బల్లి మీద పడితే శుభమా.. అశుభమా? శరీరభాగాలపై బల్లి పడితే జరిగిదిదే!!

నిజ జీవితంలో మనం అనేక శకునాలను నమ్ముతూ ఉంటాం. పిల్లి ఎదురు పడకూడదని, కుక్క ఏడవకూడదు, బయటకు వెళ్తున్నప్పుడు భర్త మరణించిన స్త్రీ ఎదురుపడకూడదని అనేకమంది విశ్వసిస్తుంటారు. అంతేకాదు ఇక బల్లికి సంబంధించి కూడా అనేక శకునాలను నేటికీ నమ్ముతున్నారు. బల్లికి సంబంధించి మనం విశ్వసించే శకునాలు ఏమిటి? అసలు బల్లి మీద పడడం శుభమా.. అశుభమా? శరీర భాగాలలో ఎక్కడెక్కడ బల్లి పడితే ఏం జరుగుతుంది? వంటి అనేక విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం.

 శరీర భాగాలపై బల్లిపడితే.. ఒక్కో చోటుకి ఒక్కో ప్రభావం ఉంటుంది

శరీర భాగాలపై బల్లిపడితే.. ఒక్కో చోటుకి ఒక్కో ప్రభావం ఉంటుంది

హిందూ సనాతన సంప్రదాయం ప్రకారం బల్లి విషయంలో అనేక శకునాలను చాలామంది నమ్ముతుంటారు. బల్లి మన మీద పడే శరీర భాగాన్ని బట్టి మన జీవితం పై ప్రభావం ఉంటుందని చాలామంది విశ్వసిస్తారు. ఇక పురుషులకు, స్త్రీలకు శరీరంలోని వివిధ భాగాలపై బల్లి పడితే దాని ప్రభావం వ్యత్యాసం తో కూడుకొని ఉంటుంది. అంటే ఉదాహరణకు పురుషులకు కుడి వైపున బల్లి పడితే కలిగే ఫలితం, స్త్రీలకు కుడి వైపున బల్లి పడితే కలగదు. బల్లి పడే ప్రదేశం ప్రకారం వ్యక్తులకు శుభమా.. అశుభమా అనే అంశాలను అంచనా వేశారు.

 తలపైన బల్లి పడితే ఏమవుతుంది

తలపైన బల్లి పడితే ఏమవుతుంది

మగవాళ్ళకు కుడి వైపున భాగంలో బల్లి పడితే శుభం జరుగుతుందని చాలామంది విశ్వసిస్తారు. అదే స్త్రీలకు కుడి వైపున భాగంలో బల్లి పడితే అశుభం అని చెబుతారు. స్త్రీలకు ఎడమ వైపు బల్లి పడితే శుభం కలుగుతుందని నమ్ముతారు. పురుషులకు ఎడమ భాగం వైపు బల్లి పడితే అశుభ సూచకంగా పరిగణిస్తారు. ఇక ముఖం మీద బల్లి పడితే సంపద వస్తుందని, ఎడమ కంటి పై బల్లి పడితే శుభవార్త వినే అవకాశం ఉంటుందని చెబుతారు. బల్లి కుడి కంటి పై పడితే అనుకున్న పనులు పూర్తి కావు అని నమ్ముతారు. తల పైన బల్లి పడితే వివాదాలు తలెత్తే అవకాశం ఉందని, మరణ భయం వెంటాడుతుంది అని చాలామంది విశ్వసిస్తారు. అంతే కాదు తల పైన బల్లి పడితే రుణ భారం పెరుగుతుందని కూడా నమ్ముతారు.

 కలలో బల్లి కనిపిస్తే జరిగేది ఇదే

కలలో బల్లి కనిపిస్తే జరిగేది ఇదే

ఇక మగవాళ్లకు చేతి పై బల్లి పడితే ఆర్ధిక నష్టం కలుగుతుందని, ఎడమ చేతి పై బల్లి పడితే అవమానం జరుగుతుందని, మీసాల పై బల్లి పడితే తీవ్రమైన కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని నమ్ముతారు. కుడి చేతి పై బల్లి పడితే కష్టాలు వస్తాయని చెబుతారు. ఇక తొడల మీద బల్లి పడితే వస్త్ర నష్టం జరుగుతుందని భావిస్తారు. కలలో బల్లి కనిపిస్తే ప్రభుత్వాలకు సంబంధించిన అనేక ఒత్తిడులను ఎదుర్కోవాల్సి వస్తుందని, ఆందోళన కలుగుతుందని నమ్ముతారు.

 ఈ స్థానంలో బల్లిపడితే మరణ వార్త వినే అవకాశం

ఈ స్థానంలో బల్లిపడితే మరణ వార్త వినే అవకాశం

నుదిటిపై బల్లి పడితే ప్రేమికుల నుంచి ఎడబాటు కలుగుతుందని, పై పెదవి పై బల్లి పడితే గొడవలు జరుగుతాయని , ఇక రెండు పెదవులపై బల్లి పడితే మరణవార్త వినే అవకాశం ఉందని చెబుతారు. అంతేకాదు బల్లి నోటి పై పడితే ఆరోగ్య నష్టం జరుగుతుందని నమ్ముతారు. బల్లి వీపు వెనుక భాగంలో పడితే ఏదైనా విజయావకాశాలు కలుగుతాయని విశ్వాసం. బల్లి వేళ్ళపై పడితే పాత మిత్రులను కలుసుకునే అవకాశం ఉంటుందని నమ్ముతారు. ఇక రాత్రి సమయంలో బల్లి పడితే ఎటువంటి ఫలితాలు ఉండబోవని చెబుతున్నారు.

Disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+