రోజుకు ఎన్ని కోడిగుడ్లు తీసుకోవాలి?
కోడిగుడ్లు ఆరోగ్యకరమైనవే అయినప్పటికీ.. రోజుకు ఎన్ని గుడ్లు తినాలనే విషయంలో సందేహాలు ఉన్నాయి. వయసు, ఆరోగ్య స్థితి, బరువు తగ్గించుకోవడం, మెదడు ఆరోగ్యం, ఎముకల బలం వంటి లక్ష్యాలను బట్టి గుడ్ల వినియోగం మారుతుందని నిపుణులు చెబుతున్నారు. పరిమిత మోతాదులో గుడ్లు తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని, కొలెస్ట్రాల్‌ను నియంత్రించవచ్చని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
విటమిన్ ఏ, డీ, ఈ, బీ12, కోలిన్, ల్యూటిన్, జియాక్సానథిన్, అసంతృప్త కొవ్వులు కూడా గుడ్లలో పుష్కలంగా ఉంటాయి. గుడ్డు పచ్చసొనలో కొవ్వులో కరిగే పోషకాలు, మెదడు, కంటి ఆరోగ్యానికి అవసరమైన పదార్థాలు అధికంగా ఉంటాయి. తెల్లసొనలో స్వచ్ఛమైన ప్రొటీన్ మాత్రమే ఉంటుంది. ఇది కండరాలు, మెదడు, కళ్ళకు, మొత్తం ఆరోగ్యానికి అద్భుతమైన ఇంధనంగా పనిచేస్తుంది. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు ప్రతిరోజూ ఒక గుడ్డు తినడం వల్ల గుండె జబ్బులకు దూరం అయినట్లు గుర్తించారు.

పరిమితికి మంచి కోడిగుడ్లను తీసుకోవడం హానికరం కావచ్చు. ప్రతిరోజూ 1-2 గుడ్లు తినడం సురక్షితం. ఎన్ని గుడ్లు తినాలనే విషయంపై ఆరోగ్య పరిస్థితి చాలా ముఖ్యం. గుండె జబ్బుల ప్రమాదం ఉన్నవారు, మధుమేహం బారినపడ్డవారు, అధిక LDL కొలెస్ట్రాల్ ఉన్నవారు వారానికి నాలుగు నుంచి ఏడు గుడ్లు మాత్రమే తినాలని నిపుణులు సూచిస్తున్నారు. కొలెస్ట్రాల్ సాధారణస్థితిలో ఉండి, గుండె జబ్బులు లేదా మధుమేహం లేకపోతే, రోజుకు ఒకటి నుంచి రెండు గుడ్లు తినడం సురక్షితం, ప్రయోజనకరం.
గుండె జబ్బులు, అధిక LDL, మధుమేహం ఉంటే, వారానికి నాలుగు నుంచి ఏడు కోడిగుడ్లకు తినడానికి పరిమితం కావాల్సి ఉంటుంది. ఏ సందర్భంలోనైనా, కోడి గుడ్లతో పాటు రోజువారీ ఆహారంలో ఇంకే పదార్థాలను తీసుకుంటున్నామనేది ముఖ్యం. జీవనశైలి, వ్యాయామం, నిద్ర, వంట పద్ధతులు అన్నీ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
ఒక గుడ్డులో సుమారు ఆరు నుంచి ఏడు గ్రాముల వరకు ప్రొటీన్ ఉంటుంది. శరీరానికి అవసరమైన తొమ్మిది అమైనో ఆమ్లాలు ఇందులో లభిస్తాయి. విటమిన్ ఎ, డి, ఇ, బి12, కోలిన్, ల్యూటిన్, జియాక్సానథిన్, అసంతృప్త కొవ్వులు కూడా గుడ్లలో పుష్కలంగా ఉంటాయి. పచ్చసొనలో కొవ్వులో కరిగే పోషకాలు, మెదడు, కంటి ఆరోగ్యానికి అవసరమైన పదార్థాలు అధికంగా ఉంటాయి. తెల్లసొనలో స్వచ్ఛమైన ప్రొటీన్ మాత్రమే ఉంటుంది. ఇది కండరాలు, మెదడు, కళ్ళకు, మొత్తం ఆరోగ్యానికి అద్భుతమైన పోషకంగా పనిచేస్తుంది.
-
అమ్మకు భరోసా.. మూడు దశాబ్దాల ప్రస్థానంలో భారత్ విజయగాథ -
అందుకే వేసవిలో ఈ జావ తాగాల్సిందే, సమస్యలన్నీ పరార్..!! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications