• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Astrology: వయస్సుతో పాటు.. ఎవరికీ చెప్పకూడని ఐదు ముఖ్యమైన విషయాలు ఇవే!!

|
Google Oneindia TeluguNews

సనాతన ధర్మంలో అనేక పురాణాలు, మనం ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అని అనేక విషయాలను బోధించాయి. మహా పండితుడు అయిన శుక్రాచార్యుడు రాక్షసులకు గురువు గా వ్యవహరించిన విషయం తెలిసిందే. శుక్రాచార్యుడు రాక్షసులను అత్యంత శక్తివంతంగా తీర్చిదిద్దడంలో, దేవతలకు వ్యతిరేకంగా రాక్షసుల పక్షాన నిలిచాడు. ఇక అటువంటి శుక్రాచార్యుడు శుక్ర నీతిలో అనేక విషయాలను వివరించాడు. అందులో ముఖ్యంగా మనం ఇతరులకు చెప్పకుండా దాచి పెట్టవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలను ఆయన బోధించారు. శుక్రాచార్యుడు బోధించిన ముఖ్యమైన అంశాలలో ఐదింటిని ఇప్పుడు మనం తెలుసుకుందాం.

వయసు ఎవరికీ చెప్పకూడదు

వయసు ఎవరికీ చెప్పకూడదు


శుక్రాచార్యుడి నీతి ప్రకారం ఎవరూ, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ వయసు గురించి ఇతరులకు చెప్పకూడదు. ఏ పురుషుడు లేదా స్త్రీ తన వయస్సు గురించి ఏ వ్యక్తితోనూ చర్చించకూడదు. నమ్మకం ప్రకారం, మీరు మీ వయస్సును ఎంత దాచిపెడితే, అది మీకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఎవరికైనా మీ వయస్సు చెబితే, అతను దానిని దుర్వినియోగం చేసి మీ ప్రతిష్టను దిగజార్చవచ్చు అని ఆయన పేర్కొన్నారని కొందరు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు

ఇంటి రహస్యాలు చెప్పకండి

ఇంటి రహస్యాలు చెప్పకండి


అంతేకాదు ఇంటి విషయాలను గుట్టుగా ఉంచాలని కూడా చెబుతున్నారు. ప్రతి ఇంట్లో ఏదో ఒక రహస్యం ఉంటుంది, దానిని ఎవరితోనూ పంచుకోకూడదు. ఆ రహస్య విషయాల గురించి కుటుంబ సభ్యులు తమలో తాము మాట్లాడుకోవాలి తప్ప వాటిని బయట పంచుకుంటే, మీ జీవితం ఇబ్బందుల్లో పడవచ్చు. అది అనేక అనర్థాలకు దారి తీయవచ్చని పేర్కొన్నారు. ఒక్కోసారి ఇంట్లో రహస్యాలు బయట వారికి చెప్పటం వల్ల సమస్యలు మరింత జటిలం అయ్యే ప్రమాదం ఉంది.

మీ ఔషధం గురించి ఎవరికీ చెప్పకండి

మీ ఔషధం గురించి ఎవరికీ చెప్పకండి


శుక్రనీతి ప్రకారం మీరు ఏదైనా వ్యాధికి మందు తీసుకుంటే, మీ మందు గురించి ఎవరికీ చెప్పకూడదు అని చెబుతున్నారు. మీ శత్రువులకు మీ వ్యాధికి మందు తెలిస్తే దీనితో మీకు హాని కలిగించవచ్చు అని చెబుతున్నారు. మీరు మీ ఔషధాన్ని ఎవరికైనా చెప్పినట్లయితే, ఔషధం యొక్క ప్రభావం తగ్గుతుంది అని కూడా చెప్పబడింది.

మీరు చేసిన దానాల గురించి చెప్పకండి

మీరు చేసిన దానాల గురించి చెప్పకండి

ఇక ఇదే సమయంలో మీరు ఏదైనా నిరుపేదలకు లేదా ఏదైనా మతపరమైన సంస్థకు విరాళం ఇచ్చినట్లయితే, దాని గురించి ఎవరికీ చెప్పకూడదు. శుక్రనీతి ప్రకారం మీరు ఇచ్చిన దానం గురించి ఎవరికైనా చెబితే, ఆ దాన ఫలం లభించదు. ఒక వ్యక్తి తన గొప్పతనాన్ని చాటుకోవడానికి దానధర్మం గురించి ప్రస్తావిస్తే, అతని పుణ్యకార్యాలన్నీ నాశనమవుతాయి. ఎవరికైనా దానం చేసేటప్పుడు, పక్కవారికి కూడా తెలియకుండా, ఎటువంటి లాభాపేక్ష లేకుండా దానం చేయాలని సూచిస్తున్నారు.

గురు మంత్రాన్ని ఎవరికీ చెప్పకండి

గురు మంత్రాన్ని ఎవరికీ చెప్పకండి


అంతేకాదు గురువు ఉపదేశించిన మంత్రాన్ని ఎవరికీ చెప్పకుండా ఉండాలని సూచిస్తున్నారు. గురువు శిష్యుడికి అత్యంత పవిత్రమైన విషయంగా చెప్పే విషయాలను, గురువు ఉపదేశాన్ని ఎవరికైనా చెబితే దాని ప్రాముఖ్యత అంతమవుతుందని అందుకే గురు మంత్రాన్ని ఎవరికీ చెప్పకుండా ఉండాలని సూచిస్తున్నారు.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు

English summary
Sukracharya says five important things that should not be told to anyone along with age. Sukraniti is suggested that household secrets, donations , medicines used for diseases, Guru Mantra, should not be told outside.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X