యస్పీ ముందు లొంగిపోయిన గౌరు వెంకటరెడ్డి
కర్నూలు: కాంగ్రెస్ శాసనసభ్యురాలు గౌరు చరితారెడ్డి భర్త గౌరు వెంకటరెడ్డి బుధవారం మధ్యాహ్నం కర్నూలు జిల్లా పోలీసు సూపరింటిండెంట్ ముందు లొంగిపోయారు. జంట హత్య కేసులో శిక్ష పడిన వెంకటరెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం ప్రసాదించిన క్షమాభిక్షను సుప్రీంకోర్టు రద్దు చేసింది. అంతేకాకుండా లొంగిపోవడానికి గడువు కోరిన వెంకటరెడ్డి విజ్ఞప్తిని కూడా త్రోసిపుచ్చుతూ వెంటనే లొంగిపోవాలని మంగళవారంనాడు ఆదేశించింది. దీంతో ఆయన లొంగిపోవాల్సిన అనివార్యత ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఆయన జిల్లా యస్పీ ముందు లొంగిపోయారు.
యస్పీ ముందు లొంగిపోవడానికి తన సొంత వూరు బ్రాహ్మణ కొట్కూరు నుంచి బయలుదేరి కర్నూలు చేరుకోవడంలో బోలెడు నాటకీయత చోటు చేసుకుంది. ఆయన బ్రాహ్మణకొట్కూరు నుంచి బుధవారం ఉదయం బయలుదేరారు. మూడు వాహనాల ద్వారా ఆయన ప్రయాణం సాగింది. స్థానిక మీడియా ప్రతినిధులను తప్పించుకుని ఆయన కర్నూలుకు బయలుదేరారు. లొంగిపోయే ముందు తాను మీడియా ప్రతినిధులను కలుస్తానని ఆయన మంగళవారంనాడు అన్నారు. అయితే దాన్ని ఆయన నిలబెట్టుకోలేదు.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications