మనకు ఇదా నూతన సంవత్సరం?

Posted By:
Subscribe to Oneindia Telugu

ఋతువుల్లో మార్పు లేదు, ఖగోళంలో ఎటువంటి మార్పులు లేవు, ప్రకృతిలో ఏలాంటి మార్పులు లేవు

ఏ యుగ పురుషుడు/సంఘ సంస్కర్త/ప్రవక్త /శాస్త్ర వేత్త ఎక్కడా జన్మించలేదు.

లోక కంటకుడు ఎవడూ సంహరించబడలేదు,దీపావళి వలె,ఏ రాజు/చక్రవర్తి సింహాసనం అధిరోహించలేదు.ఏ విజయాలు సాధించిన రోజు కూడా కాదు,ఎటువంటి విప్లవాలు ప్రారంభం కాలేదు.
కొత్త పంటలు చేతికి రావు. చెట్లు చిగురించే కాలమూ కాదు. ప్రకృతిలో పచ్చదనమే కనబడదు.

Astrology: Is there ay importance?

ఏ మతపరంగా చూసినా ఎటువంటి ప్రాముఖ్యత లేదు.శాస్తీయపరంగా ఎటువంటి ప్రాధాన్యత లేదు.

ఏ ధర్మ గ్రంథాలలోనూ ఈ రోజుకు ప్రశస్తి లేదు.మరి ఎందుకు జరుపుకోవడం? మనకు ఉగాది రోజుననే ప్రకృతి పరంగా

మార్పు సంభవిస్తుంది,కోత్త చిగుళ్ళు ,పంటలు వస్తాయి కాబట్టి ఉగాదె రోజున నూతన సంవత్సర వేడుకలు చేసుకోవాలి.అసలు ఈ ఇంగ్లీష్ క్యాలేండర్ విధానం ఏమిటో మీరే గమనించండి.

క్రీశ 1582 లో పోప్ గ్రెగేరియన్ సరిచేసిన క్యాలెండర్ ఇది.ఈ క్యాలెండర్ ప్రకారం మనం యదార్థ సంవత్సరం కంటే 24.6 సెకన్ల ఎక్కువ సమయాన్ని లెక్కించుకుంటున్నాము. ఆప్రకారం 3,513. సంవత్సరాలకు ఒక రోజు ఎక్కువ వస్తుంది. ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త JOHN VERSHAL. ఈ లోపాన్ని సవరించటానికి ఒక ఉపాయం చెప్పాడు. అది క్రీశ 4,000 సంవత్సరంను లీప్ ఇయర్ గా లెక్కించకుండా వదిలేయడం.
ఈ క్యాలెండర్ లోని లోపాలను సరిచేయడం అవసరమని సూచనలు చేస్తూ "నానాజాతిసమితి" ఒక కమిటీ ఏర్పాటుచేసింది. ఆ కమిటీ 185 రకాల ప్కాన్లను పరిశీలించి, క్రీశ 1926 లో ఒక రిపోర్టు ఇచ్చింది.

ఇప్పటి దాకా అది ఎటూ తేలలేదు. ఇంకా ఇలాంటి చిన్నచిన్న చిక్కులు చాలానే ఉన్నాయి.
ప్రపంచమంతా పూర్వం నూతన సంవత్సరం ఉగాదినాడు ప్రారంభమయ్యేది. బైబిల్ లోని"ఎజ్రా"పుస్తకం 10:17 వ వచనం సంవత్సరం లోని మొదటి నెల మార్చి - ఏప్రిల్ లో ప్రారంభమౌతుందని సాక్ష్యం పలుకుతోంది. ఫ్రాన్స్‌ లో క్రీశ 1582 వరకూ, ఇంగ్లాండులో క్రీశ 1752 వరకూ నూతన సంవత్సరం మార్చి 25 న ప్రారంభం అయ్యేదని చరిత్ర ద్వార తెలుస్తుంది. అయితే కాలగమనంలో ఇది ఎప్పుడు మారిందో తెలియదు కానీ, అది ఏప్రిల్‌ కు మారింది. అయితే నూతన సంవత్సరం మార్చిలో ఉంచాలా, ఏప్రెల్ లో ఉంచాలా అనేది వారికి కొంత సమస్యగా మారింది.సంవత్సరం ఆరంభం ఎప్పుడూ ఒకే నెలలో ఒకే తేదీన వస్తే బాగుంటుంది అని వారు ఆలోచించసాగారు.

ఆ సమయంలో క్రీశ 15 శతాబ్ది చివరి కాలంలో ఫ్రాన్స్‌ చక్రవర్తి " చార్లెస్ "అంతవరకూ 11 వ నెలగా ఉన్న జనవరిని మొదటి నెలగా నూతన సంవత్సరంగా ప్రారంభించాడు.ఈ విధంగా ప్రస్తుత మన నూతన సంవత్సరం ప్రారంభమైంది.
ఇందుకు ఎలాంటి శాస్త్రీయ, ప్రకృతి పరమైన, ఆధారమూ లేదు. ముందుగా ఫ్రాన్స్‌, ఇటలీ, పోర్చుగీసు, స్పెయిన్ దీనిని అంగీకరించాయి. క్రీశ 1699 లో జర్మనీ, క్రీశ 1752లో ఇంగ్లండు, క్రీశ 1873 లో జపాన్‌, క్రీశ 1912 లో చైనా, క్రీశ 1916 లో బల్గేరియా, క్రీశ 1918 లో రష్యాలు ఈ క్యాలెండర్ ను అంగీకరించాయి. 17,18 శతాబ్దంలో తమ ఆధీనంలో ఉన్న అన్ని దేశాలలో బ్రిటిషువాడు దీన్ని ప్రవేశపెట్టాడు.
కానీ భారతీయ క్యాలెండర్ ఋషులచే తయారుచేయబడింది. ఆర్యభట్టు, భాస్కరాచార్య వంటి మహాన్ శాస్త్రజ్ఞులచే పరిశోధించబడింది.

కొన్నివేల సంవత్సరాల తర్వాత ఏ సంవత్సరం లో ఏ నెలలో ఏ రోజున ఏ గ్రహణం వస్తుందో వారం వర్జ్యము తో సహా చెప్పగలిగేంతగా శోధించబడింది.
ప్రకృతికి అనుగుణంగా, వసంత ఋతువు చైత్రశుద్ధ పాఢ్యమి రోజున ఉగాది ప్రారంభ మవుతుంది. కొన్నిచోట్ల వసంత ఋతువు మేషరాశి లో సూర్యుడు ప్రవేశించటాన్ని ఉగాదిగా చేస్తారు.
ప్రపంచమంతా మొదటి నుండి అనుసరిస్తున్న ఉగాదిని కాదని ఫ్రాన్స్‌ వాడు ఏ ఆధారమూ లేకుండా ప్రతిపాదించిన నూతన సంవత్సరంను ఫాలో అవడం మనకు సరికాదు.మన ఖగోళ మేదావులు మన ప్రకృతిని పరంగా మానవునుకి ఉపయోగపడే విధానాన్ని మనం ఆచరించాలి.భారతీయులకు ఉగాదే మనకు కొత్త సంవత్సరగా వేడుకచేసుకోవాలి .ఋతువులతో ప్రకృతిలో మార్పు వచ్చి కొత్త చిగుళ్ళను,పంటలను,వనమూలికలను అందించే ఉగాదినే మన నూతన సంవత్సరంగా వేడుకలు చేసుకుందాం ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం జై శ్రీమన్నారాయణ.

డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
According to Astrologer January 1st has no importance to celebrate as new year.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి