వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంతోషంగా ఉండాలంటే వీటిని వదలండి..!

|
Google Oneindia TeluguNews

డా. యం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

కొన్ని చిట్కాలు పాటిస్తే మనలో నకారాత్మకత ( negativity)ని "హుష్ కాకీ" అంటూ పార ద్రోలవచ్చును, మనం సంతోషంగా ఉండాలని అనుకుంటే...

1) మనకు ఇమడనివి, సూటవని విషయాల్ని పట్టించుకోకుండా వదిలేయడం ఉత్తమం ( ఉదాసీనంగా ఉండటం ).

2) కష్టమైన పనే ఐనా మనల్ని చిన్నబుచ్చే వారినీ ( hurt)చే సే వారినీ కూడా హృదయానికి తీసుకోకుండా ఇగ్నోర్ ( ignore)చేసేయడమే ఉత్తమం.

One need to follow the tips if he or she wants to lead a happy life.

3. ఏ సన్నివేశాన్నైనా ... నిరాశ, నిస్పృహ, వ్యధా కారిగా (disgusting)గా మారేందుకు... తావివ్వ కుండా ఆలోచన స్థాయిలోనే మొగ్గగానే త్రుంచి వేయడం ఉత్తమం. ఆలస్యమైన క్రొద్దీ ఆ నెగటివ్ థాట్ మనల్ని పూర్తిగా ఆవరించి... ఏమీ చేయనివ్వని స్థితి లోకి నెట్టి కృంగి పోయేలా చేసే ప్రమాద ముంది.

4. ఆత్మ స్తుతిలాగే తనని తాను తగ్గించుకొనటం (worthless) గా ఫీల్ అవరాదు! అలా తరచూ చేయకుండా మానుకొనటం ఉత్తమం. తానెందుకూ కొరగాని వాడినన్న న్యునతా భావం (inferiority complex)ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. సంతోషాన్ని హరిస్తుంది కూడాను.

5. ప్రతీ విషయాన్ని personal గా తీసుకోవటం మానెయ్యాలి. అన్నీ మన యిష్టాయిష్టాల ననుసరించి జరుగవని ఎంత త్వరగా గుర్తిస్తే, అంత త్వరగా మన సంతోషాన్ని పదిలపర్చుకో గల్గుతాం.

6. గతించిన కాలంలోని చేదు అనుభవాలను, జ్ఞాపకాలను పదే పదే గుర్తుచేసుకోవటం... తిరిగి ఆ క్షణాల్లో జీవించడం కూడా వర్తమానాన్ని కోల్పోవడమే! ఆ అనుభవాల సారాన్ని మాత్రం గ్రహించి, జ్ఞాపకాలను చెఱకు పిప్పికి మల్లే మన లోంచి వదిలేయటం కూడా ఈ క్షణాన్ని ఆస్వాదిస్తూ సంతోషాన్ని నింపుకొనేందుకు దోహదం అవుతుంది.

7) ఇతరులు చేసే పనిలో, ప్రవర్తనలో నీ మనస్సుకు ఏది ఇష్టం లేదో, ఏదైతే నీకు బాధ కలిగిస్తుందో అది నీవు ఇతరులకు చేయకుండా ఉండగలగాలి.

8) ఎదుటి వారిపై ఈర్ష్య / శోకించడం కూడా ఒకరకమైన సోమరితనమే. తక్షణ కర్తవ్యయం పూర్తి చేస్తేనే తదుపరి కర్తవ్యయం ఏమిటో స్పష్టంగా తెలిసిపోతుంది.

9) మనిషి మనిషీగా ప్రవర్తించగలిగితే దేవుడు అవుతాడు, తానే దేవుడను అనుకుంటే మాత్రం తప్పక పతనమవుతాడు. విధి ఆడే వింత నాటకంలో మనిషి పాత్రదారుడే కానీ సూత్రదారికాడు, కాలేడు.

English summary
One need to follow the tips if he or she wants to lead a happy life.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X