vastu tips: ఇంట్లో ఏనుగుబొమ్మలు పెట్టుకోండి; ఆనందం, ఐశ్వర్యం.. ఆపై జరిగే అద్భుతాలు మీరేచూడండి!!
ఇంట్లో పెట్టుకునే గృహాలంకరణ వస్తువుల విషయంలో కూడా వాస్తు ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇంట్లో ఎప్పుడూ సానుకూల ప్రభావం ఉండే వస్తువులనే పెట్టుకోవాలని, ప్రతికూల ప్రభావం ఉండే వస్తువులను, బాధను కలిగించే, ఘర్షణలను చూపించే పెయింటింగ్స్ ను పెట్టకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు ఇప్పటికే చెప్పారు. అయితే ఇంట్లో పెట్టుకోవాల్సిన డెకరేషన్ వస్తువులలో ఏనుగులను పెట్టుకుంటే లాభం చేకూరుతుందని చెబుతున్నారు. ఇంటి అలంకరణలో ఏనుగుల స్థానం గణనీయమైనదని భారతీయ వాస్తు శాస్త్రం తో పాటు, చైనా జపాన్ వాస్తుశాస్త్రమైన ఫెంగ్షుయ్ కూడా పేర్కొంది.

గృహాలంకరణ వస్తువులుగా ఏనుగులు .. వివాహబంధంలో ఆనందం
ఈరోజు వాస్తు శాస్త్రంలో ఏనుగులను గృహాలంకరణ వస్తువులుగా ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం. వాస్తు శాస్త్రం ప్రకారం, ఒక జత ఏనుగులను ఇంట్లో ఉంచడం చాలా శుభప్రదం. ఇది వైవాహిక జీవితంలో ఆనందం మరియు ప్రేమను తెస్తుంది. ఇది పరస్పర సంబంధాన్ని మరింత బలపరుస్తుంది. ఏనుగుల జంటను ఇంట్లో ఉంచుకోవడం వల్ల కలిగే లాభాలు తెలుసుకునే ముందు ఏనుగులకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

ఏనుగుకు ప్రత్యేక లక్షణాలు.. అందుకే ఏనుగుబొమ్మలు ఇంట్లో ఉంచుకుంటే పాజిటివ్ వైబ్స్
ఏనుగు చాలా కష్టపడి పనిచేసే మరియు తెలివైన జంతువు. అలాగే, ఏనుగులకు కుటుంబ సమూహంలో, ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది, అవి గౌరవించబడతాయి. ఏనుగుల కుటుంబ పెద్ద అందరినీ తన వెంట తీసుకుని వెళుతుంది. సమూహంలో ఐక్యతను కాపాడుతుంది. ఎక్కడికైనా వెళ్లినప్పుడల్లా కుటుంబంతో సహా వెళ్లి అందరినీ ఆదుకుంటూ గుంపులో ముందు వరుసలో నడవడం ప్రధానంగా ఏనుగులలో గమనించవలసిన ముఖ్యమైన విషయం. ఏనుగులు ఎంతటి తెలివైన జంతువులో దీనిని బట్టి అర్థం అవుతుంది. అందుకే వాటిని ఇంట్లో ఉంచుకుంటే పాజిటివ్ వైబ్స్ ఇంట్లో ఉంటాయని అంటున్నారు.

ఆర్ధిక కష్టాలకు చెక్.. సిరిసంపదలు ఫుల్..
ఆర్థిక కష్టాలు తొలగిపోయి, సిరిసంపదలు రావాలంటే, కుటుంబం మొత్తం ఏకతాటి మీద పటిష్టంగా ఉండాలంటే ఇంట్లో ఏనుగు బొమ్మలు పెట్టుకోవడం మంచిదని వాస్తుశాస్త్రం చెబుతోంది. ఎవరైతే ఏనుగు బొమ్మలను ఇంటికి తెచ్చుకుంటారో వారికి అదృష్టం కలిసొస్తుందని, కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు .

ఏనుగులు ఇలాగే ఉండాలి మరి ..
ఇక ఏనుగు బొమ్మ ను కొని తెచ్చుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఇంట్లో పెట్టుకునే ఏనుగు బొమ్మ లో ముఖ్యంగా ఏనుగు తొండం పైకి ఉండే బొమ్మలు మంచివని సూచిస్తున్నారు. లక్ష్మీ దేవి ఫోటోలలో కూడా రెండు ఏనుగులు తొండాలు పైకెత్తి ఉండటాన్ని మనం గమనించవచ్చు. అందుకే తొండం పైకెత్తిన ఏనుగు బొమ్మలు సిరి సంపదలు చేకూరుస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతారు. అంతేకాదు తల్లి పిల్లల బంధం బలంగా ఉండాలంటే ఓ తల్లి ఏనుగు, పిల్ల ఏనుగు బొమ్మలు ఇంట్లో పెట్టుకుంటే మంచిదని సూచిస్తున్నారు.

భార్యాభర్తల బంధం బలంగా ఉండాలంటే జంట ఏనుగుల బొమ్మలు ఇంట్లో
ఇక భార్యాభర్తల బంధం బలంగా ఉండాలంటే జంట ఏనుగుల బొమ్మలను ఇంట్లో ఉంచుకోవడం మంచిదని సూచించబడింది. ఇక పిల్లల గదులలో ఏనుగు బొమ్మలు ఉంచితే పిల్లలు చదువులో బాగా రాణిస్తారని చెబుతారు . ఆఫీసు ఫ్రంట్ డోర్ ముందు ఏనుగు విగ్రహాన్ని ఉంచితే వారు తమ తమ వృత్తులలో రాణిస్తారు అని, ఎలాంటి వ్యాపారమైనా లాభాల బాట పడుతుందని చెబుతారు. ఆఫీస్ టేబుల్ పై బొమ్మలను ఉంచుకోవడం వల్ల నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని, ఒత్తిడిలో కూడా పని చేసే నైపుణ్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు.

గేటు వద్ద ఏనుగుల బొమ్మలున్నా నెగిటివ్ ఎనర్జీ కి చెక్..
అంతేకాదు గేటు వద్ద రెండు ఏనుగు బొమ్మలను ఉంచితే ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ రాకుండా కాపాడుకోవచ్చని చెబుతున్నారు. చాలా ఆలయాల వద్ద, ఆలయాలకు ముందు ఏనుగు బొమ్మలు ఉండడాన్ని ఈ సందర్భంగా వాస్తు శాస్త్ర నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఇంట్లో ఏనుగుల పెయింటింగ్స్ ఉన్నా, ఏనుగులు ఉన్న బెడ్ షీట్స్, పిల్లో కవర్స్, కర్టెన్ లు ఉన్న మంచిదేనని సూచిస్తున్నారు. ఇంకెందుకాలస్యం గృహాలంకరణలో ఏనుగుల పాత్ర కీలకమని గుర్తించినవారు ఇంట్లో అందమైన ఏనుగు బొమ్మలు తెచ్చి పెట్టుకోండి. జీవితంలో సుఖ సంతోషాలతో పాటు, సంపదను పొంది ఆనందంగా జీవించండి.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్












Click it and Unblock the Notifications