అక్షయ తృతీయ: బంగారం ఎందుకు కొంటారు?

Posted By:
Subscribe to Oneindia Telugu

వైశాఖ శుక్ల తదియ అక్షయ తృతీయ వైశాఖ శుక్ల తృతీయ అక్షయ తృతీయ అనీ, ఈ పర్వం పూర్వాహ్లా వ్యాపిని అనీ వ్రతరాజము చెబుతూ ఉంది. అక్షయ తృతీయ గొప్ప పుణ్యదినం. అక్షయ తదియ పోమవారమునాడుకాని, బుధవారమునాడుకాని అయితే మరీ పవిత్రమైనది, కృత్తిక రోహిణీ నక్షత్రముతో కూడిన ఈ పర్వం అతిప్రశస్తం.

"వైశాఖే మాసి రాజేంద్రశుక్ల పక్షేతృతీయకా,
అక్షయాసాతిభిః ప్రోకా కృత్తికా రోహిణీయతా", అని శాస్ర ప్రమాణము.

ఈనాడు చేసే దానాలు అక్షయ ఫలాన్ని ఇస్తాయి అనీ చెబుతారు. దానాలేకాదు ఈనాడు దేవతలను గుణించి, పితృదేవతలను గుణించి చేసే పూజలు కూడా అక్షయ ఫలాన్ని ఇస్తాయి. ఈ దినమునందు బంగారము కొంటే సంపద వృద్ధి అవుతుంది అని పెద్దల మాట.

What is Akshaya Triteeya?

అక్షయ తృతీయ వ్రతము

పూర్వకాలంలో దరిద్రుడు, ప్రియవాది, సత్యవంతుడు, దేవగురు జనభక్తుడు ఐన ఒక కోమటి ఉండెను. అతను ఒకసారి వైశాఖమాస శుక్లపక్ష మహాత్స్యము పెద్దల వలన విని అక్షయతృతీయనాడు గంగాస్నానం చేసి ఇంటికి వచ్చి దేవపూజచేసి లడు, విసిని కర్రలు దానము చేశాడు. ఆ కోమటి ఉత్తర జన్మలో కుశవతి నగరంలో ధనవంతుడైన ఒక క్షత్రియని యింట పుట్టాడు. ఆ జన్మలోనూ అతడు దాననిరతిని వీడలేదు. ఎంతగా దానము చేస్తూ ఉన్నా అతని సంపద క్షయం కాక అక్షయమవుతూ ఉండింది. ఇది అంతా అక్షయ తృతీయ వ్రతాచరణ ప్రభావము.

వ్రతోత్సవ చంద్రికాకారుడు ఈ వ్రత విధానాన్ని వివరిస్తూ విశేషాలు ఇలా తెలుపుతున్నారు.

"ఈ రోజున గంగాస్నానం చేసేవారు సకల పాపవిముక్తులు అవుతారు. పితృదేవతలకు తర్పణాదులు విడవాలి. లక్ష్మీసహితమైన నారాయణుని, గౌరీసహితుడైన త్రిలోచనుని పూజించాలి. ఆ పూజా సమయంలో విసనకర్రలు, లడు పంచిపెట్టినవారు వైకుంఠాన్ని శివలోకాన్ని పొందుతారు.

యవలతో అనం వండి దేవుడికి ఆరగింపు చేయాలి. గురువులకు నవధాన్యాలు, గ్రీష్మ ఋతువులో లభ్యమయ్యే ఇతర వస్తువులతో కలిపి దానం చేయాలి. ఈనాటి దానాల్లో జలపూరిత కుంభం ముఖ్యమైంది. ఈనాడు ఒంటి పూటే భోజనం చేయాలి. ఈ వ్రతం కేవల ధార్మిక గుణ సంపన్నమైనది. అందువల్ల ఈ పండుగ అట్టే ఆర్భాటంతో జరిగేది కాదు.
ఈనాటి వివరణలో పంచంగ కర్తలు అక్ష తృతీయ

(1) దధ్వను పాదుకోపానహదానాని ఉద కుంభదానం - అక్షయ తృతీయనాడు పెరుగు అన్నము, విసనకట్టలుపాదుకలు, చెప్పలు, ఉదకుంభము మున్నగునవి దానము చేయాలని చెప్పబడిఉంది.

2)లక్ష్మీనారాయణపూజా - స్మృతికౌస్తుభములో, తిధితత్వములో, పురుషార్థ చింతామణిలో ఈనాడు విష్ణుపూజ చేయాలని కలదు.

(3) గౌరీ పూజా, త్రిలోచన గౌరీవ్రతం,

(4) త్రేతాయుగాది

(5) బలరామజయంతి

(6) సింహాచలక్షేత్రే చందనమహోత్సవః' అని వ్రాస్తారు. ఈ ఆరు విషయాలను క్రమంగా వివరించుకుందాము.
వైశాఖ మాసంలో వైశాఖపూజ' అనే పేరుతో సంపన్న గృహస్తులు ఒక వ్రతం చేస్తూ ఉండిరి. అందులో వేసవికి అవసరమైనవి వేసవిలో బాగా దొరికే మామిడి పళ్ళు పనస తొనలు మున్నగునవి కూడ పంచిపెట్టేవారు. వేసవికి అవసరమైనవి, వేసవిలో దొరికేవి అయిన వస్తువులు విరివిగా దానం చేయడం అక్షయ తృతీయావ్రతం యొక్క ప్రధానోద్దేశ్యమని ద్యోతకమవుతూ ఉంది.

ఉదకుంభదానము

ఈనాటి విధాయక కృత్యాలలో ఉదకుంభదానం ఒకటి. వైశాఖ మాసం నుండి ఎండలు మెండుగా ఉంటాయి. ఎండల రోజుల్లో కుండల్లో జాగ్రత్తపెట్టిన నీరు పుచ్చుకుంటే బాగా దాహశాంతికరంగా, ఆప్యాయంగా ఉంటుంది. కావుననే నీటితో నిండిన కుండల్ని ఈ కాలంలో దానం చేయడం మతవిధుల్లో ఒకటిగా మన పెద్దలు నిర్ణయించారు.

లక్ష్మీనారాయణ పూజ

సంవత్సరంలో ఇతర యుగాదులు ఇలా ఉన్నాయి.

దక్షిణాదిని కొన్ని ప్రాంతాల్లో భాద్రపద శుద్ధ తదియనాడు బలరామ జయంతి జరుపుతారని తెలుస్తున్నది.
బలరాముడు దేవకి ఏడవ గర్భమున అనంతాంశమున పడగా యోగమాయ ఆగర్భమును స్రవింప రోహిణి కడుపున చేర్చిందనీ, భాద్రపద మాసం కృష్ణపక్షాష్టమినాడు రోహిణి నక్షత్రమున రోళ్లింgశి సంకర్షణుడు అనే పుత్రుని కన్నది అని పద్మపురాణము చెప్పచున్నది. కాని భాద్రపద కృష్ణాష్టమిని స్మృతి కౌస్తుభము మున్నగు వ్రత గ్రంధాలేవీ బలరామజయంతిగా పేర్కోవటం లేదు. పురుషార్థచింతామణి మున్నగు గ్రంథాలు అక్షయ తృతీయను పరశురామ జయంతిగా చెబుతున్నాయి. కానీ మన పంచాంగాలలో పరశురామ జయంతి మార్గశిర బహుళ విదియనాడు అని ఉంటున్నది.

వ్రత గ్రంథాలలో వేలొక తిథి పేర్కొన బడక పోవడంచేత మన పంచాంగాలు పేర్కొనడం చేత అక్షయ తృతీయనాడే బలరామ జయంతి అని నిర్ధారిద్దాము.

రోహిణి యందు ఆదిశేషుడు బలరాముడుగ పుట్టాడని పురాణగాథ. విష్ణుమూర్తి కృష్ణావతారం ఎత్తినప్పడు ఇతడున్నూ అవతారమెత్తాడు. కృష్ణుని కంటే ఇతడే ఒక విధముగా గొప్పవాడనే ధోరణి మాటలు క్షేమేంద్రకవి చారు చర్యలో కనిపిస్తున్నాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Astrologer explained the importance of Akshaya Triteeya and also says why it is a special event.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి