వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రగ్రహణం ఎఫెక్ట్: ఆరోజు ఏం జరుగుతుంది?.. గర్భిణీలు ఏం చేయాలి!

ఈ గ్రహణమును శ్రవణ నక్షత్రము వారును, అధమ ఫలము నిచ్చు రాశుల వారును అసలు చూడరాదు.

|
Google Oneindia TeluguNews

చంద్ర గ్రహణం

ఈ సం|| శ్రావణ శుక్ల పూర్ణిమా సోమవారము 07-08-2017 నాడు శ్రవణా నక్షత్రములో మకరరాశిలో చూడామణి నామక అర్గలగ్రాస కేతుగ్రస్త చంద్రగ్రహణం సంభవించును. ఈ గ్రహణమున పుణ్యము అధికముగా వచ్చును.

స్పర్శ కాలం రాత్రి10: 52 మధ్యకాలం

మధ్యకాలం రాత్రి 11: 50
మోక్ష కాలం రాత్రి 12:49

మొత్తం పుణ్యకాలం గం. 01:57 నిమిషాలు

నిత్య భోజన ప్రత్యాబ్దికాది నిర్ణయము
సూర్యగ్రహే తు నాశ్నీయా త్పూర్వం యామ చతుష్టయమ్ |
చన్దగ్రహే తు యామాంఫ్రీన్ బాల వృద్ధాతురాన్వినా !

August 2017 Chandra Grahan Effects On Zodiac Signs

ఇది రాత్రి ద్వితీయ యామమన ఆరంభమగుచున్నది. కనుక నిత్య భోజన, ఆబ్దికాదులను పగలు ద్వితీయ యామము లోగానే (అనగా పగలు 12.20 లోగానే) జరుపుకొనవలెను.

అశక్తులు (అనగా చిన్నపిల్లలు = వృదులు - వ్యాధితులు - గర్భిణులు) మాత్రము గ్రహణారంభ యామము నుండి సార్ధయామ కాలమును విడచి - అనగా ఈనాడు సా. 5.00 లోగా ఆహారాదులను స్వీకరించవచ్చును.
గ్రహణ మోక్షము అర్ధరాత్రి తరువాత గనుక సమర్తులు మోక్ష స్నానానంతరము కూడా ఈనాడు ఆహారాదులను స్వీకరించరాదు.

గ్రహణ గోచారము

ఈ గ్రహణమును శ్రవణ నక్షత్రము వారును, అధమ ఫలము నిచ్చు రాశుల వారును అసలు చూడరాదు.
శుభ ఫలము : మేష, సింహ, వృశ్చిక, మీన రాశులవారలకు
మధ్యమఫలము : వృషభ, కర్కాటక, కన్య, ధనూ రాశులవారలకు
అధమ ఫలము : మిథున, తుల, మకర, కుంభ రాశులవారలకు

Recommended Video

Aadayam

గ్రహణ సమయంలో జాగ్రత్తలు

వాతావరణంలో అనేక మార్పులు జరుగుతాయి. అందుకని గర్భిణీస్త్రీలపైఆ కిరణాలు
పడకుండా ఉంటే మంచిదని శాస్రాలలో చెప్పడం జరిగింది.దాని వల్ల గర్భస్థ శిశువుకు కురూపిగానో, అంగవైక్యలంతోనో పుటతీరిడంజరుగుతుంది. కాని సృష్టితీరులో ప్రతిచర్యకు ప్రతిచర్యకు ఉంటుంది.

ఏది జరిగినాదాని ప్రభావం ఏదో ఒకరూపంలో వెల్లడి అవుతుంది. ఆ కారణంగా సాధారణంగా మంత్ర సాధకులు నిత్యపూజాది కార్యక్రమాలు దేవాలయాలు మూసిశాంత్యోపచరాలు చేసుకోవలసినదని జపతపాదులు చేసుకొమ్మని, సముద్రపు ఆటు పోటులు జాగ్రత్తగా పరిశీలించుకొమ్మని చెప్పడం జరిగింది.

ముఖ్యంగాగర్భిణీ స్త్రీలు వీటి ప్రభావం ఎక్కువై శరీరములో అధిక వేదనలు పడతాయనిదానికోసమే గ్రహణములు చూడరాదని కాస్మోటిక్ రేడియేషన్ తగలకుండా ఉంటుందని శాస్త్రజ్ఞలు పరిశోధన ఫలితాలు తెలియచేస్తున్నాయి.

ఇంటిలో

గ్రహణం పడుతున్నదని తెలిసినప్పడు ముందుగా దర్భలు ఇంటిలో వేసితరువాత పచ్చళ్ళమీద, ఆహారపద్ధారాల మీద దర్భలను వేయవలయును. సాధారణంగా గ్రహణానికి రెండుగంటల ముందే భోజనము పూర్తి చేయవలెను. గ్రహణం పట్టు, తర్వాత స్నానము, విడుపుస్నానము చెయ్యవలెను.

ఆసమయంలో మంత్ర పునరశ్చరణ చేయుటవలన అధిక ఫలితముల నొసగుననిశాస్త వచనము. భూమి ఎన్నో మార్పులకు లోనౌతుంది. ఎప్పడైనా మార్పులువస్తే దానికి అనుగుణంగా మన శరీరంలోను మన జీవన విధానంలోనుమార్పులు చేసుకోవాలి. అప్పడే ఆరోగ్యం బాగుంటుంది .

సూర్య, చంద్రులు ఆరోగ్యకారకులు అన్నది ఆరోగ్య జ్యోతిషసూక్తిగా చెప్పకోవాలి. గ్రహణసమయాలలో మనం వాటి కనుగుణంగా మార్పులు చేసుకుని మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి.

దర్భలతో శుద్ధి ఎలా జరుగును

గ్రహణ సమయంలో దర్భలను ఆహారపదార్థలపైనే వేయవలసిన అవసరం
ఉన్నది. దర్భలు గరిక జాతిలో సన్నటి ఆకులు. వాటి చివళ్ళ చాలా పదునుగా సూదంటు గా ఉంటాయి. దర్భలను పుష్యమి నక్షత్ర యుక్త ఆదివారం నాడుకొయ్యాలి.

ఆ విధంగా చేసినటైతే ఆ దర్భలు రేడియేషన్ను తొలగిస్తాయి. గ్రహణ సమయాలలో ఉత్పత్తిఅయ్యే ఫలితాన్ని అల్త్రావైలెట్ కిరణాల ప్రభావాన్నిఅవి నిరోధిస్తాయి. ఆ కారణంగా నీటిలో గాని పచ్చళ్ళపైగాని వేసినటైతేఅవి బూజు పటతీరికుండా ఉంటాయని ఎన్విరాన్మెంట్ బయాలజీ విభాగంవారు పరిశోధించి తెలిపిన విషయం.

అందువల్ల దర్భలను పచ్చళ్ళవీుదనీళ్ళలో దర్భలను వేస్తారు. గ్రహణ సమయంలో ఆహారం తీసుకుంటే ఆహారంజీర్ణం కాదు. వాతావరణ మార్పులే దీనికి కారణం.

English summary
The kind of lunar eclipse that we shall witness on 7-8 August 2017 is described astronomically as penumbral lunar eclipse. This graham shall commence during the midnight hours on 7 August 2017 and shall last till the early morning hours on 8 August 2017.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X