ష యాత్రికులను తీసుకెళ్లాలని ఈ సంస్థ ప్రాణాళికలు రచిస్తోంది. అంతేకాదు, భూమికి సుదూరంలో ఉన్న బృహస్పతి, శని గ్రహాలకు మానవ రహిత(రోబోలు) యాత్రలు చేపట్టాలని కూడా స్పేస్ ఎక్స్ యోచిస్తోంది.

ఈ ప్రయోగానికి ఎందుకింత ప్రాముఖ్యత అంటే...

ఈ ప్రయోగానికి ఎందుకింత ప్రాముఖ్యత అంటే...

అంతరిక్ష ప్రయోగాల సంస్థ స్పేస్‌ ఎక్స్ మంగళవారం కనీవినీ ఎరుగని ప్రయోగం చేసింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ‘ఫాల్కన్ హెవీ' అనే రాకెట్ ద్వారా ఇప్పటి వరకు ఏ అంతరిక్ష పరిశోధనా సంస్థ చేయని సాహసం చేసింది. తొలిసారిగా అంతరిక్షంలోకి ఓ కారును పంపించింది. చెర్రీపండు రంగులో ఉన్న ఈ టెస్లా కారు స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్‌ ఒకప్పుడు వాడినదే. ఫాల్కన్ హెవీ రాకెట్‌కు ముందు భాగాన ఉన్న క్యాప్సూల్‌లో ఈ కారును అమర్చారు. దీనికి ఎలాన్ మస్క్ ‘రోడ్ స్టర్' అని పేరు పెట్టారు. ఈ కారు డ్రైవింగ్ సీట్లో వ్యోమగామి దుస్తుల్లో ఒక డమ్మీ డ్రైవర్‌ను కూర్చెబెట్టారు. కారు వెనుక భాగంలో శక్తివంతమైన కెమెరాలు అమర్చారు. దీనివల్ల కక్షలో కారు పయనాన్ని భూమ్మీదనుంచి ఎప్పటికప్పుడు గమనించవచ్చు. ఈ కారును అంగారక గ్రహ కక్షలోకి చేర్చడం స్పేస్ ఎక్స్ ముఖ్యోద్దేశం. కారు ఆ కక్షలోకి చేరేందుకు ఆర్నెల్లుపైగానే పడుతుంది. ఈ ఆర్నెల్లూ రోడ్‌స్టర్ రోదసిలో నిర్ణీత కక్షలో తిరుగుతూనే ఉంటుంది. అంతేకాదు, ఈ కారు నుంచి సింగర్ డేవిడ్ బౌవీ ‘స్పేస్ ఓడిటీ' అల్బంలోని ‘లైఫ్ ఆన్ మార్స్' గీతం వినిపిస్తూ ఉంటుంది. భవిష్యత్తులో ఎప్పుడైనా ఏలియన్స్ ఈ కారును గమనిస్తే.. ఈ కారు భూమ్మీది మానవజాతికి చెందినదని వారికి అర్థమవడం కోసం ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకున్నట్లు ‘స్పేస్ ఎక్స్' వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ తెలిపారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The pioneering rocket firm just pulled off the unexpected, and carried out what appears to be a seamless first-ever launch of its massive new rocket, called Falcon Heavy. That makes SpaceX, the game-changing company helmed by billionaire Tesla CEO Elon Musk, the owner of the world's most powerful operational rocket. Falcon Heavy took flight Tuesday around 3:45 pm ET from Kennedy Space Center in Florida."I'm still trying to absorb everything that happened because it's still kind of surreal to me," Musk told reporters after the launch.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more