కావేరీ నది పుష్కరాలు: పురాణ గాథ, అనుగ్రహం కోసం చేయాల్సినవి..

Subscribe to Oneindia Telugu

12/09/2017 నుండి 23/09/2017 వరకు కావేరీ నది పుష్కరాలు

గంగానది తర్వాత అంతటి పవిత్రమైనదిగా భావించే నది కావేరి. అందుకే కావేరిని దక్షిణ గంగ అని పిలుస్తారు. దేవగురువైన బృహస్పతి తులారాశిలో ప్రవేశించడంతో కావేరీనదికి పుష్కరాలు ప్రారంభం అవుతాయి. బృహస్పతి ఈ సెప్టెంబర్‌ 12న కన్యారాశి నుంచి తులారాశిలో కాలు పెడుతున్నాడు.

23 వరకు అక్కడే ఉంటాడు కాబట్టి ఈ 12 రోజులూ ఆ నది పుష్కర శోభను సంతరించుకుంటుంది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ప్రజలు కావేరీ పుష్కరాలలో పుణ్యస్నానాలు చేసి పునీతులవుతారు. నర్మదా నదీతీరంలో తపస్సు, కురుక్షేత్రంలో దానం, కాశీక్షేత్రంలో మరణించడం వల్ల కలిగే ఫలం కేవలం పుష్కర స్నానం వల్ల కలుగుతుందని పురాణోక్తి.

ఎక్కడ పుట్టింది?

పూర్వం బ్రహ్మగిరి పర్వత ప్రాంతంలో కావేరుడనే రాజు ఉండేవాడు. ఆయనకు పిల్లలు లేకపోవడంతో బ్రహ్మని గురించి తపస్సు చేశాడు. బ్రహ్మ ఆయన తపస్సుకు మెచ్చి, ఓ అందాల పాపను ప్రసాదించాడు. కావేరి అని పేరు పెట్టుకుని రాజు ఆ బిడ్డను అల్లారుముద్దుగా పెంచుకున్నాడు.
యుక్తవయసు రాగానే ఆమెను అగస్త్య మహర్షికి ఇచ్చి పెళ్లి చేశాడు. వివాహ సమయంలో తనను ఎప్పుడూ ఒంటరిగా విడిచిపెట్టకూడదని అగస్త్యుని కోరింది కావేరి. అంగీకరించాముని.

kaveri pushkaralu in karnataka, tamilnadu

అగస్త్యుడు ఓ రోజున తన శిష్యులకు తత్త్వశాస్త్ర రహస్యాలను బోధించడం కోసం శిష్యులను దూరంగా తీసుకెళ్లి పాఠాలు చెబుతున్నాడు. భర్త తనను విడిచి వెళ్లడంతో కావేరి కోపంతో ఒక తటాకంలో దూకింది. అయితే, ఆమె బ్రహ్మవర ప్రసాదిని కావడంతో మరణించడానికి బదులు నదిగా మారిపోయి బ్రహ్మగిరి పర్వతాల మీదుగా ప్రవహిస్తూ వెళ్లింది.

ఆమె కావేరీ నదిగా ప్రసిద్ధికెక్కింది.మరో కథ ఏమిటంటే, తనని విడిచి ఉండరాదన్న భార్య కోరికను మన్నించి అగస్త్యుడు ఆమెను జలరూపంలోకి మార్చి తన కమండలంలో ఉంచుకుని ఎల్లప్పుడూ తనవద్దే ఉంచుకునేవాడు. అయితే, ఒకసారి ఈ ప్రాంతంలో బ్రహ్మాండమైన క్షామం వచ్చింది. వర్షాలు లేక జలాశయాలన్నీ ఎండిపోయాయి.

పంటలు పండక ప్రజలు అల్లాడుతూ, విఘ్నేశ్వరుని ప్రార్థించారు.

వినాయకుడు ఆవు రూపంలో అగస్త్యుని వద్దకు వచ్చి, గడ్డిమేస్తున్నట్లు నటిస్తూ, కమండలాన్ని తన ముట్టెతో కింద పడేలా చేశాడు. దాంతో కావేరి కాస్తా నదీరూపాన్ని సంతరించుకుని, అక్కడినుంచి తన పుట్టినిల్లైన బ్రహ్మగిరి వరకూ ప్రవహించింది.

