వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

vastu tips: అప్పుల బాధలు పడలేకపోతున్నారా? ఈ వాస్తుదోషాలు సరి చేసుకోండి!!

|
Google Oneindia TeluguNews

ఎంత కష్టపడి పనిచేసినా చాలామంది ఆర్థిక ఇబ్బందులతో రుణ బాధలతో బాధపడుతూనే ఉంటారు. ఎప్పుడూ ఇంట్లో డబ్బుల కొరత వారిని వేధిస్తూనే ఉంటుంది. ఎంత కష్టపడి పని చేసినా వారి జీవితం సంతోషంగా ఉండదు. అసలు ఎందుకిలా జరుగుతుంది? ఏ కారణాలతో ఇలా జరుగుతుంది? అంటే వాస్తు శాస్త్ర నిపుణులు ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే ఇలా జరుగుతుంది అని చెబుతున్నారు. వాటిని సరి చేసుకుంటే రుణ బాధల నుండి విముక్తి లభిస్తుందని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెబుతున్నారు. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులకు, రుణ బాధలకు కారణమయ్యే వాస్తు దోషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఉత్తరం వైపు ఈ పనులు చేస్తున్నారా?

ఉత్తరం వైపు ఈ పనులు చేస్తున్నారా?

ముఖ్యంగా ఇంట్లో ఉన్న వాళ్ళు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంటే వారు ముందుగా ఉత్తర దిశలో ఏవైనా వాస్తు దోషాలు ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. ఉత్తర దిశకు అధిపతి కుబేరుడు. సంపదకు అధిపతి అయిన కుబేరుడు ఉన్న దిశలో ఏవైనా తప్పులు చేస్తే అప్పులవ్వడమే కాకుండా, ఆర్థిక ఇబ్బందులు వేధిస్తాయి. ఉత్తరం వైపున ఏదైనా భారీ ఫర్నిచర్ పెట్టిన, లేదా ఇతర భారీ వస్తువులను ఉత్తరం వైపున ఉంచినా , ఉత్తర దిశ గోడపైన ఏవైనా వస్తువులను వేలాడదీసిన వాటి ప్రభావం మన ఆర్థిక పరిస్థితి పై తప్పకుండా ఉంటుందని చెబుతున్నారు. ఇక ఇటువంటి దోషాలు చేయకుండా చూసుకోవాలని, ఉత్తరం దిక్కును ఎప్పుడు క్లీన్ గా ఖాళీగా, ఓపెన్ గా ఉంచాలని చెబుతున్నారు.

ఈ వాస్తు దోషాలుంటే సరి చేసుకోండి

ఈ వాస్తు దోషాలుంటే సరి చేసుకోండి


అంతేకాదు సాధారణంగా దక్షిణం దిశ గోడ కొంచెం ఎత్తుగా, ఉత్తరం దిశ గోడ కొంచెం ఎత్తు తక్కువగా ఉండాలి. అలా కాకుండా అందుకు భిన్నంగా ఉత్తరం వైపు గోడ కొంచెం ఎత్తుగా ఉండి, దక్షిణం వైపు గోడ ఎత్తు తక్కువగా ఉంటే కూడా అప్పుల పాలు అవుతారని, ఆర్థిక సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఇక ఇంటి నిర్మాణం చేస్తున్నప్పుడు ఉత్తర దిశను పూర్తిగా మూసేసి, దక్షిణ దిశను ఖాళీగా ఉంచినా కూడా ఇటువంటి ఇబ్బందులే వస్తాయని చెబుతున్నారు. ఇక నైరుతి దిశలో భూగర్భ నీటి ట్యాంకును ఏర్పాటు చేసినా అప్పుల పాలయ్యే అవకాశం ఉందని, ఇటువంటి పనులు చేయకూడదని చెబుతున్నారు.

ఈశాన్య దిశలో ఇవి ఉన్నాయా? చెక్ చేసుకోండి

ఈశాన్య దిశలో ఇవి ఉన్నాయా? చెక్ చేసుకోండి

ఇక ఇంటికి ఈశాన్య దిశలో ఏవైనా యంత్ర పరికరాలు పెట్టి వాటిని వినియోగిస్తున్నా వాస్తు దోషమేనని చెబుతున్నారు. ఈశాన్య దిశలో పొరపాటున కూడా బరువైన యంత్ర పరికరాలు పెట్టకూడదని, ఒకవేళ పెట్టినట్లయితే మన జీవితం పైన కూడా ఆర్థిక ఇబ్బందులు అంతే భారంగా మారతాయని సూచిస్తున్నారు. ఇక అప్పులపాలై ఇబ్బందులు పడుతున్న వారు అప్పుల నుండి విముక్తి పొందడం కోసం ఇంటికి సంబంధించి ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య దిక్కుల విషయంలో జాగ్రత్తలు వహించాలని చెబుతున్నారు.

Disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

vastu tips: నైరుతి అభిముఖంగా ఇల్లు.. ఈ వాస్తు నివారణలతో ఇకపై అశుభం కాదు!!vastu tips: నైరుతి అభిముఖంగా ఇల్లు.. ఈ వాస్తు నివారణలతో ఇకపై అశుభం కాదు!!

English summary
facing problems with debts? But correct these Vastu Doshas in North and North East direction.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X