పుష్కరాల ప్రత్యేకత: 12రోజులు అనుసరించాల్సిన నియమాలు!

Subscribe to Oneindia Telugu

యస్మిత్ దినే సురగురు: తులారాశి గతో భవేత్ తద్దినే 

కావేర్యా వై స్నాతో యుక్తి పదంభవేత్

సురగురువైన బృహస్పతి కన్యారాశిలో ప్రవేవించిన సమయంలో కృష్ణవేణీ నదిలో స్నానం చేయడం వల్ల సద్దతులు కలుగుతాయి. అన్ని స్నానాలలో కెల్లా నదీస్నానం ఉత్తమమైనది. నీరు నదీరూపంలో ఉన్నప్పుడు ఆ ప్రవాహాన్ని మాతృమూర్తిగా భావించే సంప్రదాయం మనది.

అటువంటి నదీమతల్లికి పుష్కరకాలం వచ్చిందంటే ఆ 12 రోజులు కూడా 12 పర్వదినాలతో సమానమే.
చాక్షుష మన్వంతరంలో జరిగిన సంఘటన ఆధారంగా బ్రహ్మపెద్ద భార్య స్వర శాపానికి గురికావడంతో దేవతలంతా నదీరూపాన్ని ధరించారని పద్మపురాణం చెబుతోంది. అప్పటినుంచి నదుల్ని దేవతా స్వరూపాలుగా పూజిస్తున్నారు.
జన్మప్రభృతి యత్పాపం స్త్రియావా పురుషేణవా పుష్కరే స్నాతమాత్రస్య సర్వమేవ ప్రణశ్యతి

నీటితో చేసే స్నానానికి వరుణస్నానమని పేరు. నదులకు అధ్యక్షుడు వరుణుడు. ఆయనకు సంబంధించిన స్తోత్రాలలో నదీస్నాన పుణ్యఫలాలను గురించిన వివరాలు విశేషంగా కనిపిస్తున్నాయి. పుష్కరం అనే మాటకున్న విభిన్నమైన అర్థములలో పవిత్రీకృత జలం అనే అర్థములు ప్రసిద్ధమైనవి. పుష్కరకాలంలో నదులలో త్రిమూర్తులు, ఇంద్రాది దేవతలు, పితృదేవతలు, ఋషులు నివసిస్తారు. మూడున్నరకోట్ల తీర్థములు కలుస్తాయి. అందుకే పుష్కరస్నానం అనంత పుణ్యప్రదం.

What is the importance of Pushkaralu

"మూర్తీభవించిన ఆనందస్వరూపులైన జలదేవతలారా! మీవద్దనుంచి ఆనందమాధుర్యాన్ని పొందడం కోసం మిమ్మల్ని ఉత్సాహంతో సమీపిస్తున్నాం. మీరు మాకు సకలైశ్వర్యాలను ప్రసాదింతురు గాక!" అని స్తోత్రం చేసూ పుష్కర స్నానం చేస్తారు. వేయియాగాలతో సమానం పుష్కరస్నానం.

స్నాన০ దైవిక కార్యక్రమాలేవీ స్నానం చేయకుండా ఆరంభించరు. స్నానం శారీరక మాలిన్యం నుంచి మాత్రమే కాదు మనోమాలిన్యం నుంచి కూడా ముక్తిని ప్రసాదిస్తుంది. స్నానం కూడా ఔషధమే. శరీరమూ, మనసూ స్నానం వల్ల పరిశుద్ధమవుతాయి.

సూర్యోదయానికి పూర్వం చేసే స్నానమే సత్ఫలితాలనిస్తుంది. స్నానం వల్ల చురుకుదనం, ఉత్సాహం త్రిగుణీకృతమై కార్యక్రమాలన్నీ వేగవంతంగా పూర్తవుతాయి. సూర్యకిరణాలలో కొన్నిరకాల రుగ్మతలను నివారించే శక్తి ఉంటుంది. నదులు, చెరువుల నీటికి ఆ శక్తి లభిస్తుంది.

అందుకే వాటిలో చేసే స్నానం ఫలప్రదమైనది. రెండుపూటలా చన్నీటి స్నానమే శ్రేష్టం. సముద్రస్నానం మిత్రద్రోహ, బ్రహ్మహత్యాది పాపాలను సైతం తొలగింపచేస్తుంది. పునర్జన్మ లేకుండా వైకుంఠప్రాప్తి కలిగిస్తుంది. గ్రహదోషాలు పోతాయి

స్నానం తరువాత తడిపి, నీళ్లు పిండివేసిన వస్త్రంతో తుడుచుకోవాలి. లేదా ఉతికిన పొడివస్త్రం ఉపయోగించాలి. తడిగుడ్డలతో దైవకార్యాలు చేయకూడదు. పితృకర్మలూ, పిండప్రదానాలూ చేయవచ్చు. ప్రాతఃకాలంలో అయిదుగంటలకు పూర్వం స్నానం బుషి స్నానం. మిక్కిలి శ్రేష్టమైనది. అయిదు నుంచి ఆరులోపుగా చేసేది దేవస్నానం. ఆరు నుంచి ఏడులోపు మానవస్నానం.

ఆ తర్వాత చేసేది రాక్షస స్నానం. అనారోగ్యం వల్లనో, మరే కారణాల వల్లనో స్నానం చేయలేకపోతే నిర్మల హృదయంతో నిరంజనుడిని స్మరించడం మానస స్నానం అవుతుంది. శ్రీ మహా విష్ణు స్మరణతో కాని కానీ, తులసి, మారేడు దళాలు కలిసిన జలంతో కాని సంప్రోక్షించుకుంటే ధ్యాన స్నానమవుతుంది.

ఉత్తరాయణంలో ఎండా, వాన కలిసినప్పుడు తడిస్తే అది దివ్యస్నానం. తడిగుడ్డ చేత దేహాన్ని తుడుచుకుంటే కపిలస్నానం అనిపించుకుంటుంది. ఆపోహిషామయోభువః అనే మంత్రాన్ని జపిసూ సంధ్యావందనాది సందర్భాలలో జలాన్ని ప్రోక్షించుకుంటే మంత్రస్నానం అవుతుంది.

మహిమాన్వితమైన గాయత్రీమంత్రాన్ని జపిసూ నీటిని అభిమంత్రించి శిరస్సుమీద చల్లుకుంటే గాయత్రీ స్నానమవుతుంది. దీనివల్ల సకల గ్రహదోషాలు తొలగిపోతాయి. "
భారతీయులకు ఏ నది అయినా వట్టి నదిమాత్రమే కాదు.

అది మన తల్లి తెలిసో తెలియకో చేసిన దైహిక మానసిక మలినాలను తొలగించే పవిత్రవస్తువు. ఆకాశం నుంచి పడిన నీరు ఏరై నదియై మొత్తం సాగరంలో సంగమించే ప్రక్రియ
జీవితానికి ఒక సందేశమిస్తుంది.

మనిషి మనిషితో మానవత్వంతో కలిసిమెలసి ముందుకు సాగితే అది వానికి ఎదుటివానికి ఎలాంటి శక్తిని ఇస్తుందనే సత్యాన్ని కృష్ణమ్మ చాటుతోంది. కృష్ణనాటి నుంచి నేటిదాకా ఎన్నో తరాలను కన్నది. మానవుల పాపాల్ని కడుగుతూనే ఉంది. ఏనాడూ విసుగు పొందలేదు. కాబట్టి మనం దానిని కాపాడుకోవాలి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Pushkaralu or Pushkaram Pushkara or Pushkar is an important Indian festival dedicated to worshiping of sacred rivers. It is celebrated at shrines along the banks of 12 major sacred rivers in India, in form of ancestor worship, spiritual discourses, devotional music and cultural programmes.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X