వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఖగోళ అద్భుతాలు: 2022లో సూర్య, చంద్ర గ్రహణాల పూర్తి వివరాలివే..మామూలుగా ఉండదు మరి

|
Google Oneindia TeluguNews

ఇంకొద్ది రోజుల్లో ఈ సంవత్సరం ముగిసిపోతుంది. గత సంవత్సరం లాగే ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగిలించింది. ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి పుణ్యమా అంటూ లక్షలాది మంది మరణించారు. భారత్‌లో 4,73,537 మంది ఈ వైరస్‌కు బలి అయ్యారు. గత ఏడాది కంటే ఈ సంవత్సరంలో సంభవించిన సెకెండ్ వేవ్ తీవ్రత అధికం. గతంలో కంటే ఈ ఏడదే మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఇక మళ్లీ ఈ ఏడాది ముగింపుదశకు వచ్చే సరికి ఒమిక్రాన్ వేరియంట్ భయం ప్రపంచాన్ని వెంటాడుతోంది. ఈ వేరియంట్ ఉగ్రరూపం దాల్చే ప్రమాదం లేకపోలేదంటూ నిపుణులు హెచ్చరిస్తోన్నారు.

ఈ ఏడాది నాలుగు..

ఈ ఏడాది నాలుగు..

ఈ సంవత్సరంలో నాలుగు ఖగోళ అద్భుతాలను చూశాం. ఈ సంవత్సరంలో మొత్తం నాలుగు గ్రహణాలు ఏర్పడ్డాయి. సూర్య, చంద్ర గ్రహణాలు రెండు చొప్పున సంభవించాయి. ఈ సిరీస్ సూర్యగ్రహణంతో ఆరంభమైంది. ఈ ఏడాది మే 25-26 తేదీల్లో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. భారత్‌లో ఒకట్రెండు చోట్ల తప్ప మిగిలిన ప్రాంతాల్లో కనిపించలేదు. ఆ మరుసటి నెలలో 10వ తేదీన సూర్యగ్రహణం సంభవించింది. కిందటినెలలో 18-19 తేదీల్లో చంద్రగ్రహణం, ఈ నెల 4వ తేదీన శనివారం అమావాస్య నాడు సూర్యగ్రహణం ఏర్పడ్డాయి.

వచ్చే సంవత్సరం కూడా..

వచ్చే సంవత్సరం కూడా..

వచ్చే సంవత్సరం సూర్య, చంద్ర గ్రహణాల సంఖ్య ఇదేలా ఉండనుంది. ఈ ఏడాది మొత్తంగా నాలుగు గ్రహణాలు ఏర్పడగా.. 2022లో ఇదే సంఖ్యలో అవి ఏర్పడనున్నాయి. రెండు సూర్య గ్రహణాలు, రెండు చంద్రగ్రహణాలు సంభవిస్తాయి. సూర్యగ్రహణంతో ఈ సిరీస్ ఆరంభమౌతుంది. 2022 ఏప్రిల్ 30వ తేదీన సూర్యగ్రహణం ఏర్పడుతుంది. మధ్యాహ్నం 12:15 నిమిషాలకు గ్రహణం మొదలవుతుంది. సాయంత్రం 4:07 నిమిషాలకు ముగుస్తుంది. ఇది పాక్షిక సూర్యగ్రహణం. దక్షిణ/పశ్చిమ అమెరికా, పసిఫిక్ అట్లాంటిక్, అంటార్కిటికాల్లో కనిపిస్తుంది.

రెండో సూర్య గ్రహణం..

రెండో సూర్య గ్రహణం..

రెండో సూర్య గ్రహణం అక్టోబర్ 25వ తేదీన ఏర్పడుతుంది. ఇది కూడా పాక్షికమే. సాయంత్రం 4:29 నిమిషాలకు ఆరంభమౌతుందీ గ్రహణం. యూరప్, దక్షిణ/పశ్చిమ ఆసియా, ఆప్రికా, అట్లాంటిక్ రీజియన్లలో కనిపిస్తుంది. భారత్‌లో ఈ పాక్షిక సూర్య గ్రహణం కనిపించదు. ఏర్పడటమే పాక్షికంగా ఉంటున్నందు.. యూరప్, ఆఫ్రికా, అట్లాంటిక్ రీజియన్లల్లో ఇది అంతంత మాత్రంగానే కనిపించే అవకాశం ఉందని టైమ్ అండ డేట్ వెబ్‌సైట్ అంచనా వేసింది.

మేలో చంద్ర గ్రహణం..

మేలో చంద్ర గ్రహణం..

మేలో 15-16 తేదీల్లో చంద్ర గ్రహణం సంభవిస్తుంది. ఇది సంపూర్ణ చంద్ర గ్రహణం. దక్షిణ/పశ్చిమ యూరోప్, దక్షిణ/పశ్చిమ ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాల్లో కనిపిస్తుంది. అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్, అంటార్కిటికా, హిందూ మహాసముద్రం రీజియన్‌లల్లో ఈ సంపూర్ణ చంద్ర గ్రహణం కనిపిస్తుంది. గ్రహణ కాలం సుమారు తొమ్మిది గంటల పాటు ఉంటుంది. ఈ కాలాన్ని సూతక్‌గా భావిస్తారు.

Recommended Video

Private Cryptocurrencies In India క్రిప్టో కరెన్సీ.. తెలుసుకోవాల్సిందే..!! || Oneindia Telugu
నవంబర్‌లో రెండో చంద్ర గ్రహణం..

నవంబర్‌లో రెండో చంద్ర గ్రహణం..

నవంబర్‌ 8వ తేదీన రెండో చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. మధ్యాహ్నం 1:32 గంటలకు ఆరంభమౌతుంది. సాయంత్రం 7:27 నిమిషాలకు ముగుస్తుంది. ఇది కూడా సంపూర్ణ చంద్ర గ్రహణమే. ఇది భారత్‌లో కనిపిస్తుంది. దక్షిణ/ఈశాన్య యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహా సముద్రం రీజియన్‌ ప్రజలు ఈ సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని తిలకించవచ్చు. సుమారు ఏడు గంటల పాటు గ్రహణకాలం ఉంటుంది.

English summary
There will be a total of 4 lunar and solar eclipses in 2022. Two solar and two lunar eclipses are going to occur this year. The first solar eclipse will occur on April 30, 2022.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X