Vastu tips: ఇతరులకు సంబంధించిన ఈ వస్తువులు వాడుతున్నారా? మీకు బ్యాడ్ టైమ్ మొదలైనట్టే!!
వాస్తు శాస్త్రం ప్రకారం ఇతరులకు ఇవ్వకూడదని వస్తువులు ఏవిధంగా అయితే ఉంటాయో, అలాగే ఇతరుల నుంచి తీసుకోకూడని వస్తువులు కూడా ఉంటాయి. అయితే ఇతరులు ఉపయోగించిన వస్తువులను మనం ఉపయోగించటం మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని వస్తువులు అయితే అస్సలు తీసుకోకూడదని, కొన్ని వస్తువులను ఉపయోగించడం అశుభం అని చెబుతున్నారు.

ఇతరుల బట్టలు వాడుతున్నారా?
ఇక వాస్తు శాస్త్రం ప్రకారం ఇతరుల వద్ద నుండి తీసుకోకూడని వస్తువుల విషయానికి వస్తే, ఇతరుల వద్ద నుండి బట్టలు ఎప్పుడు తీసుకోకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. బట్టలను చాలామంది ఇతరులతో, స్నేహితులతో, కుటుంబ సభ్యులతో కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు. కానీ అలా చేయడం మానుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇతరుల దుస్తులు ధరించడం ఏమాత్రం మంచిది కాదని సూచిస్తున్నారు. అలా చేస్తే అనర్ధాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

ఇతరుల ఉంగరాలు పెట్టుకుంటున్నారా?
ఇక వాస్తు శాస్త్రం ప్రకారం ఇతరుల వద్ద నుండి తీసుకోకూడని మరొక వస్తువు ఉంగరం. వాస్తు శాస్త్రం ప్రకారం ఒకరి ఉంగరాన్ని మరొకరు ఎప్పుడూ ధరించకూడదు. అది ఏదైనా రత్నమైనా, లోహమైనా వేరే వారి ఉంగరం ధరించడం ఏ మాత్రం మంచిది కాదని చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మరొకరి ఉంగరాన్ని ధరించడం వల్ల వ్యక్తి జీవితంపై గ్రహాల వ్యతిరేక ప్రభావం ఉంటుందని చెబుతున్నారు.

ఇతరుల వద్ద నుండి పెన్ను, పెన్సిల్ తీసుకొని వాడుకుంటున్నారా?
ఇక వాస్తు శాస్త్రం ప్రకారం ఇతరుల వద్ద నుండి తీసుకోకూడని మరొక వస్తువు పెన్ను లేదా పెన్సిల్. చాలామంది తమకు అవసరమైనప్పుడు పెన్ లేదా పెన్సిల్ ఇతరులనుండి తీసుకుంటూ ఉంటారు. అయితే ఇది ఏ మాత్రం శ్రేయస్కరం కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని అంటున్నారు. అందుకే ఎవరి దగ్గర నుంచి అయినా పెన్ను, పెన్సిల్ తీసుకుంటే తిరిగి వారికి మళ్లీ వెంటనే ఇచ్చేయాలని సూచిస్తున్నారు.

ఇతరుల వాచీలు పెట్టుకుంటున్నారా?
ఇక వాస్తు శాస్త్రం ప్రకారం ఇతరుల వద్ద నుండి తీసుకోకూడదని మరొక వస్తువు గడియారం. వాచి ఇతరుల వద్ద నుండి తీసుకుంటే కచ్చితంగా అది ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది. టైం బ్యాడ్ వున్నవారు వాచ్ లు మీరు ధరిస్తే, అది మీ జీవితం పైన ప్రభావం చూపే అవకాశం ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

ఇతరుల చెప్పులు వేసుకుంటున్నారా?
ఇక వాస్తు శాస్త్రం ప్రకారం ఇతరుల వద్ద నుండి తీసుకోకూడనివి బూట్లు లేదా చెప్పులు. ఇతరుల బూట్లు లేదా చెప్పులు ధరించడం వల్ల ఖచ్చితంగా ఇంట్లో పేదరికం వస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇతరుల చెప్పులు ధరిస్తే, ఖచ్చితంగా వారి శని మనకు పడుతుందని చెబుతున్నారు. అందుకే పొరపాటున కూడా ఎప్పుడూ ఇతరుల చెప్పులు లేదా బూట్లు వేసుకోకూడదని సూచిస్తున్నారు.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
జన్మ నక్షత్రం పుబ్బ, ఉత్తర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: ఆర్థికంగా లాభాలున్నాయి, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి -
వాస్తు ప్రకారం ఇంట్లో క్యాలెండర్ ఎక్కడ ఉండాలి? -
ముఖ్యమైన వాస్తు చిట్కా: బీరువాలో డబ్బుకు ఎదురుగా అద్దం పెట్టండి -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..!












Click it and Unblock the Notifications