astrology: బుధవారంనాడు మర్చిపోయి కూడా ఈ తప్పులు చెయ్యకండి; అలా చేస్తే కొంప కొల్లేరేనట!!
వాస్తు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. బుధవారం బుధ గ్రహానికి సంబంధించిన వారం. ఈ రోజున బుధ గ్రహం మరియు గణేశుడిని పూజించాలని శాస్త్రం చెబుతోంది. ఈ రోజున గణేశుడిని పూజించడం వలన వినాయకుడికి సంతోషం కలుగుతుంది. అలాగే భక్తులకు కోరుకున్న కోరికలు నెరవేరతాయి.

బుధవారం నాడు తప్పులు చేస్తే కుటుంబం మొత్తానికి తిప్పలే
బుధవారం నాడు మనకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తాం, దాని వల్ల మనం చాలా నష్టపోతాం. అందువల్ల, ఈ రోజున మరిచిపోయి కూడా కొన్ని తప్పులను చేయకూడదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. పొరపాటున బుధవారం రోజున కొన్ని తప్పులు చేస్తే కుటుంబం మొత్తం దీని వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తుంది, కొంప కొల్లేరు అవుతుందని సూచిస్తున్నారు. అందుకే బుధవారం నాడు మరిచి కూడా చేయకూడని పనులు ఏంటో తెలుసుకుందాం.

బుధవారం నాడు వారిని అవమానిస్తే కష్టాలు
బుధవారం నాడు, పొరపాటున కూడా నపుంసకుడిని అవమానించకూడదు. ఎవరైనా ట్రాన్స్జెండర్స్ కనిపిస్తే వారిని అవమానించకుండా ఉండాలి. ఇంకా వీలైతే వారికి కావలసిన మేకప్ మొదలైన వస్తువులను ఇవ్వాలి. వారి పట్ల ఆదరణ చూపించాలి. అంతేకాదు బుధవారం రోజు పొరపాటున కూడా ఎవరైనా అమ్మాయిని, లేదా స్త్రీలను అవమానించ కూడదు. స్త్రీలను అవమానిస్తే ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆరోజు మహిళలకు అన్నదానం చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు. బుధవారం రోజు నపుంసకులను, స్త్రీలను అవమానించడం ఆర్థికంగా నష్టం చేస్తుంది.

బుధవారం నాడు తినకూడనివి, కొనకూడనివి ఇవే
కొందరు వ్యక్తులు పాన్ తినడానికి చాలా ఇష్టపడతారు కాని బుధవారం పాన్లు తినకూడదు. బుధవారం రోజు తమలపాకులు నమిలితే అది డబ్బు నష్టాన్ని కలిగిస్తుందని మరియు మీ ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. బుధవారం నాడు కొత్త బూట్లు మరియు బట్టలు కొనకూడదు. అంతేకాదు కొత్త బట్టలు ధరించకూడదు. అలా చేయడం వల్ల మీకు హాని కలుగుతుందని చెబుతున్నారు. అందువల్ల, బుధవారం కొత్త బట్టలు ధరించడం వీలైనంత వరకు మానుకోవాలి.

బుధవారం నాడు డబ్బులు ఇస్తే.. తర్వాత పరిస్థితి ఇలాగే ఉంటుంది
బుధవారం నాడు జుట్టుకు సంబంధించిన ఏ వస్తువును కొనుగోలు చేయవద్దు. టూత్ బ్రష్ మొదలైన వాటిని కూడా ఈ రోజు కొనుగోలు చేయకూడదు. ఇది కాకుండా, బుధవారం నాడు పాలతో తయారు చేసే వంటలను ఇంట్లో తయారు చేయకుండా ఉండటం మంచిదని సూచిస్తున్నారు. అంతేకాదు బుధవారం రోజు ఎవరికీ డబ్బులు ఇవ్వకూడదని, అలా బుధవారం నాడు డబ్బులు ఇస్తే ఆర్థిక సమస్యలకు కారణమవుతుందని, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
జూన్ లో బృహస్పతి దయతో నక్కతోక తొక్కే రాశులు ఇవే! -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
మేష రాశి, వృషభ రాశివారి మే నెల జాతక ఫలం -
వాస్తు అంటే ఏమిటి? ఎన్ని రకాలుంటాయి? ఎందుకు అనుసరించాలి? -
మిథున రాశి, కర్కాటక రాశి మే నెల జాతక ఫలం -
వాస్తు ప్రకారం ఇంట్లో చపాతీలను లెక్కపెట్టి చేస్తే పరమ దరిద్రం -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!!












Click it and Unblock the Notifications