నిమ్స్ లో అత్యవసర సేవలు బంద్
హైదరాబాద్: నిమ్స్‌లో అత్యవసర చికిత్స కోసం వచ్చే రోగులను ఆస్పత్రిలో చేర్చుకోవడం లేదు. ఆస్పత్రికి వచ్చే రోగులను అంబులెన్స్ నుంచి దించకముందే తిరిగి పంపిస్తున్నారు. ఉద్యోగులు సమ్మెలో ఉన్నారు, సీరియస్ కేసులు చూడడం లేదంటూ వైద్యులే రోగులను మరో ఆస్పత్రికి వెళ్లమని సలహా ఇస్తున్నారు. ఈ పరిణామంతో రోగులు వారి వెంట వచ్చిన బంధువులు మరో ఆస్పత్రికి పరుగులు తీస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచే ఇదే పరిస్థితి, దాదాపు పది కేసులను తిరిగి పంపించినట్లు సిబ్బంది తెలిపారు.
సాయంత్రం ఐదు గంటల సమయంలో రెండు అంబులెన్స్‌లు కూడా వెనుతిరిగాయి. మరో వైపు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొంత మంది రోగులను కూడా డిశ్చార్జి చేసి పంపిస్తున్నారు. ఆదివారం దాదాపు ముప్పై మంది రోగులను ఇంటి బాట పట్టించారు. కేవలం అడ్మిట్‌లో ఉన్న సీరియస్ కేసులు మినహా ఇతర కేసులను పరిశీలించడం లేదు. శనివారం దాదాపు 150 మంది డిశ్చార్జి కాగా, ఆదివారం ఈ సంఖ్య 180 దాటింది. ఎప్పుడూ రోగులతో కిటకిటలాడే నిమ్స్ ఇప్పుడు ఖాళీ పడకలతో దర్శనమిస్తోంది.
నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, ఇతర సాంకేతిక ఉద్యోగులతో కలిపి దాదాపు 12 వందల మంది వరకు సిబ్బంది సమ్మె బాట పట్టడంతో ఆస్పత్రి అధికారులు నర్సింగ్ విద్యార్థులతో సేవలు అందిస్తున్నారు. బిఎస్సీ మొదటి సంవత్సరం విద్యార్థులతో సేవలు అందిస్తుండడంతో రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. జూనియర్ నర్సులకు చికిత్సపై పూర్తి అవగాహన లేకపోవడంతో డాక్టర్లు కూడా కేసులను తిరస్కరిస్తున్నారు.
సమ్మె అనంతరమే కేసులు చూస్తామంటున్నారు. గుండె జబ్బుల విభాగంలో ఎక్కువ అప్రమత్తంగా ఉండాల్సి ఉండగా, బీఎస్సీ మొదటి సంవత్సరం నర్సులు ఆయా విభాగాలలో రోగులు అత్యవసర సేవలు అందించలేకపోతున్నారు. ప్రాథమిక చికిత్స అనుభవం లేని నర్సింగ్ విద్యార్థులతో సేవలం దిస్తున్నారని డి బ్లాక్‌లోని ఓ రోగి ఆవేదన వ్యక్తం చేశారు.
-
హైదరాబాద్‌లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications