• search

యజ్ఞోపవీతము అంటే ఏమిటి, ఎలా ధరించాలి?

By Srinivas
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు, ప్రముఖ ఇంటర్నేషనల్ జ్యోతిష్యులు -9440611151
  జ్ఞాననిధి, జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
  ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్", ఎం.ఏ తెలుగు (ఏల్), ఎం. ఏ సంస్కృతం, ఎం.ఏ యోగా,
  యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ, ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం),
  పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు, మరియు రత్న శాస్త్ర నిపుణులు.
  సునంద రాజన్ జ్యోతిష,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

  యజ్ఞోపవీతాన్ని 'బ్రహ్మసూత్రం' అని కూడా అంటారు.

  దీన్ని ఎందుకోసం ధరించాలో ధర్మశాస్త్రాలు ఈ విధంగా చెబుతున్నాయి.

  'సూచనాత్ బ్రహ్మతత్త్వస్య వేదతత్త్వస్య సూచనాత్
  తత్సూత్రముపవీతత్వాత్ బ్రహ్మసూత్రమితి స్మృతమ్' బ్రహ్మ తత్త్వాన్ని సూచించడానికి, వేదతత్త్వాన్ని సూచించడానికి బ్రహ్మసూత్రాన్ని (యజ్ఞోపవీతాన్ని) ధరించాలి.
  అదే ఉపవీతం.అనగా రక్షణ వస్త్రం.

  యజ్ఞోపవీతము నిర్గుణ విశ్వకర్మ స్వరూపమును సుగుణస్వరూపంను గ్రహించుటకు చిహ్నంగా ఉన్నది.అందుకే ఇది బ్రహ్మసూత్రమైనది.

  ఉపపయనంలో ఒక ముడి ఐదు పోగులుగా,
  వివాహంలో ఐదు ముడులు 25 పోగులుగా ధరించాలి.

  ఏక ముడి యజ్ఞోపవీతము నిర్గుణ విశ్వబ్రహ్మ స్వరూపంగా,
  పంచ ముడుల యజ్ఞోపవీతము సుగుణ విశ్వబ్రహ్మ రూపము తెలియజేయును.

  వైదిక సంస్కారాలతో పరిచయం ఉన్న ప్రతి వారికీ సుపరిచితమైంది 'యజ్ఞోపవీతం'.
  దీనినే తెలుగులో 'జంధ్యం' అంటాం.

  ఇది చాలా మంది మెడలో వేలాడుతూ ఉంటుంది కానీ ఇది అలా ఎందుకు వేలాడుతుందో చాలా మందికి తెలియదు.

   What is Yagnopaveetham?

  ఇలా మెడలో ఈ యజ్ఞోపవీతాలను వేసుకున్న వారు నిష్టతోనూ కొందరు ఆచారం మీద మక్కువతోనూ కొందరు ఇతరుల ముందు ప్రదర్శన కోసం మరి
  కొందరు అవసరార్థం ఉపయోగించేవారుగా కనపడతారు.

  యజ్ఞోపవీతాన్ని, శిఖనూ తప్పని సరిగా ధరించాలని స్మృతులు పేర్కొంటున్నాయి.యజ్ఞోపవీతం పరమ్ పవిత్రమైనది. 

  అది ప్రజాపతి అయిన బ్రహ్మతో కలిసి పుట్టిందని 'యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్...' అనే మంత్రం చెబుతోంది.

  యజ్ఞోపవీతాన్ని నవ తంతువులతో ( తొమ్మిది దారపు పోగులతో ) నిర్మించాలి.

  ఒక్కొక్క తంతువునకు ఒక్కొక్క దేవత ఉంటాడని స్మృతుల కథనం -

  'ఓంకారో హోగ్నిశ్చ నాగశ్చ సోమః పితృప్రజాపతీ
  వాయుః సూర్యశ్చ సర్వశ్చ తన్తుదేవా అమీ నవ
  ఓంకారః ప్రథమే తంతౌ ద్వితీయేహోగ్నిస్థథైవ చ
  తృతీయ నాగదైవత్యం చతుర్థే సోమదేవతా
  పంచమే పితృదైవత్యం షష్ఠేచైవ ప్రజాపతిః
  సప్తమే మారుతశ్చైవ అష్టమే సూర్య ఏవ చ
  సర్వేదేవాస్తు నవమే ఇత్యేతాస్తంతు దేవతాః'

  మొదటి తంతువులో ఓంకారం,

  రెండవ తంతువులో అగ్నిదేవుడు,
  మూడవ తంతులో నాగదేవత,
  నాలుగవ తంతువులో సోమదేవుత,
  ఐదవ తంతువులో పితృదేవతలు,
  ఆరవ తంతువులో బ్రహ్మదేవుడు,
  ఏడవ తంతువులో వాయుదేవుడు,
  ఎనిమిదవ తంతువులో సూర్యుడు,
  తొమ్మిదవ తంతువులో మిగిలిన దేవతలందరూ ఉంటారని ఈ శ్లోకాల్లోని పరమార్థం.

  'యజ్ఞోపవీతం' కేవలం తంతు మాత్రమే కాదని అదొ తొంభైయారు విషయాలకు ప్రతీక అని సామవేదఛాందోగ్య పరిశిష్టం చెబుతోంది

  '.
  తిథివారం చ నక్షత్రం తత్త్వవేదగుణాన్వితమ్
  కాలత్రయం చ మాసాశ్చ బ్రహ్మసూత్రం హి షణ్ణవమ్'
  ఈ శ్లోకంలో తాతపర్యం ఇది.

  తిథులు15,
  వారాలు 7,
  నక్షత్రాలు 27,
  తత్త్వాలు 25,
  వేదాలు 4,
  గుణాలు 3,
  కాలాలు 3,
  మాసాలు 12 మొత్తం 96 .

  అంటే యజ్ఞోపవీతాన్ని ధరించిన వారికి తిథులలోనూ, వారాలలోనూ,
  నక్షత్రాలలోనూ, తత్త్వాలలోనూ,
  వేదాలలోనూ, గుణాలలోనూ,
  కాలాలలోనూ, మాసాలలోను పవిత్రత ఏర్పడి అవన్నీ ధరించిన వారికి శుభఫలాలను కలిగిస్తాయని అర్థం.

  'యజ్ఞోపవీతం' తొంభైయారు కొలతలతో కూడి ఉండాలని 'వశిష్ఠస్మృతి' చెబుతోంది.

  'చతుర్వేదేషు గాయత్రీ చతిర్వింశతికాక్షరీ
  తస్మాచ్చతుర్గుణం కృత్వా బ్రహ్మతంతుముదీరయేత్'
  నాలుగు వేదాల్లోనూ గాయత్రీ మంత్రం 24 అక్షరాలుగానే ఉపదేశించబడింది.

  అందువల్ల ఆ మంత్రంలోని అక్షరాల సంఖ్యకు నాలుగింతలుగా అంటే (24X4=96) తొంభైయారు తంతువులుగా యజ్ఞోపవీతాన్ని నిర్మించుకుని ధరించాలని ఉపదేశం.గాయత్రి మంత్రాన్ని స్వీకరించే సమయంలో ధరించేది యజ్ఞోపవీతం.కనుక గాయత్రీ మంత్రాక్షరాలకు నాలుగింతల సంఖ్యతో కూడిన తంతువులు ఉండాలని తాత్పర్యం.

  యజ్ఞోపవీతాన్ని ఏ పరిమాణంలో తయారు చేసుకోవాలో సాముద్రిక శాస్త్రం చక్కగా ప్రబోధిస్తోంది.

  'పృష్ఠదేశే చ నాభ్యాం చ ధృతం యద్విందతే కటిమ్

  తద్ధార్యముపవీతం స్యాత్ నాతిలంబం నచోచ్చ్రితమ్
  ఆయుర్హ రత్యతిహ్రస్వం అతిదీర్ఘం తపోహరమ్
  యశో హరత్యతి స్థూలం అతి సూక్ష్మం ధనాపహమ్'
  అంటే యజ్ఞోపవీతం నడుము వరకు మాత్రమే వేలాడుతుండాలి.

  దానికంటే పైన గానీ, క్రిందుగాగానీ ఉండడం మంచిది కాదు.

  మరీ చిన్నగా ఉంటే ఆయుష్యం తగ్గిపోతుంది. మరీ పొడవుగా ఉంటే చేసిన తపస్సు నశిస్తుంది.
  లావుగా ఉంటే కీర్తి అంతరిస్తుంది.
  మరీ సన్నగా ఉంటే ధనం నష్టమౌతుంది.
  బ్రహ్మచారి ఒక యజ్ఞోపవీతాన్నీ, గృహస్థుడు రెండు యజ్ఞోపవీతాలను ధరించాలి.
  వీళ్ళిద్దరూ ఉత్తరీయానికి ప్రత్యామ్నాయంగా అదనంగా మరో యజ్ఞోపవీతాన్ని ధరించాలి.
  ఆరు నెలలు కాగానే యజ్ఞోపవీతం జీర్ణమైపోతుంది.కనుక ప్రతి ఆరు నెలలకు ఒకసారి యజ్ఞోపవీతాన్ని ధరించి, పాతబడిన దానిని తొలగించాలి.

  యజ్ఞోపవీతాన్ని ధరించే సమయంలోనూ, తొలగించే సమయంలో నిర్ధిష్ట మంత్రాలను తప్పక పఠించాలి.

  మంత్ర పఠనం కాకుండా యజ్ఞోపవీతధారణ,తీసివేయడం పనికిరాదు.గ్రహణానంతరం,పురుడుమైల,చావుమైల మొదలగు సంధర్భాలలో విధిగా యజ్ఞోపవీతాలను మార్చుకోవాలి.

  యజ్ఞోపవీతాన్ని పరిహాసం కోసం వాడడం, ఇతర వస్తువులను కట్టి అపవిత్రం చెయ్యడం ఎంతమాత్రం పనికిరాదు.

  అలాచేస్తే సమస్త పాపాలు చుట్టుకుంటాయి.
  ఒక్క మాటలో చెప్పాలంటే యజ్ఞోపవీతంలోని మన శరీరంలోని ప్రాణనాడులే!

  వాటిని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో, యజ్ఞోపవీత తంతువులను కూడా అంతే జాగ్రత్తతో సంరక్షించుకోవాలి.
  యజ్ఞోపవీతం మనిషి శ్రేయస్సు కోసం ఉపయోగపడుతుంది.

  ప్రతీ రోజు కొంత సమయాన్ని వెచ్చించి గాయాత్రిఅనుష్టానం చేసుకుంటూ
  ధర్మాన్ని ఆచరిస్తూ దైవానికి దగ్గరగా ఉండాలి.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Yagna means sacred ritual and Upaveetham means a covering. Yagnopaveetham means a sacred covering on the body without which a Yagna or a sacred ritual cannot be performed.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more