Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రెస్టారెంట్ స్టైల్‌ లో చికెన్ టిక్కా.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి..!

చికెన్ అనగానే చాలామందికి నోరూరుతుంది. చికెన్ ను పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఇష్టంగా తింటారు. చికెన్ తో అనేక రకాల వెరైటీస్ చేసుకుని తింటూంటారు. అయితే చికెన్ టిక్కా ఎప్పుడైనా ట్రై చేశారా..? ఎప్పుడూ రెస్టారెంట్ లోనే దొరికే ఈ వంటకాన్ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. చికెన్ టిక్కాను ఎలా తయారు చేయాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..? ఇక్కడ తెలుసుకుందాం..

చికెన్ టిక్కా తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. తగినంత చికెన్, పెరుగు మ్యారినేషన్ కోసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, కారం, పసుపు, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, ఉప్పు, రుచికోసం ఆవ నూనె, ఉల్లిపాయలు తీసుకోవాలి.

Chicken Tikka Like Restaurant Simple Home Recipe with Ingredients Method restaurant style recipe

చికెన్ టిక్కా తయారీ విధానం చూస్తే.. ముందుగా చికెన్ ను మ్యారినేషన్ చేసుకోవాలి. ఒక గిన్నెలో నిమ్మరసం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని చికెన్ ముక్కలకు వేసి బాగా పట్టించాలి. అలా 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో గిన్నె తీసుకోవాలి. అందులో పెరుగు, మిరియాల పొడి, ధనియాల పొడి, కారం, పసుపు, గరం మసాలా, జీలకర్ర పొడి వేసి బాగా మిక్సింగ్ చేసుకోవాలి.

ఈ పేస్టును చికెన్ ముక్కలకు బాగా పట్టించాలి. అలా ఈ మిశ్రమాన్ని కూడా కొద్దిసేపు మ్యారినేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఓవెన్ పై మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కల్ని అమర్చి 15 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. చికెన్ ముక్కల్ని తిప్పుతూ గ్రిల్ చేసుకోవాలి. మధ్యమధ్యలో కొద్దిగా బటర్ రాస్తే రుచిగా ఉంటుంది. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలను పుల్లలకు గుచ్చాలి. మధ్య మధ్యలో ఉల్లిపాయ, కాప్సికమ్ ముక్కలను కూడా చేర్చుకోవచ్చు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+