కొబ్బరి నీళ్లు.. చెరకు రసం - వేసవిలో ఈ రెండింటిలో ఏది మంచిది..!?
వేసవి తీవ్రత క్రమేణా పెరుగుతోంది. ఎండ వేడి పెరిగే కొద్దీ శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచేందుకు సహజ పానీయాలు తాగడం చాలా ముఖ్యం. ముఖ్యంగా కొబ్బరి నీళ్లు, చెరకు రసం వేసవిలో ఎక్కువగా తీసుకునే పానీయాలు. దీంతో.. ఆరోగ్య పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందు కోసం కొబ్బరి నీళ్లు.. చెరకు రసం వంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. ఈ రెండూ ఆరోగ్యానికి మంచివే అయినా, వాటి ప్రయోజనాలు కొంచెం భిన్నంగా ఉంటాయి. అయితే, అసలు ఈ రెండు పానీయాల్లో వేసవి సమయంలో ఆరోగ్య పరంగా ఏది ఎక్కువ ఆరోగ్య పరంగా ప్రయోజనాలు అందిస్తుందనే సందేహం చాలా మందిలో ఉంది. దీనికి నిపుణులు స్పష్టత ఇస్తున్నారు.
వేసవిలో శరీరం త్వరగా నీరు కోల్పోతుంది. అందుకే శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచేందుకు సహజ పానీయాలు తాగడం చాలా ముఖ్యం. ముఖ్యంగా కొబ్బరి నీళ్లు, చెరకు రసం వేసవిలో ఎక్కువగా తీసుకునే పానీయాలు. కొబ్బరి నీళ్ళు ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన, అత్యంత సహజమైన పానీయం. దీని అతి ముఖ్యమైన లక్షణం ఏమిటంటే ఇందులో ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. ఇంకా, ఇందులో పొటాషియం, మెగ్నీషియం, సోడియం వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన శరీరాన్ని కాపాడుతాయి. కొబ్బరి నీళ్లు సహజ ఎలక్ట్రోలైట్ డ్రింక్‌గా పరిగణిస్తారు. రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అదే విధంగా చెరకు రసం సహజ శక్తిని ఇచ్చే పానీయం. ఇందులో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ వంటి సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి శరీరానికి వెంటనే శక్తిని అందిస్తాయి. చెరకు రసం తాగడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. అలసట తగ్గుతుంది. కొన్ని ఖనిజాలు, విటమిన్లు లభిస్తాయి. అయితే చెరకు రసంలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మధుమేహం ఉన్నవారు జాగ్రత్తగా తీసుకోవాలి.

వేసవిలో జాగ్రత్తలు అవసరం
చెరకు రసం తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. వేసవిలో చెరకు రసంలో ఐస్ క్యూబ్స్ కలిపి తాగడం ఒక ప్రత్యేకమైన ఆనందం. చెరకు రసంలో సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి తక్షణ శక్తిని అందించడంలో సహాయపడతాయి. ఆయుర్వేదంలో, కామెర్లు వంటి వ్యాధులకు చెరకు రసం చాలా ప్రయోజనకరం. ఇందులో ఎముకలు, రక్తానికి మేలు చేసే కాల్షియం, ఇనుము వంటి ముఖ్యమైన అంశాలు కూడా ఉన్నాయి. కాగా, ఈ రెండు తీసుకునే సమయంలో శరీరంలో అప్పటికే ఉన్న సమస్యలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని. శరీరం లో హైడ్రేషన్, ఆరోగ్యం, తేలికైన జీర్ణక్రియ కోసం చూస్తే కొబ్బరి నీళ్ళు మేలు చేస్తాయి. ఇది తక్కువ చక్కెర, తక్కువ కేలరీలు కలిగి ఉంటుంది. వేసవిలో రోజూ హైడ్రేటెడ్‌గా ఉండటానికి కొబ్బరి నీళ్లు ఉత్తమమైన ఎంపిక. చెరకు రసం కూడా మంచిదే కానీ పరిమితంగా, పరిశుభ్రమైన చోట మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
-
Hormuz: హార్ముజ్ కోసం రంగంలోకి 35 దేశాలు-భారత్ కీలక నిర్ణయం..! -
కొబ్బరి నీళ్లు Vs మజ్జిగ - రెండింటిలో వేసవిలో ఏది బెస్ట్..!! -
ఆంజనేయుడి దివ్యమంత్రం -
షుగరు బాధితులు వేసవిలో ఎలాంటి స్నాక్స్ తినాలి..!! -
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్ -
చేపలతో కలిపి తినకూడని ఆహార పదార్థాలు.. -
భారత్ కు మెషిన్ గన్స్ పంపించిన ఇజ్రాయెల్.. పాకిస్థాన్ పని ఖతం.. -
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
పచ్చికారం సొరకాయ కూర.. ఇలా చేస్తే అసలే వదిలిపెట్టరు! -
ఈ ఆకుతో ఒక్క రాత్రిలోనే మీ జుట్టు నల్లగా మారిపోతుంది -
సమ్మర్ స్పెషల్ "అరటిపండు ఆమ్లెట్" ఎలా చేయాలంటే ??? -
"ముల్లంగి మజ్జిగ పులుసు" ఇలా చేస్తే యమా టేస్టు.. -
ఖాళీ కడుపుతో తేనే కలిపిన గోరువెచ్చని నీటిని తీసుకుంటే చాలు -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్











Click it and Unblock the Notifications