వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కిరణ్ కుమార్ రెడ్డిపై బొత్స అసంతృప్తి?

సిమెంట్ ధరల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేస్తూ బొత్స సత్యనారాయణ ఇటీవల ముఖ్యమంత్రికి లేఖ రాశారు. యాజమాన్యాలు కుమ్మక్కయి సిమెంట్ ధరలు పెంచాయని, దానివల్ల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడం కష్టమేనని బొత్స సత్యనారాయణ ఆ లేఖలో అభిప్రాయపడ్డారు. ఇటువంటి విషయాలేమైనా ఉంటే మంత్రివర్గం సమావేశంలో చర్చించడానికి బదులు లేఖలు రాయడం వెనక బొత్స సత్యనారాయణ అసంతృప్తే కారణమని చెబుతున్నారు.
తనకు కేటాయించిన శాఖ పట్ల మొదట్లోనే ఆయన తీవ్ర ఆసంతృప్తి వ్యక్తం చేశారు. సీనియర్ మంత్రుల అసంతృప్తి గళాన్ని ఉమ్మడిగా వినిపించే వ్యవహారంలో ప్రధాన పాత్ర పోషించారు. అయితే తమ కాంగ్రెసు పార్టీ అధిష్టానం సూచనలతో ఆయన వెనక్కి తగ్గారు. ముఖ్యమంత్రి పీఠం ఆశించి భంగపడడం బొత్సలోని అసంతృప్తికి ప్రధాన కారణమని చెబుతున్నారు.