30 సంవత్సరాల తర్వాత 2026లో ఈ రాశులవారికి లాటరీ తగులుతుంది!
వేద జ్యోతిష్య శాస్త్రంలో శని, సూర్యులను తండ్రి కొడుకులుగా పరిగణిస్తారు. సూర్యుడు గౌరవం, ప్రతిష్ట మరియు ఆత్మవిశ్వాసానికి కారకుడిగా, శనిని కర్మ, న్యాయం, శ్రమకు అధిపతిగా చెబుతారు. 2026 ప్రారంభంలో శని సూర్యుల మధ్య సంయోగం జరుగుతుంది. ఈ సంయోగం 30 సంవత్సరాల తర్వాత మీనరాశిలో జరుగుతుంది.
శని సూర్యుల సంయోగం
ఇది కొన్ని రాశులకు మంచి రోజులను తీసుకొస్తుంది. కొత్త ఉద్యోగంతో పాటు, అపారమైన సంపదలను తీసుకువస్తుంది. శని సూర్యుల సంయోగంతో వీరు అనుకున్న పనులు పూర్తి చేస్తారు. మరి తండ్రీ కొడుకులైన సూర్య శని గ్రహాల కలయిక కారణంగా లబ్ధిని పొందే ఆ రాశుల గురించి తెలుసుకుందాం.

వృషభ రాశి
శని సూర్యుల సంయోగం వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో వృషభ రాశి జాతకులు ఏ పని చేసినా కలిసి వస్తుంది. వృషభ రాశిలో 11వ ఇంట్లో శని సూర్య సంయోగం జరుగుతుంది. దీనివల్ల మీకు నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి పెట్టుబడుల నుండి ప్రయోజనాలను పొందుతారు మీ పని ప్రశంసించబడుతుంది. మద్దతు లభిస్తుంది. కొత్త వ్యాపార ఒప్పందాలను చేసుకుంటారు. విదేశాలలో పనిచేసే వారు గణనీయమైన లాభాలను పొందుతారు.
మిధున రాశి
30 సంవత్సరాల తర్వాత శని సూర్యుల సంయోగం కారణంగా మిధున రాశి జాతకులు శుభ ఫలితాలను పొందుతున్నారు. మిధున రాశిలో పదవ ఇంట్లో సూర్య శని సంయోగం జరుగుతున్న కారణంగా ఈ కలయిక సానుకూల ప్రయోజనాలను ఇస్తుంది. ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. డబ్బు సంపాదించడానికి అనేక అవకాశాలు కనిపిస్తాయి. కళలు, విద్య, వినోదం, మార్కెటింగ్ రంగాలలో ఉన్నవారు సానుకూల ఫలితాలను చూస్తారు. వ్యాపారం చేసేవారికి లాభాలు వస్తాయి.
మీన రాశి
శని సూర్యుల సంయోగం మీనరాశి జాతకులకు 2026లో కలిసి వచ్చేలా చేస్తుంది. ఈ సంయోగం ఈ రాశిలో లగ్న గృహంలో జరగడం వల్ల మీన రాశి వారు ఈ సమయంలో ప్రజాదరణ పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు చూస్తారు. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు వస్తాయి. మీన రాశి వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. అనుకున్న ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. భాగస్వామ్య వ్యాపారాల నుండి ప్రయోజనాలు పొందుతారు.
disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు మరియు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
today rashiphalalu: శ్రీరామనవమి నాడు వీరికి నవవిధ శుభాలు ప్రసాదించిన అద్భుత యోగాలు -
today rashiphalalu:మీనరాశిలో ఆ గ్రహాల కూటమి.. మీకే సంపదల వెల్లువ! -
జన్మ నక్షత్రం రోహిణి, మృగశిర, ఆరుద్ర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
వాస్తు ప్రకారం ఇంట్లో డస్ట్‌బిన్ ఎక్కడ పెడుతున్నారు? -
100ఏళ్ల తర్వాత శని మంగళ యుతి.. ఏప్రిల్ లో ఈ రాశులకు డబ్బే డబ్బు! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications