వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ధారణ ఎలా: ఎనిమిది ముఖాల రుద్రాక్ష

ఎనిమిది ముఖాల, తొమ్మిది ముఖాల రుద్రాక్షను మనం ఎలా ధరించాలి, ఎందుకు ధరించాలనే విషయాలను జ్యోతిష్కుడు వివరించారు

By Pratap
|
Google Oneindia TeluguNews

అష్టమాతలు అష్టవసులు, గంగాదేవి రూపముగా భావిస్తారు ముందుగా ఆవుపాలతో శుద్ధిచేసి శివాలయంలో రుద్రాభిషేకం చేసి ధరించవలెను వీలయినచో కాశీగంగ తీర్ధముతో శుద్ధి చేసిన శ్రేష్టం. సాధారణముగా ఆదివారము రాహుకాలములో ధరించవలెను

ముఖ్యముగా వినాయకచవితి పర్వదినమునందు ధరించిన పూజించిన చాలా మంచిది ఈ మాలధారణ సమయమున రుదాక్షమంత్రమును 11మార్లు ధ్యానించ వలెను దీనిని ధరిస్తే సత్యదేవత ప్రసన్నురాలవుతుంది. నీచస్త్రీని, మరియు గురుపత్నిని తాకిన కల్లేపాపము తొలగిపోతుంది. అన్ని పాపాలను తొలగిస్తుంది.

దీనిని ధరించివారు గొప్ప నమ్మకముతో తనకు దారిలో ఎదురగు అడ్డంకులు తొలగించుకొని ముందుకు సాగుదురు
ఈమాలను ధరించువారికి వినాయకుని అనుగ్రహము లభించును ఈమాలను ధరించువాడు ప్రత్యేకత సంతరించుకొని చదువులలో (విద్య) అద్భుతమైనప్రగతి సాధించును. ఈ మాలధారణ ముఖ్యముగా పూజలలో వాడెదరు. దీనివలన దీర్ఘకాలిక జీవితము మరియు సత్యసంధత కలుగును

Eight faced Rudraksaha to be weared

తొమ్మిది ముఖాల రుద్రాక్ష

భైరవుడు మరియు యమధర్మరాజుకి ప్రతీక దీనిని ధరిస్తే యముని వల్ల భయం ఉండదు. ముందుగా ఆవుపాలతో శుద్ధిచేసి శివాలయంలో రుద్రాభిషేకం చేసి ధరించవలెను.

సాధారణముగా శుక్రవారం ఉదయాము 6గంII నుండి 7గం|| లోపుగా ధరించిన చాలా మంచిది. నవరాత్రులలో దుర్గాదేవి పూజలో వుంచి ధరించిన చాలా మంచిది. ఈ మాలధారణ ముఖముగా నవరాత్రి పర్వదినములలో దుర్గాదేవి అనుగ్రహము లభిస్తుంది. ఈ మాలధారణ చేయనప్పడు రుద్రాక్షమంత్రమును 11మార్లు జపించవలెను.

ఈ మాలధారణ వలన ఇంద్రుని అనుగ్రహము పొంది రాజపదవి పొందును అంతేగాక గణేశుని అనుగ్రహము కలుగును.
ఈ మాలధారణ వలన యమధర్మరాజు అనుగ్రహము. కపిలమహర్షి అనుగ్రహము పొందును - దీనిని కుడిభుజానికి ధరిస్తే బలము లబిస్తుంది. శిశుహత్యల నుండి విముక్తికై దీనిని ధరిస్తారు.

దీని ధారణ వలన మంచి వాక్ధాటితో ఎదుటివారికి ఒప్పించగల నేర్పరితనము తనకు వచ్చిన ఆలోచనలు అన్నియు క్రియా రూపములో వుంచును ప్రతి పనిలో ఆటంకము లేకుండా జరగాలి అని కోరుకున్నవారు ఈ రుద్రాక్ష ధరించాలి.

English summary
Astrologer described why, how we have to wear eight faced Rudraksha and nine faced Rudraksha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X