రజనీకాంత్: బస్సు కండక్టర్ నుంచి, కెమెరాలు పక్కకు పోతే...

Posted By:
Subscribe to Oneindia Telugu
  Rajini On Jayalalithaa : జయలలిత ముఖ్యమంత్రి అయితే దేవుడు కూడా తమిళనాడును రక్షించలేడు

  చెన్నై: రజనీకాంత్ ఓ రాజకీయ పార్టీ స్థాపించే స్థాయికి చేరుకోవడం అంత సులభంగా జరిగిందేమీ కాదు. ఓ బస్సు కండక్టర్ తమిళ సూపర్ స్టార్ స్థాయికి ఎదిగారు. తెరపై ఆయన ఏమైనా చేయగలరు.

  ఒక్కసారి కెమెరాలు పక్కకు జరిగితే అతి సామాన్యుడైపోతారు. నిజ జీవితంలో నటించడానికి తనకు ఎవరూ డబ్బులు ఇవ్వడం లేదని అంటారు. అభిమానులు ఆయనను దైవ సమానుడిగా కొలుస్తారు. చివరకు రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు చెప్పారు.

  రజనీకాంత్

  రజనీకాంత్

  రాజకీయాల్లోకి ప్రవేశించడానికి రజనీకాంత్ తెగ ఆలోచించినట్లే కనిపిస్తున్నారు. చాలా కాలంగా ఆయన రాజకీయాల్లోకి వస్తారా, లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతూ వచ్చాయి. చివరకు 67 ఏళ్ల రజనీకాంత్ ఎట్టకేలకు రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు చెప్పారు.

   కొంత అయిష్టతే ఉంది..

  కొంత అయిష్టతే ఉంది..

  నిజానికి, రాజకీయాల్లోకి రావడానికి రజనీకాంత్ అంత ఇష్టంగా ఏమీ లేరనే అనిపించింది. రాజకీయాలు ఎంత కష్టమైనవో తనకు తెలుసునని, అందుకే రాజకీయాల్లోకి రావడానికి అంత ఇష్టపడలేదని ఆయనే స్వయంగా చెప్పారు. అయితే, యుద్దంలోకి దిగితే గెలవాల్సిందేనని ఆయన అన్నారు.

  ఎన్నికల సమయంలో ప్రతిసారీ...

  ఎన్నికల సమయంలో ప్రతిసారీ...

  రజనీకాంత్ ఇన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్నారని చెప్పడానికి వీల్లేదు. రజనీకాంత్ తన అభిమానులకు ఏ సూచన చేస్తారని ఎన్నికల సమయాల్లో అన్ని రాజకీయ పార్టీలు ఆసక్తిగా ఎదురు చూడడం ఆనవాయితీగా మారింది. 2014 సాధారణ ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆయనను కలిశారు. అంటే, రాజకీయంగా రజనీకాంత్ ప్రభావం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.

   అప్పుడు ఇలా జరిగింది...

  అప్పుడు ఇలా జరిగింది...

  జయలలిత మళ్లీ ముఖ్యమంత్రి అయితే దేవుడు కూడా తమిళనాడును రక్షించలేరని 1996లో రజనీకాంత్ చేసిన ప్రకటన సంచలనమే సృష్టించింది. అది డిఎంకె - టిఎంసి కూటమికి కలిసి వచ్చింది. అన్నాయండికె ఓడిపోయింది.

  సుదీర్ఘ ప్రయాణమే...

  సుదీర్ఘ ప్రయాణమే...

  ఓ పోలీసు కానిస్టేబుల్ కుమారుడు శవాజీరావు గైక్వాడ్ 1950 డిసెంబర్ 12వ తేదీన జన్మించి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌గా ఎదగడానికి చేసిన ప్రయాణం సుదీర్ఘమే. తల్లిదండ్రులు మహారాష్ట్రీయులు బెంగళూరులో నివాసం ఉంటూ వచ్చారు. రజినీకాంత్‌కు ఐదేళ్ల వయస్సు ఉన్నప్పుడు తల్లి మరణించింది. కుటుంబం పేదరికంతో సతమతమవుతూ వచ్చింది.

   చిన్నపాటి ఉద్యోగాలు చేస్తూ..

  చిన్నపాటి ఉద్యోగాలు చేస్తూ..

  బస్సు కండక్టర్ ఉద్యోగం పొందడానికి ముందు రజనీకాంత్ చిన్నపాటి ఉద్యోగాలు చాలా చేశారు. కర్ణాటక రవాణా సంస్థలో ఆయన కండక్టర్‌గా చేరారు. రజనీకాంత్ బస్సు కండక్టర్‌గా ప్రయాణికులకు వినోదాన్ని పంచుతూ ఉండేవారు. ఆ కాలంలో ఆయన బస్సు కోసం ప్రయాణికులు ఎదురు చూస్తూ ఉండేవారు కూడా. టికెట్లు కట్ చేసి, చేంజ్ ఇవ్వడంంలో తనదైన ప్రత్యేకమైన శైలిని ప్రదర్శించేవారు.

   మిత్రుడి సాయంతో నటనలో శిక్షణ

  మిత్రుడి సాయంతో నటనలో శిక్షణ

  ఓ మిత్రుడి ఆర్థిక సాయంతో రజనీకాంత్ 1973లో మద్రాసు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చేరారు. ఆ సమయంలో ఏ స్టేజీ ప్రదర్శనతో రజనీకాంత్ దర్శకుడు బాలచందర్ దృష్టిని ఆకర్షించారు. తమిళం నేర్చుకోవాలని చె్ిప 1975లో బాలచందర్ 1975లో అపూర్వ రాగగళ్ అనే సినిమాలో క్యాన్సర్ పేషంట్ పాత్ర ఇచ్చారు. ఆయనకు రజనీకాంత్ అని పేరు పెట్టింది కూడా బాలచందరే. పాత్ర చిన్నదే అయినా రజనీకాంత్ తన మార్కుతో అదరగొట్టాడు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  For Rajinikanth it has been a long journey for the son of a police constable, born Shivaji Rao Gaekwad on December 12, 1950.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి