సూపర్ టేస్టీ 'అల్లం చట్నీ'.. నాలుకమీద వేసుకుంటే రప్పా రప్పే..!!
అల్లం చట్నీ అనగానే చాలామందికి నోరూరుతుంది. అల్లం చట్నీ లేనిదే ఇడ్లీ, దోశ, ఉప్మా లాంటి టిఫిన్స్ పూర్తికావు. అల్లం చట్నీ ఒక్కో చోట ఒక్కో విధంగా ఉంటుంది. కొన్ని చోట్ల ఘాటుగా ఉంటుంది. మరికొన్ని ప్రాంతాల్లో తియ్యగా ఉంటుంది. అల్లం చట్నీని ప్రాంతాలను బట్టి రకరకాలుగా చేస్తుంటారు. అయితే హోమ్ మేడ్ అల్లం చట్నీ ఎప్పుడైనా ట్రై చేశారా..? సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి సూపర్ టేస్టీ అల్లం చట్నీకి కావాల్సిన పదార్థాలు ఏంటి..? ఎలా తయారు చేసుకోవాలి..?
సూపర్ టేస్టీ అల్లం చట్నీ తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. అల్లం అరకప్పు చిన్న చిన్న ముక్కలుగా తరిగినవి, చింతపండు నిమ్మకాయ సైజంత, బెల్లం రెండు టేబుల్ స్పూన్లు, ఎండు మిర్చి ఆరు నుంచి ఎనిమిది వరకు, ఉప్పు రుచికి సరిపడా, పచ్చిమిర్చి రెండు, నూనె మూడు టేబుల్ స్పూన్ లు, ఆవాలు ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర అర టేబుల్ స్పూన్, మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు ఒక రెమ్మ, ఇంగువ చిటికెడు, కొత్తిమీర కొద్దిగా తీసుకోవాలి.
అల్లం చట్నీ తయారీ విధానం చూస్తే.. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకోవాలి. పాన్ లో కొద్దిగా నూనె వేసి అల్లం ముక్కలను స్వల్పంగా వేయించుకోవాలి. ఆ తర్వాత అదే పాన్ లో ఎండు మిర్చి, పచ్చి మిర్చి వేయించండి, ఇప్పుడు చింతపండు కొద్దిగా నీటిలో నానబెట్టండి. ఇప్పుడు మిక్సీలో అల్లం, మిర్చి, చింతపండు, బెల్లం, ఉప్పు వేసి గ్రైండింగ్ చేసుకోవాలి. కొద్దిగా నీరు వేసి మందంగా పేస్ట్ చేసుకోవాలి.

ఇప్పుడు పాన్ లో నూనె వేడి చేయాలి. అందులో తాళింపు దినుసులు వేయాలి. ఆ తాళింపును చట్నీ మీద పోయాలి. బాగా కలపాలి. దాంతో సూపర్ టేస్టీ అల్లం చట్నీ రెడీ అయినట్టే.. ఈ చట్నీని ఇడ్లీ, దోశ, ఉప్మాతో తీసుకోవచ్చు. మీరు కూడా ఇలా ఈజీగా అల్లం చట్నీ చేసుకోండి..
-
ఈ వేసవిలో ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఇది తినాల్సిందే..? -
ఒరేయ్ ఆజామూ లగెత్తరోయ్.. తులం బంగారం రూ. 2 వేలే.. -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ? బోర్డు క్లారిటీ..! -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!!












Click it and Unblock the Notifications