పొలంలో బయటపడ్డ బంగారం, పరుగులు పెట్టారు

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయనగరం: వ్యవసాయ భూమిలో బంగారు నిధి వెలుగు చూసిన సంఘటన విజయనగరం జిల్లా సాలూరులో చర్చనీయాంశంగా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు శుక్రవారం రాత్రి రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు.

సాలూరు డివిజన్ పరిధిలోని పాచిపెంట మండలంలో శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన ఓ వ్యక్తికి కొంత భూమి ఉంది. దీనిని సాలూరు పట్టణానికి చెందిన ఒక వ్యక్తి లీజుకు తీసుకుని పంట పండిస్తున్నారు. ఖరీఫ్ సీజన్ కావడంతో వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో నాట్లు వేసేందుకు భూమిని చదును చేశారు.

gold

అనంతరం కురిసిన వర్షాలకు ఓ యువతికి ఈ పొలంలో ఓ పెట్టె లభ్యమైంది. ఈ పెట్టెలో బంగారు పూసలు, చైన్లు, ఆభరణాలు, నాణేలు కనిపించాయని చెబుతున్నారు. దీంతో వాటిని కడికి ఇంటికి తీసుకు వెళ్లారని అంటున్నారు. ఈ విషయం అంతటా పాకింది.

దీంతో, గ్రామంలోని మరికొందరు ఆ పొలంలోనికి వెళ్లి వెతకగా బంగారు పూసలు, ముక్కుపుడకలు, చైన్లు, మరికొన్ని వెండి ఆభరణాలు దొరికినట్లుగా చెబుతున్నారు. ఇది మండలమంతా తెలిసింది. వీటిని స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ఆ గ్రామానికి వెళ్లి బంగారు నగలు దొరికాయన్న పేర్లున్న ప్రతి ఒక్కరినీ విచారిస్తున్నారు. వాటిని ఓ నగల దుకాణంలో అమ్మినట్లు తెలియడంతో విచారిస్తున్నారని తెలుస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Gold found in agri field in Vijayanagaram.
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి