వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చికాకు కలిగిస్తున్న చిరంజీవి ధోరణి, పార్టీలో తుపాను!

ప్రజారాజ్యం నుంచి ఎన్నికైన ఆ 17మంది (చిరంజీవి మినహా) ఎమ్మెల్యేలు త్వరగా అధికార కాంగ్రెస్ లోకో, లేకపోతే టిడిపి లోకో ఫిరాయించాలని చూస్తున్నట్టు వారి కదలికలను బట్టి తెలుస్తోంది. పిఆర్పీ ఎమ్మెల్యేలు ముగ్గురు, నలుగురుగా డిన్నర్ సమావేశాలు పెట్టుకుంటున్నట్టు సమాచారం. కాంగ్రెస్ లోకి ఫిరాయించాలంటే కనీసం మూడో వంతు మంది ఉండాలి. అంటే కనీసం ఆరుగురు ఉంటే తప్ప ఫిరాయింపు కుదరదు. అంతకంటే తక్కువైతే ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఎమ్మెల్యేలుగా అనర్హత వస్తుంది.
ప్రజారాజ్యంలో ఉంటే ఈసారి ఎన్నిక కావడం కష్టమన్న భయం వారిలో ఉంది. చిన్నపార్టీలో ఉండడం వల్ల నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు సరిగా సాగడం లేదన్న అసహనం వారిలో ఉంది. చిరంజీవి వారు ఎన్నిసార్లు ఆ విషయం చెప్పినా ఆయన సినిమా ఫక్కీలో పొంతన లేకుండా వేదాంత ధోరణిలో సమాధానాలు ఇవ్వడం వారికి చికాకు కలిగిస్తోంది.