Insomnia reducing foods: నిద్రలేమి సమస్యతో బాధపడేవారు వెంటనే వీటిని తినండి!
ప్రస్తుత సమాజంలో నిద్రలేమి సమస్య అతి పెద్ద సమస్యగా ఇబ్బంది పెడుతోంది. అనేక సమస్యలతో సతమతమవుతూ సరిగ్గా నిద్రపోలేక, పడుకుంటే నిద్రరాక చాలామంది అనారోగ్యానికి గురవుతున్నారు. అలా నిద్రలేమి సమస్యతో బాద పడుతున్న వారు రోజువారీ ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకుంటే నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టొచ్చు అని చెప్తున్నారు డైటీషియన్లు.
నిద్రలేమి సమస్యతో అనేక వ్యాధులు
అయితే కొన్ని రకాల పండ్లతో పాటు, కొన్ని రకాల ఆకు కూరలు తీసుకోవడం వలన కొంత మేరకు నిద్రలేమి సమస్యను అరికట్టవచ్చునని చెప్తున్నారు. ఎక్కువగా నాన్ వెజ్ తినే వారికి తొందరగా డైజెషన్ కాకపోవడం వలన నిద్రకు భంగం కలుగుతుంది. నిద్రలేమి సమస్యతో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మానసిక ఒత్తిడికి గురవుతున్న వారిలో కూడా నిద్రలేమి సమస్య ఉంటుంది.

నిద్రలేమితో బాధ పడేవారు ఇలా జాగ్రత్త పడాలి
నిద్ర వేళకు ఫుల్ గా భోజనం చేయడం జీర్ణక్రియ ఆలస్యంగా జరగడం వలన కడుపులో ఆయాసం ,ఉబ్బరం తో రాత్రంతా నిద్రకు భంగం కలుగుతుంది. ఇలా అనేక కారణాలు నిద్రలేమిని కలిగిస్తాయి. కనుక నిద్రలేమి సమస్యతో బాధ పడే వారు భోజనం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇవి తింటే నిద్రలేమి సమస్యకు చెక్
నిద్రలేమి సమస్యకు ఆకుకూరలతో చెక్ పెట్టొచ్చు. పాలకూర, బచ్చలికూర, తోటకూర వంటి ఆకుకూరల్లో మెగ్నీషియం,కార్బోహైడ్రేట్లు మిటమిన్లు ఏ,విటమిన్ సి, విటమిన్ కె,తోపాటు ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. వీటిని తింటే నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టొచ్చు. ఆకుకూరలు తొందరగా జీర్ణం అవ్వటం వలన నిద్రకు ఎలాంటి సమస్య ఉండదు. పాలకూర తో గుండె సంబంధిత వ్యాధులను కూడా కట్టడి చేసే అవకాశం ఉందని వైద్యనిపుణులు సూచిస్తుంటారు
పండ్లు, పాలతో పాటు ఇవి తింటే మంచి నిద్ర
అయితే ఆకుకూరలు మాత్రమే కాదు కొన్నిరకాల పండ్లు కూడా మన నిద్రకు ఎంతగానో ఉపయోగపడతాయి. కివీ, చెర్రీస్ వంటి పండ్లు, అరటిపండ్లు మన నిద్రను మేరుగుపరచటం కోసం దోహదం చేస్తాయి. గోరు వెచ్చని పాలలో దాల్చిన చెక్క పొడిని గ్లాసు పాలలో చిటికెడు పొడిని కలుపుకొని తాగితే మంచి నిద్ర పడుతుంది. వాల్ నట్స్, గుమ్మడి గింజలు, చియా సీడ్స్ వంటి వాటిని ఆహారంలో తీసుకోవటం వలన కూడా నిద్ర బాగా పడుతుంది. మంచి పోషకాహారం మన నిద్రను మెరుగుపరుస్తుంది.
-
పుచ్చకాయ రైస్ అసలు ఎప్పుడైనా ట్రై చేశారా..? -
ఎండాకాలంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలా? ఇవి ఆహారంలో తీసుకోండి! -
కొవ్వుతోనే కొవ్వుకు చెక్: మన శరీరంలోని 'బ్రౌన్ ఫ్యాట్' రహస్యం.. -
ఈ ఫోటోలో "పిజ్జా" పీస్ ఎక్కడుందో కనిపెట్టగలరా ? -
కల్తీ మామిడి పండ్లపై హెచ్-ఫాస్ట్ నిఘా.. సమాచారం ఇవ్వమన్న సీపీ సజ్జనార్ -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే












Click it and Unblock the Notifications