Earwax: గులిమితో క్యాన్సర్ గుర్తింపు! వైద్య రంగంలో షాక్
చెవిలో పేరుకుపోయే గులిమి... ఇప్పటివరకు మనకు అసౌకర్యంగా అనిపించే ఒక చిన్న సమస్య మాత్రమే. కానీ అదే గులిమి ఒక రోజు క్యాన్సర్‌ను ముందే హెచ్చరించే సంకేతంగా మారుతుందని ఎవరైనా ఊహించారా? బ్రెజిల్‌లోని ఫెడరల్ యూనివర్సిటీ ఆఫ్ గోయాస్ (UFG) శాస్త్రవేత్తలు చేసిన తాజా పరిశోధన ఈ ప్రశ్నకు సంచలనాత్మక సమాధానం ఇచ్చింది.
చెవి గులిమిని ఆధారంగా తీసుకుని క్యాన్సర్‌ను గుర్తించే ఈ వినూత్న పరిశోధనకు "సెరూమెనోగ్రామ్" అనే పేరు పెట్టారు. ఈ ప్రాజెక్ట్‌కు 2025 కాపెస్ అవార్డుల్లో గౌరవ ప్రస్తావన కూడా లభించింది. ఇప్పటివరకు క్యాన్సర్ నిర్ధారణ అంటే ఖరీదైన రక్త పరీక్షలు, బాధాకరమైన బయాప్సీలు, ఖరీదైన స్కాన్లు గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు... ఒక చిన్న గులిమి నమూనాతోనే శరీరంలో దాగి ఉన్న ప్రమాదాన్ని కనిపెట్టే దశకు వైద్యం చేరింది.

శాస్త్రవేత్తల మాటల్లో చెప్పాలంటే - శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు చెవి గులిమి రసాయన కూర్పు దాదాపు ఒకేలా ఉంటుంది. కానీ క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధి మొదలైన వెంటనే ఆ రసాయన సమతుల్యత మారిపోతుంది. "చెవి గులిమి ఇప్పుడు మన ఆరోగ్యానికి వేలిముద్రలా మారింది" అని ఈ అధ్యయన సమన్వయకర్త నెల్సన్ అంటోనియోసి ఫిలో వ్యాఖ్యానించారు. అంటే... మన శరీరంలో ఏం జరుగుతుందో చెవి గులిమి చెప్పగలుగుతోంది.
ఈ పరిశోధనలో భాగంగా 751 మంది నుంచి గులిమి నమూనాలను సేకరించారు. క్యాన్సర్ చికిత్సలో ఉన్న 531 మందిలో ఈ పరీక్ష ఖచ్చితంగా క్యాన్సర్ ఉనికిని గుర్తించింది. ఇక వ్యాధి లేనట్లు భావించిన 220 మందిలో 5 నమూనాలు అనుమానాస్పదంగా తేలాయి. తర్వాత సంప్రదాయ పరీక్షలు చేయగా... ఆశ్చర్యకరంగా ఆ ఐదుగురికీ నిజంగానే క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో ఈ విధానం ఎంత నమ్మదగినదో స్పష్టమైంది.
కీలక మైలురాయి..
ఇక్కడితో కథ ఆగలేదు. 2025లో మరో కీలక మైలురాయి చేరుకున్నారు శాస్త్రవేత్తలు. ఈ గులిమి ఆధారిత పరీక్ష ప్రీ-క్యాన్సర్ దశను కూడా గుర్తించగలదని వెల్లడించారు. అంటే వ్యాధి పూర్తిగా ప్రబలకముందే చికిత్స మొదలుపెట్టే అవకాశం. దీని వల్ల తక్కువ బాధ, తక్కువ ఖర్చు, ఎక్కువ జీవనావకాశాలు సాధ్యమవుతాయి.
ప్రస్తుతం నియంత్రణ నిబంధనల కారణంగా ఈ పరీక్ష బ్రెజిల్ ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలో ఉచితంగా అందుబాటులో లేదు. అయినప్పటికీ, త్వరలోనే ప్రైవేటు ఆసుపత్రులు, ప్రభుత్వ విద్యా సంస్థల ద్వారా ఇది అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వ్యాధులను గుర్తించే దిశగా..
ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే... ఇదే సాంకేతికతను ఉపయోగించి అల్జీమర్స్, పార్కిన్సన్స్, డిమెన్షియా వంటి మెదడు సంబంధిత వ్యాధులను గుర్తించే దిశగా కూడా పరిశోధనలు సాగుతున్నాయి. ఇది విజయవంతమైతే, వైద్య నిర్ధారణ రంగమే కొత్త మలుపు తిరగనుంది.
ఇంతకాలం శుభ్రం చేయాల్సిన వ్యర్థంగా భావించిన చెవి గులిమి... ఇప్పుడు ప్రాణాలు కాపాడే కీలక సూచనగా మారుతోంది. ఈ బ్రెజిలియన్ పరిశోధన ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతోంది - క్యాన్సర్‌ను సకాలంలో, చవకగా, సులభంగా గుర్తించడం ఇక అసాధ్యం కాదు.
-
సమ్మర్ స్పెషల్ "అరటిపండు ఆమ్లెట్" ఎలా చేయాలంటే ??? -
బ్యాచిలర్ స్టైల్ మటన్ కర్రీ.. ఇలా సింపుల్ గా చేసుకోండి..! -
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా "క్యారెట్ హల్వా" ఎలా చేయాలంటే..? -
షుగరు బాధితులు వేసవిలో ఎలాంటి స్నాక్స్ తినాలి..!! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!!












Click it and Unblock the Notifications