వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నవరాత్రుల ప్రత్యేకం: దుర్గామాత సృష్టికి ఆదిశక్తి ఎందుకు?

|
Google Oneindia TeluguNews

దుర్గామాత యొక్క నాల్గవ స్వరూప నామము కుష్మాండ.

సురాసంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ దధానా
హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే
దరహాసము చేయుచు (అవలీలగా) బ్రహ్మాండమును సృజించునది గావున ఈ దేవి కూష్మాండ అను పేరుతో విఖ్యాతయయ్యెను.

ఈ జగత్సృష్టి జరుగకముందు అంతటను గాడాంధకారమే అలముకొని యుండెను. అప్పుడు ఈ దేవి తన దరహాస మాత్రమున ఈ బ్రహ్మాండమును సృజించెను. కావున ఈమెయే సృష్టికి ఆదిశక్తి,. ఈ సృష్టి రచనకు పూర్వము బ్రహ్మాండమునకు అస్తిత్వమే లేదు.

Goddess Durga: Navarathri special

ఈమె సూర్యమండలాంతర్వర్తిని, సూర్యమండలమున నివసింపగల శక్తిసామర్థ్యములు ఈమెకే గలవు. ఈమె శరీరకాంతిచ్ఛటలు సూర్యకిరణ ప్రభలవలె దేదీప్యమానముగా వెలుగొందుచుండును. ఈమె తేజస్సు నిరుపమానము. దానికి అదియే సాటి. ఇతర దేవతలెవ్వరును ఈమె తేజప్రభావములతో తులతూగజాలరు. ఈమె యొక్క తేజోమండల ప్రభావముననే దశదిశలు వెలుగొందుచున్నవి. బ్రహ్మాండమునందలి సకల వస్తువులతో, ప్రాణులలోగల తేజస్సు ఈమె ఛాయయే.

ఈమె ఎనిమిది భుజములతో విరాజిల్లుచుండును. అందువలన ఈమె అష్టభుజాదేవి అను పేరుతో గూడ వాసిగాంచినది ఈమె ఏడుచేతులలో వరుసగా కమండలువు, ధనస్సు, బాణము, కమలము, అమృతకలశము, చక్రము, గధ అనునవి తేజరిల్లుచుండును. ఎనిమిదవ చేతిలో సర్వసిద్ధులను, నిధులను ప్రసాదించు జపమాల యుండును. ఈమెయు సింహవాహనయే. సంస్కృతమునందు కూష్మాండము అనగా గుమ్మడికాయ. కూష్మాండబలి ఈమెకు అత్యంత ప్రీతికరము. అందువలనను ఈమె కూష్మాండ అని పిలువబడును.

మనుష్యుడు సహజముగా భవసాగరమును తరించుటకు ఈ తల్లి యొక్క ఉపాసన మిక్కిలి సులభమైన, శ్రేయస్కరమైన మార్గము. మనుష్యుడు ఆధివ్యాధులనుండి సర్వధా విముక్తుడగుటకును, సుఖసమృద్ధిని, ఉన్నతిని పొందుటకును కూష్మాండా దేవిని ఉపాసించుటయే రాజమార్గము. కనుక లౌకిక, పారలౌకిక ఉన్నతిని కాంక్షించువారు ఈమె ఉపాసనయందే సర్వదా తత్పరులైయుండవలెను.

English summary
Navarathri Special article.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X