దాంతో ఆయా ప్రదేశాలన్నీ ససస్యశ్యామలమయ్యాయి.కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో ఉన్న కొడగు జిల్లాలోని తలాకావేరి అనే ప్రదేశంలో పుట్టిన కావేరి తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో ప్రవహిస్తుంది. హేమవతి, పింషా, అర్కవతి, కుంబిని, భవాని, నొయ్యల్, అమరావతి నదులు కావేరికి ఉపనదులు.
తలకావేరి, కుషల్‌ నగర్, శ్రీరంగపట్టణ, భవాని, ఈరోడ్, నమ్మక్కళ్, తిరుచిరాపల్లి, కుంభకోణం, మాయావరం, పుంపుహార్‌ నగరాల గుండా ప్రవహిస్తుంది.

చందనపు అడవులకు, ప్రకృతి సౌందర్యానికీ పెట్టింది పేరైన కూర్గ్‌ కావేరీనది వరప్రసాదమే. బెంగళూరు పులి టిప్పుసుల్తాన్‌ రాజధాని శ్రీరంగపట్టణం కావేరీ నది ఒడ్డునే ఉంది. తమిళనాడులోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన శ్రీరంగం, కుంభకోణం, అందాలకు నెలవైన బృందావన్‌ గార్డెన్స్‌... కావేరీనది ఒడ్డునే ఉన్నాయి.

పుణ్యతీర్థాలు

చెన్నకేశవ స్వామి ఆలయం: హొయసాల రాజుల కాలానికి చెందిన ఈ ఆలయ నిర్మాణం, శిల్పచాతుర్యం అపురూపం, అనితర సాధ్యం. మూడవ నరసింహ వర్మ నిర్మించిన ఈ ఆలయం కావేరీ పుష్కరస్నాన భక్తులకు అవశ్య సందర్శనీయం. భగందేశ్వర ఆలయం: కర్ణాటకలోని భగమండలంలోగల ఈ ఆలయం భగంద మహర్షి పేరు మీదుగా నెలకొన్నది.

భగమండలంలోగల త్రివేణీ సంగమంలో స్నానం చేయడం అత్యంత పుణ్యప్రదమని భక్తుల విశ్వాసం.
విశ్వేశ్వరాలయం, కర్ణాటక: 8వ శతాబ్దంలో చాళుక్యల శిల్పకళారీతిలో నిర్మించిన ఈ ఆలయం అత్యంత పురాతనమైనది. కావేరీ పుష్కరఘాట్లలో ఇది తలమానికమైనది. శ్రీరంగపట్నంలోని శ్రీరంగనాథస్వామి ఆలయం, సోమనాథపురలోని వేణుగోపాలస్వామి ఆలయం, గంజాంలోని నిమిషాంబాలయం కూడా తప్పక చూడదగ్గవి.

పుష్కర స్నాన విధి

ముందుగా పుష్కర నదికి ప్రార్థన చేసి తీరంలో ఉండి మట్టిని మూడుసార్లు నీటిలో వేసి తరువాత సంకల్ప సహితంగా పుష్కర స్నానం చేయాలి. పితృదేవతలకు తర్పణం, తీర్థోపవాసం చేయాలి. మృత్తికా స్నానం, పుష్కర స్నానం చేసి ముక్కోటి దేవతలకు, మునులకు తర్పణ విడవాలి. మళ్లీ ప్రవాహానికి అభిముఖంగా స్నానం చేయాలి.

దీర్ఘాయువునిచ్చే నదీపూజలు:

పుష్కర యాత్రలు చేసిన వారికి, నదీ పూజలు నిర్వహించిన వారివి వ్యాధులు, పాపాలూ తొలగి,పొతాయి.
కావేరి పుష్కరాలు మైసూరు దగ్గర శ్రీ రంగపట్టణం లో అన్నశ్రార్ధం, హిరణ్య శ్రార్ధం, భోజన సదుపాయాలు వివరాలు కొరకు సంప్రదించ గలరు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Kaveri Pushkaram is a festival of River Kaveri that normally occurs once in 12 years. This Pushkaram is observed for a period of 13 days from the time of entry of Jupiter into Tula rasi (Libra)

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి