ఛాన్స్ మిస్ అవద్దు, అచ్చెన్న 'క్లూ': జగన్ పార్టీ నుంచి లైన్‌లో ఆరుగురు?, బాబు గేమ్ స్టార్ట్..

Subscribe to Oneindia Telugu
  Acchennaidu Confirm YSRCP leaders joining TDP ఛాన్స్ మిస్ అవద్దు, అచ్చెన్న 'క్లూ' | Oneindia Telugu

  విజయవాడ: నంద్యాల ఉపఎన్నికల సీన్ ఏపీ రాజకీయ సమీకరణాలను బాగానే ప్రభావితం చేస్తోంది. తమను ఢీకొట్టడం వైసీపీకి శక్తికి మించిన పని అన్న అభిప్రాయం టీడీపీలో బలంగా నాటుకుపోయింది. గెలవడం సంగతి అటుంచి, కనీసం గట్టి పోటీ ఇచ్చి ఉన్నా.. వైసీపీకి ఇంత ఆత్మన్యూనత పరిస్థితి ఏర్పడి ఉండేది కాదు.

  మరో 10 మందినైనా!: టాప్ లీడర్లంతా బాబుతో టచ్‌లో!, జగన్ యాక్షన్ లోకి దిగకపోతే కష్టమే?

  ప్రత్యర్థికి ఎదురైన ఈ పరిస్థితిని క్యాష్ చేసుకునే దిశగా టీడీపీ వేగంగా పావులు కదుపుతోంది. నియోజకవర్గాల స్థాయిలో వైసీపీ నేతలకు గాలం వేసేందుకు ముఖ్య నేతలందరిని సీఎం చంద్రబాబు అలర్ట్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ ఉనికిని నామరూపల్లేకుండా చేయడమే లక్ష్యంగా ఇప్పటి నుంచే పని మొదలుపెట్టాలని ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది.

  అచ్చెన్న క్లూ.. లైన్‌లో ఆరుగురు:

  అచ్చెన్న క్లూ.. లైన్‌లో ఆరుగురు:

  వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు పదేపదే ఫోన్లు చేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు తాజాగా వ్యాఖ్యానించడం.. టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ త్వరలోనే మొదలవబోతుందన్న సంకేతాలను పంపించింది. శ్రీకాకుళం జిల్లా పిన్నింటిపేటలో గురువారం జరిగిన బహిరంగసభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతల నుంచి తనకు ఇప్పటికి ఆరు ఫోన్లు వచ్చాయని, వచ్చే ఎన్నికల్లో వైసీపీ పూర్తిగా భూస్థాపితం అవుతుందన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు. దీన్నిబట్టి టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ కు అంతర్గతంగా గ్రౌండ్ వర్క్ కొనసాగుతున్నట్లు అర్థమవుతోంది.

  నిజమేనా?

  నిజమేనా?

  మొన్నామధ్య టీడీపీ అధినేత చంద్రబాబు సైతం వైసీపీ కీలక నేతలు కొంతమంది తమతో టచ్ లో ఉన్నారని బాంబు పేల్చారు. అయితే ఈ వ్యాఖ్యలు టీడీపీ మైండ్ గేమ్ లో భాగంగానే ఎక్కువమంది చూశారు. నంద్యాల ఫలితం తర్వాత వైసీపీకి చెందిన కొంతమంది నేతల్లో పార్టీపై నమ్మకం సడలడం నిజమే అయినప్పటికీ.. పార్టీ మారడానికి వారు సిద్దంగా ఉన్నారన్న ప్రచారంలో నిజమెంత అనేది అంచనా వేయడం కష్టంగా మారింది.

  ఛాన్స్ మిస్ అవద్దు?:

  ఛాన్స్ మిస్ అవద్దు?:

  నిజానికి వైసీపీకి చెందిన కొంతమంది నేతలు భవిష్యత్తుపై ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. నంద్యాల, కాకినాడ ఎఫెక్ట్ గట్టిగా తగలడంతో.. భవిష్యత్తు డైలామాలో పడకముందే జాగ్రత్తపడాలని వారు యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఈ అవకాశం కోసమే ఎదురుచూస్తున్న టీడీపీ.. వారిని పార్టీలోకి లాగలడానికి ఇదే సరైన సమయంగా భావిస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్ ను తిరిగి పట్టాలెక్కించడానికి ఇంతకన్నా మంచి అవకాశం దొరకదని, కాబట్టి దీన్ని వదులుకోవద్దనే యోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది.

  బేరసారాలు మొదలయ్యాయి?:

  బేరసారాలు మొదలయ్యాయి?:

  ఆపరేషన్ ఆకర్ష్‌ను పకడ్బందీగా చేసుకుపోయేందుకు కొంతమంది కీలక నేతలకు చంద్రబాబు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారన్న ఊహాగానాలు వినిపించాయి. తాజాగా అచ్చెన్న చేసిన వ్యాఖ్యలను అందులో భాగంగానే చూస్తున్నారు. తొలుత ఒకరిద్దరినైనా పార్టీలోకి లాగగలిగితే ఆ తర్వాత పని తేలికవుతుందని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం వైసీపీ నుంచి రావడానికి సిద్దంగా ఉన్న నేతలతో బేరసారాలు మొదలైనట్లు సమాచారం. మొత్తం మీద రేపో మాపో.. వైసీపీ నుంచి చేరికలు ఉంటాయన్నట్లుగా టీడీపీ చేస్తున్న హడావుడి ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  On Thursday, Minister Acchennaidu said six members from YSRCP are ready to join in TDP.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X