హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పట్టు వదలని రోశయ్య కౌన్సిల్ మెట్టు

By Staff
|
Google Oneindia TeluguNews

K Rosaiah
హైదరాబాద్‌: రెండు దశాబ్దాల అనంతరం ఆర్థికమంత్రి కొణిజేటి రోశయ్య మండలిలో అడుగుపెట్టనున్నారు. 1985లో మండలి రద్దు అయినప్పుడు ఆయన అందులోను సభ్యుడిగా ఉన్నారు. కాంగ్రెస్‌ తరపున 1968లో మొదటిసారి ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ తరువాత మరో రెండుసార్లు ఎన్నికయ్యారు. 1985లో ఎన్టీఆర్‌ మండలిని రద్దు చేయటంతో మూడవ విడతలో అయిదేళ్లే కొనసాగారు. రోశయ్య కారణంగానే ఎన్టీఆర్‌ మండలిని రద్దు చేశారని అప్పట్లో చెప్పుకున్నారు.

ఆ తరువాత చీరాల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 1998లో నర్సరావుపేట ఎంపీగా గెలిచారు. మళ్లీ 2004లో చీరాలనుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్ర చరిత్రలోనే అత్యధికమార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఘనత దక్కించుకున్నారు. ఇటీవల ఆరోగ్యం సరిగా లేనందున తిరిగి పోటీ చేయనని అనటంతో ఆయనను ఎమ్మెల్సీగా పంపాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. తాజాగా అసెంబ్లీ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో రోశయ్య పేరును అగ్రభాగాన ఉంచారు. ఈరోజు ఆయన మండలి సభ్యత్వం కోసం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X